Satyabhama Serial Today February 28th: సత్యభామ సీరియల్: క్రిష్ లేనిలోటు రౌడీదేవయ్యకు బాగా తెలుస్తుందిగా.. ఆస్తి కోసం అన్న మీద సంజయ్ కుట్ర!
Satyabhama Today Episode ఆస్తి మొత్తం రుద్ర పేరున ఉందని తెలుసుకున్న సంజయ్ రుద్రని పోలీస్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆస్తక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode పోలీస్‌లు చెకింగ్ చేస్తుంటారు. రుద్ర ప్రతాప్ బండి మీద వస్తుంటే ఆపి లైసెన్స్, ఆర్సీ అడుగుతారు. నేను ఎవరి కొడుకునో తెలుసా అని రుద్ర పోలీసుల్ని పట్టుకొని రా అని అంటే పోలీస్ కూడా రా అంటాడు. రుద్ర పోలీస్ కాలర్ పట్టుకుంటాడు. కానిస్టేబుల్ మొత్తం రికార్డ్ చేస్తాడు. బెయిల్ మీద వచ్చిన వాడు ఇలా కాలర్ పట్టుకుంటే జైలుకి వెళ్లాలని అంటాడు. పోలీసులు రుద్రని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎస్‌ఐ సంజయ్‌కి ఫోన్ చేసి పని పూర్తయిందని మీ అన్నయ్య అరెస్ట్ అయ్యారని చెప్తాడు.
సంజయ్ పోలీస్‌తో జీవితాంతం వాడు జైలులో ఉండాలి కోర్టుకి వెళ్లి ఏం చేస్తారో అది చేయండి మీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తా అంటాడు. తర్వాత మహదేవయ్య రుద్ర పేరున రాసిన ఆస్తి పేపర్లు పట్టుకొని ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద ఉంటే ఇక నేనేం అనుభవిస్తానని అనుకుంటాడు. ఆస్తి మొత్తం తన పేరు మీద ట్రాన్సఫర్ చేసుకొని తాను మాత్రమే ఇంటి వారసుడిగా ఉంటాను అనుకుంటాడు. మరోవైపు సత్య క్రిష్ ఎక్కడున్నాడో తెలీక కాల్ చేస్తుంది. ఇంతలో నందిని, విశాలాక్షి ఇంటికి ఇస్తారు.
విశాలాక్షి: రావొచ్చా
సత్య: అరే వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు విషయం తెలిసిపోయిందా ఏంటి. అదేంటి అమ్మ అలా అడుగుతున్నావ్.
విశాలాక్షి: మేం నీకు పరాయి వాళ్లం కదమ్మా.
సత్య: సరే ముందు లోపలికి రండి. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావ్.
విశాలాక్షి: జరిగింది చిన్న విషయం కాదు దాచేయడానికి చెప్పాలి కదమ్మా.
సత్య: జరిగిన దానికి బాధ లేదమ్మా కానీ జరిగిన పద్ధతి నచ్చలేదు.
నందిని: చిన్న అన్న ఎక్కడా.
సత్య: తెలీదు చెప్పకుండా బయటకు వెళ్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
విశాలాక్షి: ఆ ఇళ్లు ఓ నరకం బయటకు వచ్చినందుకు సంతోషపడొచ్చు కదా.
నందిని: మా బాపు మత్తు అన్నకి పూర్తిగా ఎక్కింది. బాపు వాడిని లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉండేలా మాయ చేశాడు. తిట్టినా కొట్టినా ఆయన కాళ్ల దగ్గరే ఉండేలా చేసుకున్నారు.
సత్య: నేను ఊహించిన దాని కంటే ఎక్కువ బాపు ప్రేమలో ఉన్నాడు. నన్ను తప్పించుకోవడానికి బయటకు వెళ్తున్నాడు. మామయ్యని తండ్రిలా చూడలేకపోతున్నా అని చెప్తే ఆయన చాటుగా వెళ్లి కన్నీరు పెట్టుకుంటున్నారు.
విశాలాక్షి: ఇలా ఒంటరిగా ఉండటం ఎందుకు కాస్త మన ఇంటికి రాకూడదు.
సత్య: ఈ నిజం ఒప్పుకోవడానికి మీ అల్లుడు సిద్ధంగా లేరు. నాన్నకి టెన్షన్ పడొద్దని చెప్పమ్మా.
సత్య తల్లి ఒడిలో పడుకొని కన్నీరు పెట్టుకుంటూ ఎక్కడున్నావు క్రిష్ అనుకుంటుంది. క్రిష్ చీకట్లో రోడ్డు మీద కూర్చొని బాపు గురించి ఆలోచిస్తుంటాడు. బాపు మాటలు తలచుకొని ఏడుస్తాడు. మరోవైపు మహదేవయ్య నట్టింట్లో సిగరెట్ తాగుతూ బాధగా ఉంటే సంజయ్ వచ్చి మనసులో రేయ్ చిన్నా నిన్ను తరిమేశా కానీ నీ ఆలోచనల నుంచి తండ్రిని తప్పించలేకపోయానని రుద్రని ఇంటి నుంచి జైలుకి తరిమేశా ఇక నువ్వే నా టార్గెట్ అనుకొని మహదేవయ్య దగ్గరకు వెళ్లి కాళ్ల దగ్గర కూర్చొంటాడు. నీ కాళ్ల దగ్గరే నా జీవితం డాడ్ అని అంటాడు. ఇంతలో భైరవి ఏడుస్తూ వచ్చి రుద్ర అరెస్ట్ అయ్యాడని చెప్తుంది. మళ్లీ ఏం చేశాడని మహదేవయ్య తిడతాడు.
రుద్రని విడిపించమని భైరవి అంటే మహదేవయ్య క్రిష్ ఇంట్లో లేడనే విషయం మర్చిపోయి ఇంత జరుగుతుంటే ఆ చిన్నా ఏం చేస్తున్నాడు వాడిని పిలు వాడు అయితే ఇలాంటివి సెటిల్ చేస్తాడు. పిలు అంటే భైరవి ఇంకెక్కడ ఉన్నాడు పెళ్లాం కొంగు పట్టుకొని వెళ్లిపోయాడని అంటుంది. సంజయ్ మహదేవయ్యతో నేను వెళ్లి ఆ క్రిష్ కాళ్లు పట్టి బతిమాలి తీసుకొస్తా అని అంటాడు. భైరవి అవసరం లేదని అంటుంది. ఇక రుద్రని విడిపిస్తా అని అంటే వద్దని నేను చూసుకుంటా అని మహదేవయ్య అంటాడు. జయమ్మ కొడుకుతో ఆ చిన్నా విలువ ఇప్పుడు తెలుస్తుందా. తేడా అర్థమవుతుందా అని మహదేవయ్య మీద అరుస్తుంది.
చిన్నా లేకపోవడంతో ఎంత ఒంటరి అయిపోయావో అర్థమవుతుందా.. నా కొడుకులు అంటూ ఇద్దరి మీద చేయి వేసి విర్రవీగావు ఇప్పుడు అర్థమైందా ఒకడు జైలులో ఇంకొకడు భయంతో లోపల ఇప్పటి కైనా పొగొట్టుకున్నది తెలుసుకో బాగు పడతావని తల్లి మహదేవయ్యని అంటుంది. మహదేవయ్య దిగులుగా వెళ్లిపోతాడు. నా కొడుకుని ఎవరు బయటకు తెస్తారు అని భైరవి అంటే దానికి రేణుక ఏం అవసరం లేదత్తమ్మా ఆయన బయటకు వచ్చి ఎవరినీ ఉద్దరించేది లేదు.. కాదు కూడదు అని ఎవరైనా విడిపించుకు వస్తే నేను మళ్లీ నా మొగుడిని జైలులో పెట్టిస్తా అని అంటుంది. పెద్ద కోడలి రియాక్షన్‌కి భైరవి బిత్తరపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

