Satyabhama Serial Today January 21st: సత్యభామ సీరియల్: సత్య ఫోన్ కొట్టేసిన క్రిష్.. క్రిష్‌ని ఓ ఆట ఆడుకున్న నందిని, సత్యలు..!
Satyabhama Today Episode క్రిష్ సత్య ఫోన్ కొట్టేసి అదృశ్య అభిమానికి కాల్ చేయడం నందిని, సత్యలు క్రిష్‌తో ఫోన్లో మాట్లాడి క్రిష్‌ని రెచ్చగొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్‌ని సత్య అదృశ్యశక్తి అని తనని కలుస్తానని మాట్లాడుతానని ఫోన్‌లో నందినితో మాట్లాడి భర్తని ఆటపట్టిస్తుంది. నిజంగానే వేరే అబ్బాయితో సత్య మాట్లాడుతుందని తాను అన్నని బెదిరించి నామినేషన్ మీద సంతకం పెట్టిస్తే మరెవరో సత్య దగ్గర మార్కులు కొట్టేశాడని సత్యకి ఆ అదృశ్య శక్తి తానే అని చెప్పలేక తిప్పలు పడతాడు. ఇక క్రిష్ బామ్మ జయమ్మతో విషయం చెప్తాడు.
జయమ్మ: అంతా చేసింది నువ్వు అయితే వాడెవడురా సత్యతో మాట్లాడటానికి.
క్రిష్: అది తెలీకే ఇక్కడ జుట్టు పీక్కుంటున్నా.
జయమ్మ: పీక్కోవాల్సింది నీ జుట్టు కాదు వాడి జుట్టు.
క్రిష్: మాటలు సరిపోవే ఈ యువరాణి వెళ్లి ఆ అదృశ్య శక్తిని కలుస్తుందట.
జయమ్మ: వెళ్లి ఆ అదృశ్యశక్తి నువ్వే అని సత్యకి చెప్పు
క్రిష్: అలా చెప్తే సత్య సంతోషం ఆపుకోలేక ఇంట్లో వాళ్లకి చెప్తే ఆయిపోతుంది ఇక.
జయమ్మ: సత్య తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా.
సత్య: నందిని మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది. స్పీకర్ ఆన్ చేశా మీ అన్న మొత్తం విన్నాడు.
నందిని: తానే అదృశ్య శక్తి అని ఒప్పుకున్నాడా.
సత్య: లేదు
నందిని: అయితే డోస్ పెంచుతాలే.
సత్య: అయినా అచ్చం మగ గొంతుతో ఎలా మాట్లాడుతున్నావ్.
నందిని: ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చాను సరే వదిన నీ దగ్గరకే వస్తున్నా తర్వాత మాట్లాడుకుందాం.
సత్య: సరే వచ్చేయ్ త్వరగా.
హర్ష: ఎక్కడికి అమ్మాయి గారు బయల్దేరుతున్నారు.
నందిని: కాబోయే ఎమ్మెల్యే ఆడపడుచుని కదా వదిన దగ్గరకు వెళ్తాన్నా.
హర్ష: ఫిక్స్ అయిపోయావా సత్య ఎమ్మెల్యే అని
నందిని: వెనకుండి మా చిన్న అన్న సపోర్ట్ చేస్తున్నాడు కదా వదినే ఎమ్మెల్యే.
హర్ష: అదేంటి.
నందిని: అదృశ్యశక్తిగా మా పెద్దన్నతో నామినేషన్ మీద సంతకం చేయించింది చిన్నన్ననే. సత్య అంతే మా చిన్న అన్నకి ఇష్టం కదా అందుకే దొంగతనంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ సీక్రెట్ బయట ఎవరికీ లీక్ చేయకు. వదిన దగ్గరకు వెళ్తున్నా.
హర్ష: నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా.
మహదేవయ్య ఇంట్లో అందరూ మామకోడళ్ల పోటీ గురించి బయట వాళ్లు మాట్లాడుకుంటున్నారని మాట్లాడుకుంటారు. రుద్ర మహదేవయ్యతో చిన్నా గాడు పెళ్లాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడని అంటాడు. ఇక మహదేవయ్య రెండు పెట్టెల నింపుగా డబ్బు తీసుకొచ్చి పంచమని రౌడీలకు ఇస్తాడు. రుద్ర సత్య ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. క్రిష్ కావాలనే సత్యని ఎగతాళి చేస్తాడు. ఇలాంటి సూట్ కేస్‌లు 20 ఉన్నాయని నీకు సపోర్ట్ ఏది అని అంటాడు. ఇక భైరవి సత్యతో నువ్వు పుట్టింటికి వెళ్లాలి అన్నా ఆటో డబ్బులు నా కొడుకునే అడగాలి అని అంటుంది. ఇక నందిని సత్యతో ఫొటో షూట్ ఉంది కదా మంచి చీర కట్టుకొని రా వదిన అంటుంది. సత్య గదిలోకి వెళ్లి ఏ చీర కట్టుకోవాలా అని చీరలు అన్నీ ముందు వేసుకొని కూర్చొంటుంది. ఇంతలో క్రిష్ వచ్చి వెనకనుంచి వాటేసుకుంటే సత్య కంగారు పడుతుంది. నువ్వా అంటుంది. మరి ఎవరు అనుకున్నావ్ అంటే ఏం లేదు అని అదృశ్యశక్తి గురించి తలచుకుంటున్నాను అని క్రిష్‌ని ఉడికిస్తుంది. నీకు నా మీద జాలి కలగలేదా కానీ నా అదృశ్య అభిమానికి నా మీద జాలి కలిగింది నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నాకు అతన్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఆరాటంగా ఉందని క్రిష్‌ని రెచ్చగొడుతుంది.
క్రిష్ నిజం చెప్పలేక వేరే ఎవరో సత్యని మోసం చేస్తున్నారని అనుకొని పక్కనున్న బత్తాయి పండు పిసికేస్తాడు. సత్య నవ్వుకుంటుంది. ఇక సత్య చీరలు చూపించి ఏ చీర కట్టుకోవాలి అని క్రిష్‌ని అడుగుతుంది. ఇక క్రిష్ సత్య ఫోన్ కొట్టేసి ఆ అభిమానిని ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఫోన్ క్రిష్ తీయడం సత్య చూస్తుంది కానీ ఏం అనదు. సత్య ఫోన్‌లో క్రిష్ అజ్ఞాత అభిమాని అని పేరు పెట్టుకుంది ఏంటి అని అనుకొని ఫోన్ చేస్తాడు. నందిని ఫోన్ తీసి ఇప్పుడే మాట్లాడావు కదా మళ్లీ మాట్లాడాలి అనిపిస్తుందా అంటాడు. క్రిష్‌ని అన్న అన్న అంటే క్రిష్ తిడతాడు. ఫోన్‌లో వాయించేస్తాడు. సత్యకి నేను అంటే ఇష్టం అంటే నేను అంటే ఇష్టం అని ఇద్దరూ వాధించుకుంటారు. సత్య కూడా నందిని పక్కనే వచ్చి నిల్చొంటుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. సత్య నేను ఒకరికి ఒకరం ఫుల్ సపోర్ట్ అని అంటాడు. నువ్వు నీ పెళ్లాన్ని గాలికి వదిలేశావ్ కాబట్టి నేను తగులుకున్నా అని నందిని అంటుంది. క్రిష్ రగిలిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ని అనుమానిస్తూ ప్రశ్నించిన దీప.. దాసు దుస్థితికి ఏడుస్తున్న పారు.. జ్యో దొరికిపోతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

