అన్వేషించండి

Rashmi Gautam: సుధీర్ ఫ్యాన్స్‌కు గుండె పగిలే న్యూస్ - రష్మిని పెళ్లాడేది అతడేనట, అందరి ముందు రివీల్!

Rashmi Gautam Wedding: న్యూ ఇయర్ కోసం ఈటీవీ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో తనకు కాబోయేవాడిని రష్మీ రివీల్ చేసినట్టు ప్రోమోలో చూపించారు.

Rashmi Gautam Boy friend: బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లకు ప్రేక్షకుల్లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో ఒకరు రష్మీ. అయితే ఒకప్పుడు సుధీర్, రష్మీల ప్రేమకథ బుల్లితెరపై ఎంతో ఫేమస్. కానీ ఇప్పుడు ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వీరిద్దరూ ప్రేమికులుగా, భార్యభర్తలుగా కూడా పలు షోలలో పాల్గొన్నారు. తాజాగా రష్మీ పెళ్లి అంటూ ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసింది ఈటీవీ. దానికి ఎంతోమంది బుల్లితెర సెలబ్రిటీలను కూడా పిలిచింది. ఇక ‘రష్మీ పెళ్లి పార్టీ’ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక ఇందులో రష్మీ.. తన రియల్ లైఫ్ బాయ్‌ఫ్రెండ్‌ను అందరికీ పరిచయం చేసినట్టు చూపించారు.

‘యానిమల్’ వర్సెస్ ‘అర్జున్ రెడ్డి’..
ముందుగా చమ్మక్ చంద్ర, శ్రీ సత్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ‘రష్మీ పెళ్లి పార్టీ’ ప్రోగ్రామ్ ప్రోమో ప్రారంభమయ్యింది. ‘శుభలేఖ రాసుకున్న’ పాటకు ఇద్దరూ స్టెప్పులేశారు. దానికి బాబా భాస్కర్ మాస్టర్ ఫన్నీగా కామెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత తాగుబోతు రమేశ్ వచ్చి మరో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో డ్యాన్స్‌తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసి అందరినీ నవ్వించారు. సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన రెండు సినిమాలు - ‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’‌లకు స్ఫూఫ్ స్కిట్లు చేయడానికి కామెడియన్స్ ముందుకొచ్చారు. కంటెస్టెంట్స్ అంతా ఈ స్కిట్‌కు పడీపడీ నవ్వుకున్నారు. ‘‘ఒక మెయిన్ ఈవెంట్‌లో ఇలా నవ్వుకొని నాకు తెలిసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది’’ అంటూ హైపర్ ఆది.. వారిని ప్రశంసించారు.

టీవీ రేటింగ్స్ కోసం ఏవేవో చేశావు..
ఆ తర్వాత పండు కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఒక రొమాంటిక్ సాంగ్‌పై ముగ్గురు భామలతో స్టెప్పులేశాడు. వర్షం ఎఫెక్ట్‌తో పండు ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చిన అదిరిపోతుందంటూ ఈ ప్రోమోకు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ పర్ఫార్మెన్స్ చూసిన ఆది.. ‘‘మా అందరికీ జస్ట్ న్యూ ఇయర్. పండుగాడికి ఒక్కడికే ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్’’ అని కామెంట్ చేశాడు. ఆ తర్వాత రష్మీని తన పెళ్లి గురించి ప్రశ్నించాడు. ‘‘ఇన్నిరోజులు నువ్వు టీవీ రేటింగ్స్ కోసం ఏవేవో చేశావు. అవన్నీ ఓకే. నిజంగా నువ్వు ఎవరిని చేసుకుంటున్నావో అతన్ని మేమూ చూడాలనుకుంటున్నాము’’ అని అడిగాడు.

ఎవరు ఆ వ్యక్తి..?
హైపర్ ఆది అడిగిన ప్రశ్నకు రష్మీ మొదటిగా సిగ్గుపడింది. ‘‘ఒక అమ్మాయికి కొన్ని ఊహలు ఉంటాయి. వాడొచ్చి ఇలా ఉండాలి, అలా ఉండాలి. పొడుగ్గా ఉండాలి’’ అని తను చెప్తుండగానే.. ప్రోమోలోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతడెవరో ఇంతకు ముందే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం ఉన్నట్టుగా అనిపించలేదు. ఇంతకు ముందు ఈవెంట్లలో కూడా తానెప్పుడూ పాల్గొనలేదు. తను ఎంటర్ అవ్వగానే ముందుగా ఆదితో పాటు మిగతావారికి తనను పరిచయం చేసింది రష్మీ. కానీ తను ఎవరు అనే విషయం మాత్రం ఈ ప్రోమోలో చూపించలేదు. ఇది కూడా టీఆర్‌పీ కోసం ప్లాన్ ఏమో అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: రష్మిక, విజయ్ పెళ్లి తర్వాత విడిపోతారు, వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Embed widget