Satyabhama Serial Today December 20th: సత్యభామ సీరియల్: క్రిష్‌కి నిజం చెప్పడంలో సత్య ఫెయిల్.. ఒకే గదిలో సంజయ్, సంధ్య.. సత్య చూసేస్తుందా!
Satyabhama Today Episode సంజయ్‌ని విష్ చేయడానికి సంధ్య సత్య ఇంటికి రావడం సంధ్య ప్రవర్తన సత్యకు అనుమానం కలిగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య క్రిష్‌తో మాట్లాడాలని కూర్చొపెడుతుంది. ఇంతలో మహదేవయ్య పిలవడంతో క్రిష్ వెళ్లిపోతాడు. దాంతో సత్య మనసులో నేను ఎలక్షన్‌లో నిలబడటం వల్ల మన ఇద్దరి మధ్య గొడవలు కచ్చితంగా వస్తాయని అనిపిస్తుందని అనుకుంటుంది. ఇక తర్వాత పూజ చేసి క్రిష్‌కి బొట్టు పెట్టి హారతి ఇస్తుంది. తర్వాత క్రిష్‌తో విషయం చెప్పాలనుకుంటుంది. ఇంతలో భైరవి రావడంతో ఆగిపోతుంది.
ఇక భైరవి దగ్గర క్రిష్ ఆశీర్వాదం తీసుకుంటాడు. భైరవి క్రిష్‌కి బ్రేస్‌లెట్ గిఫ్ట్‌గా ఇస్తుంది. తర్వాత క్రిష్‌తో నీ పెళ్లాం ఏం గిఫ్ట్ ఇచ్చిందిరా అని అడుగుతుంది. దానికి క్రిష్ ఒకటి కాదు 44 ఇచ్చిందని అంటాడు. అవేంట్రా అని భైరవి అడగటంతో క్రిష్ నవ్వేసి కవర్ చేస్తాడు. ఇక సత్యకి పాయసం తీసుకొని రమ్మని చెప్తుంది. ఇంతలో రేణుక వచ్చి పుట్టినరోజు విషెష్ చెప్తుంది. ఇక నందిని క్రిష్‌కి కాల్ చేసి విషెష్ చేస్తే ఇలా ఫోన్‌లో ఏంటి అని అంటాడు. ఇలా కాదని వచ్చి విష్ చేయమని గిఫ్ట్ ఇవ్వమని అంటాడు. కొత్త కోరికలు ఉన్నాయేంటి అన్నా అంటే సత్య, హర్ష, సంధ్యల రిలేషన్ చూస్తే నాకు చెల్లి ప్రేమ కావాలని అంటాడు. దానికి నందిని వేరే చెల్లిని చూసుకో అంటుంది. ఇక సాయంత్రం పార్టీ ఉందిరా అని క్రిష్ అంటే మీ బావ కూడా లేడు నేను రాను అని అంటుంది. ఇక క్రిష్ మొండి పట్టు పడతాడు. నువ్వు వచ్చి నాకు కేక్ కట్ చేయించాల్సిందే అంటాడు. ఇక సంధ్య చాటుగా నందిని మాటలు విని నందినితో పాటు సంజయ్ భర్తడేకి వెళ్లాలని అనుకుంటుంది.
ఇక ఆరుబయట క్రిష్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటే సత్య ఎలా అయినా ఎలక్షన్‌లో పోటీ చేయనున్న విషయం చెప్పేయాలని వెళ్తుంది. ఇక సత్య చెప్పబోయే టైంకి సంజయ్ వస్తాడు. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే డిస్ట్రబ్ చేస్తావా అని సంజయ్‌ని తిడుతుంది. సంజయ్ పరాయి వాడు కాదని క్రిష్ అంటే సంజయ్ కాదు నువ్వే ఈ ఇంటికి పరాయి వాడు అంటుంది. క్రిష్ కోపంగా చూస్తాడు. దాంతో సత్య సారీ చెప్తుంది. చిరాకులో అనేశా అంటే చిరాకులో అయినా అది అనేమాటేనా అని క్రిష్ అంటాడు. ఇక క్రిష్ చేతిలో ఉన్న పాయసం సంజయ్ తీసుకుంటే సత్య తిడుతుంది. మరోవైపు సంధ్య నందినిని కాకాపట్టడానికి వెళ్తుంది. బావగారి పుట్టిన రోజు కదా ఇంటికి వెళ్లి విష్ చేయమని అంటుంది. ఒక్కదాన్ని వెళ్లను అని నందిని అంటే నేను తోడు వస్తానని సంధ్య అంటుంది. దాంతో నందిని వెళ్దామని అంటుంది. ఇక సత్య నిజం చెప్పలేకపోతున్నా అని బాధపడుతుంటుంది. ఇంకొక్క
సారి ప్రయత్నిస్తాను అని క్రిష్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో జయమ్మ రావడంతో సత్య డిసప్పాయింట్ అవుతుంది. జయమ్మ ఇద్దరితో మాట్లాడుతుంది.
రాత్రి కేక్ కటింగ్‌కి సత్య ఏర్పాట్లు చేసి డెకరేషన్ చేయిస్తుంది. ఇంతలో సంధ్య వస్తుంది. క్రిష్ వచ్చి మరదలు అంటే ఇలా ఉండాలి ఇలా సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని అంటాడు. నందిని కూడా వచ్చి విస్ చేస్తుంది. ఇక సంధ్య సంజయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవరి కోసం వెతుకుతూ ఉన్నావ్ అని సత్య అడుతుంది దాంతో ఏం లేదు అని సంధ్య అంటుంది. ఇక సంజయ్ విష్ చేయమని అడిగితే సంధ్య విష్ చేస్తుంది. సత్య సంధ్యని లోపలికి రమ్మని అంటుంది. సంధ్య వెళ్తుంటే సంజయ్ చేయి పట్టి లాగి గదిలోకి తీసుకెళ్లి డోర్ వేసేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజుల బిడ్డని పురిటిలోనే చంపేసిన విజయాంబిక.. ఏళ్లు దాటేసిన కథ, ఎన్నో మలుపులు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

