Satyabhama Serial Today March 5th: సత్యభామ సీరియల్: సంజయ్ విశ్వరూపం తెలిసి కంగుతిన్న సంధ్య.. క్రిష్‌లో మార్పు నిజమేనా!
Satyabhama Today Episode సంజయ్ తనని మోసం చేశాడని తెలుసుకున్న సంధ్య భర్తని నిలదీయడం సంజయ్ సంధ్యని వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ బాధపడుతుంటే సత్య నచ్చజెప్తుంది. వాళ్ల గురించి ఆలోచించొద్దని చెప్తుంది. క్రిష్ చేతిలో ఆస్తి పేపర్లు పెట్టి మీ నాన్న నీ ఫ్యూచర్ కోసం పంపారని చెప్తుంది. క్రిష్ మహదేవయ్య అనుకుంటాడు. సత్య క్రిష్‌తో నీ కన్న తండ్రి అని అంటుంది. క్రిష్ ఆస్తి వద్దని తనకు ఎవరి ఆస్తి వద్దని ఆస్తి పేపర్లు సత్య చేతిలో పెట్టి నా కోసం నేను సంపాదించుకుంటా నిన్ను నేనే పోషిస్తా అని అంటాడు. ఇంతలో బామ్మ వచ్చి నన్నూ నువ్వే పోషించరా అంటుంది.
క్రిష్, సత్య సంతోషపడతారు. ఇంటి నుంచి వచ్చేశాను అని బామ్మ చెప్తే క్రిష్ కోప్పడతాడు. బాపుని చూసుకునేది నువ్వు నేనే కదా నేను ఇక్కడ తగలబడ్డా మరి నువ్వు వచ్చేస్తే ఎలా బామ్మ అంటాడు. వాళ్లు నీ కోసం ఆలోచించడం లేదు వదిలేయ్ అని బామ్మ అంటుంది. బామ్మని తిరిగి వెళ్లమంటాడు. కాళ్లు పట్టుకొని తిరిగి వెళ్లిపోమని అంటాడు. బామ్మని ఒప్పించి తిరిగి తీసుకెళ్తాడు.
రేణుక: మామయ్య ఇప్పటి వరకు మీ ముందు మాట్లాడలేదు. కానీ ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది. పంతాలుకు పోతే మన నీడ కూడా మన వెంట ఉండదు మామయ్య. చిన్నా, బామ్మల విషయంలో ఒకసారి ఆలోచించండి మామయ్య.
భైరవి: నీకేం చెప్పా నువ్వేం చేస్తున్నావే. చెంప పగలగొట్టమంటావా. నువ్వేంత నీ ప్రాణం ఎంత నా పెనిమిటినే తప్పు పడతావా. ఈ ఇంట్లో దీనికి తోడు ఎవరూ లేరు అందుకే ఇలా అవుతుంది. నువ్వు ఎంత గింజుకున్నా ఎవరు రారు.
మహదేవయ్య: అమ్మా.
సంజయ్: అదేంటి గ్రానీ మళ్లీ వచ్చేశావ్ డాడ్ మీద బెంగ అయింది.
భైరవి: అదేం కాదు సత్య రానివ్వకపోయింటుంది. పాత మామ మీద కోపంతో గెంటేసుంటుంది. గతి లేక మళ్లీ ఇక్కడికే వచ్చుంటుంది.
జయమ్మ: ఇక ఆపుతావా కుళ్లు బుద్ధి ఉంటే ఇలాగే ఉంటుంది. వాడు నీ గురించే ఆలోచిస్తున్నాడురా. వాడు పక్కన లేకపోతే నీకు ఏం అవుతుందా అని వాడు భయపడుతున్నాడు. తండ్రికి దూరం అయి వాడు ఇబ్బంది పడుతున్నాడు. నీకు తల్లిని దూరం చేయొద్దని బతిమాలి నన్ను పంపాడు. ఎప్పటికీ మారుతావురా నువ్వు.
హర్ష మైత్రిని ఇక తనని వదిలేయమని బతిమాలుతాడు. మన ఫస్ట్‌నైట్ గురించి చెప్తే నందిని నిన్ను చంపేస్తుందని మైత్రి అంటుంది. దానికి హర్ష నందినిది నిజమైన ప్రేమ అని తనని వదలుకోను అని చెప్తాడు. దానికి మైత్రి ఈరోజు రాత్రిలోపు నందినితో విడాకుల పేపర్ల మీద సంతకం పట్టించకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అంటుంది. హర్ష కోపంతో చేయి రాడ్‌కి కొట్టుకుంటే రక్తం వస్తుంది. నందిని చూసి కట్టు కట్టి నువ్వు ఎందుకు ఇలా బాధ పడుతున్నావో నాకు తెలీదు కానీ నేను నీతోనో ఉంటాను. నువ్వు నన్ను మోసం చేయవు అని అంటుంది. హర్ష ఏం చేయాలో అర్థం కావడం లేదని తల పట్టుకుంటాడు.
సత్య వంట చేస్తుంటే చక్రవర్తి ఫోన్ చేస్తాడు. క్రిష్ తనకు కూడా దూరం పెడుతున్నాడని సత్య చెప్పి బాధ పడుతుంది. ఆ మాటలు క్రిష్ విని బాధ పడతాడు. క్రిష్‌ని సుడి గుండం నుంచి తప్పించలేకపోతున్నా అని ఏడుస్తుంది. క్రిష్ కూడా బాధ పడి తర్వాత సరదాగా సత్య దగ్గరకు వచ్చి మెకానిక్ బిజినెస్ చేస్తా అని రెండు రోజుల్లోషాప్ ఓపెన్ చేస్తానని అంటాడు. సత్య చాలా సంతోష పడుతుంది. కావాలనే సత్యని సంతోషపెట్టడానికి మహదేవయ్యని పూర్తిగా మర్చిపోయినట్లు యాక్టివ్‌గా మాట్లాడుతాడు. సాయంత్రానికి చికెన్ కూర వండమని చెప్పి వెళ్తాడు. ఇంతలో సత్యకి నందిని కాల్ చేస్తుంది. ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అని వెంటనే ఇంటికి వస్తానని అంటుంది. సత్య రమ్మని చెప్తుంది. నందిని సత్య దగ్గరకు బయల్దేరుతుంది.
మరోవైపు సంజయ్ రూపతో మాట్లాడుతాడు. ప్రతీనెలనీకు డబ్బు ఇస్తున్న కదా ఈ నెల కాస్త లేట్ అయితే ఫోన్ చేసి క్లాస్ ఇస్తావా. నా పెళ్లానికి తెలిస్తే సీన్ క్రీయేట్ చేస్తుంది. పేరుకే అది నా పెళ్లాం నువ్వే నా డార్లింగ్ అంటాడు. ఇంతలో సంజయ్ వెనక సంధ్య నిల్చొని సంజయ్ గొంతు పట్టుకొని నన్నే ఇంత మోసం చేస్తావా అని ఏడుస్తుంది. దాంతో సంజయ్ నీ ముఖం చూసుకున్నావా నువ్వేమైనా హీరోయిన్ మెటీరియల్ అనుకున్నావా నన్ను ప్రేమించడానికి నీ అక్కని లైన్ వేశా చీ కొట్టింది అందుకే నిన్ను లైన్ వేశా నిన్ను వాడుకొని వదిలేద్దాం అనుకున్నా ఇలా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని అంటాడు. నీది చాలా బ్యాడ్ లక్ మొగుడు బ్యాడ్ అని తెలిసి కూడా కాపురం చేయాల్సి వస్తుంది. బుద్ధిగా నా కాళ్ల దగ్గర పడుండు లేదంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. రేణుక వచ్చి సంధ్యని ఓదార్చాలని ప్రయత్నిస్తుంది. మీ అక్క కాళ్ల మీద పడమని రేణుక అంటే నేను బాధలో ఉన్నాను అంటే అక్క తట్టుకోలేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

