అన్వేషించండి

Satyabhama Serial Today December 6th: సత్యభామ సీరియల్: సత్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహదేవయ్య.. మైత్రి కౌగిళ్లో హర్ష.. కొండెక్కిన దీపం!

Satyabhama Today Episode డీఎన్ఏ రిపోర్ట్స్‌లో మహదేవయ్య కొడుకే క్రిష్ అని తేలడం, సత్య డిసప్పాయింట్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode డీఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ మహదేవయ్య ఇంటికి వస్తాడు. మీడియా, నర్శింహ అందరూ అక్కడికి చేరుకుంటారు. డాక్టర్ రిపోర్ట్స్ చదివి గంగ బిడ్డకు మహదేవయ్యకు ఏం సంబంధం లేదని డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్తాడు. ఇక క్రిష్‌, మహదేవయ్యల డీఎన్‌ఏ మ్యాచ్ అయిందని క్రిష్ మహదేవయ్య కొడుకే అని చెప్తాడు. దాంతో సత్య షాక్ అయిపోతుంది. ఇదెలా సాధ్యమైందని కన్నీరు పెట్టుకుంటుంది. ఇక మహదేవయ్య, క్రిష్, భైరవి అందరూ గెంతులేస్తూ సంబరాలు చేసుకుంటారు. 

నర్శింహ: మనసులో ఈ గంగ ఏంటి మొత్తం నా గాలి తీసేసింది.
మహదేవయ్య: నా మీద కుట్ర జరిగింది ఇప్పుడు నిజం తేలింది. 
క్రిష్: అసలు దొంగ ఎక్కడ.
మహదేవయ్య: పారిపోయి ఉంటుందిరా. 
క్రిష్: మీడియా అందరికీ ఓ నిజం చెప్పాలి మా నాన్న మీద నింద వేసినామె గంగ కాదు శ్రావణి తనో స్టేజ్ ఆర్టిస్ట్. అని ఫ్రూప్స్ చూపిస్తాడు.
మహదేవయ్య: షబాష్‌ రా చిన్న.
క్రిష్: నీ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను బాపు.
మహదేవయ్య: పెద్దగా నవ్వుకుంటూ నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి కోడలి కాని కోడలా. నాకు నేను చేసుకోలేని సాయం చేశాం, లోకం ముందు సాక్ష్యాలతో సహా నన్ను చిన్నా గాడి తండ్రిని చేసేశావ్. ఇది చిన్న ముచ్చటకాదు. నీ కండ్లల నీ వేలితో నువ్వే పొడుచుకున్నావ్.
సత్య: ఆట ఇక్కడితో అయిపోలేదు మామయ్య. 
మహదేవయ్య: నిజం తగలబడిపోయింది దాని స్థానంలో అబద్ధం కూర్చొంది. ఎన్ని సార్లు డీఎన్‌ఏ టెస్ట్ చేసినా ఇదే రిపోర్ట్స్ వస్తాయి. మరోవిషయం నీ మొగుడు గంగ దగ్గరకు వెళ్లాడు వాడు తనని ఉండచు దాని వెనక నువ్వే ఉన్నావని తెలిస్తే అంతే ఇక. పో పోయి నెత్తి మీద నిమ్మకాయ పెట్టుకో ఏమైనా లోపల కాలితే చల్లగా ఉంటుంది.

సత్య వెళ్లిపోతుంటే గతంలో సత్య హాస్పిటల్‌లో ఎంక్వైరీకి వెళ్లిన కాంపౌండర్ రాజు సత్యకి కాల్ చేసి మీరు వెరిఫై చేసిన టైంలో ఓ నర్స్ పని చేసిందని ఆ తరవాత రోజే తను రిజైన్ చేసి వెళ్లిపోయిందని ఆమె అడ్రస్ దొరికిందని చెప్తాడు. దాంతో సత్య నవ్వుకుంటూ వెళ్లి మహదేవయ్యతో మీ గెలుపు సంతోషానికి ఆయుష్షు తక్కువ ఉందని నిజం తగల బడిపోలేదని మీ కౌంట్ డౌన్ మొదలైందని అంటుంది. సత్యకి మళ్లీ ఏం దారి దొరికిందని మహదేవయ్య ఆలోచనలో పడతాడు.

మరోవైపు మైత్రితో తన ఫ్రెండ్ హర్ష నీ పుట్టిన రోజు అని తెలియగానే బయల్దేరుతున్నాడని చెప్తుంది. ఇంతలో హర్ష ఇంటికి వస్తాడు. నీ భర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి వచ్చానని హర్ష చెప్తే మైత్రి వెళ్లి హర్షని హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు నందినితో శాంతమ్మ పూజ చేయిస్తుంది. అప్పుడే దీపం కొండెక్కుతుంది. దాంతో నందిని ఏదో అపశకునం అని నువ్వే చెప్పావ్ నాకు నా మొగుడికి మధ్య ఏమైనా అవుతుందా అని అడుగుతుంది. శాంతమ్మ నందినిని తిట్టి మళ్లీ పూజ చేయిస్తుంది.

మరోవైపు సత్య క్రిష్తో తెలీకుండా నర్స్ ఇంటికి వెళ్లాలి అని బయటకు వెళ్తుంది. అక్కడ క్రిష్ సత్యని చూసేస్తాడు. బయటకు వెళ్లడం చూసినా చెప్తావేంటి అని చూస్తున్నా అని నీ కోసం కారు ఆపి ఇక్కడ కూర్చొన్నా అని అంటాడు.  చెప్పకుండా పారిపోతున్నావేంటి అని అడుగుతాడు. దాంతో నువ్వు కూడా నాకు చెప్పవని అంటుంది. ఇక క్రిష్ సత్యతో కారు ఎక్కమని అంటాడు. దాంతో సత్య వాదించి వాదించి కారు ఎక్కుతుంది. మరోవైపు సంధ్య ఓ చోట ఆటో కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడు సంజయ్‌ వస్తాడు. రాత్రి మెసేజ్‌కి రిప్లయ్ ఇవ్వడం లేదని అంటే మా అమ్మ పక్కనుంది నీ ఫోన్ దాయడమే కష్టంగా ఉందని అంటుంది. ఇక   సంధ్య సంజయ్ బైక్ ఎక్కుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజుకి గాయం.. అందరికీ షాకిచ్చిన ముత్యాలు ప్రవర్తన.. హారతి, జీవన్‌లను చూసేస్తారా!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget