అన్వేషించండి

Rangula Ratnam June 27th: భర్త కోసం మరోసారి పేరు మార్చుకున్న పూర్ణ.. నిజం తెలియటంతో తట్టుకోలేకపోతున్న సూర్యం?

భర్త దగ్గర ఉండటం కోసం పూర్ణ పావనిగా మారడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Rangula Ratnam June 27th: శంకర్ ప్రసాద్ వారిని బయటికి వెళ్ళమనడంతో.. వెంటనే రఘు భార్యను, తల్లిని బయటికి తీసుకొని వస్తాడు. ఇక తల్లికి ధైర్యం చెబుతాడు. ఈ సమయంలో మనం నాన్నకు దూరంగా ఉంటేనే మంచిది అని.. లేదంటే ఆ ఆలోచనలతో మళ్ళీ పరిస్థితి చేయి జారిపోతుంది అని దైర్యం చెబుతూ ఉంటాడు. కానీ పూర్ణ మాత్రం చాలా బాధపడుతూ కనిపిస్తుంది.

సీత ఫోన్ చేయటం లేదని జానకి సీత కు ఫోన్ చేయడంతో.. హాస్పిటల్లో మామయ్య ఉన్నాడని అంటుంది. ఆఫీసులో రేఖకు, శంకర్ ప్రసాద్ మధ్య జరిగిన గొడవ గురించి చెప్పి.. ఆ తర్వాత యాక్సిడెంట్ విషయం చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. అంతేకాకుండా చూపు కూడా కోల్పోయాడని చెప్పడంతో బాధపడుతుంది.

ఇక ఈ విషయం మీ నాన్నకు చెబితే ఎలా తట్టుకుంటాడో అని ఫోన్ కట్ చేసిన వెంటనే ఆ మాటలు అన్ని విన్న అసలు తట్టుకోలేక పోతాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదని బాధపడతాడు. జానకి కూడా రేఖ విషయంలో నమ్మినందుకు ఇలా అయ్యింది అని చెబుతూ బాధపడుతుంది. ఇక హాస్పిటల్ కి వెళ్దాం అని అనటంతే ఇప్పుడు వెళ్తే అక్కడ గొడవలు జరుగుతాయని.. ఈ సమయంలో తనను బాధ పెట్టడం కరెక్టు కాదు అని అంటాడు సూర్యం.

పూర్ణ ఏమి తినకుండా అలా కూర్చోవడంతో నూకాలమ్మ వచ్చి తినమని చెబుతూ ఉంటుంది. కానీ పూర్ణ అవేవీ వినిపించుకోదు. ఇక్కడ ఉంటే బాధపడటం తప్ప ఏమి చేయలేవని ఇంటికి వెళ్ళమని అంటుంది. రఘు, సీత కూడా అదే మాట అంటారు. దాంతో నేను వెళ్ళను అని పూర్ణ కోపంతో చెబుతూ.. నేను ఇక్కడే ఉంటాను కావాలంటే మీరు వెళ్ళండి అని అంటుంది.

ఇక డాక్టరమ్మ వచ్చి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు శంకర్ కు ఒక నర్స్ అవసరం కాబట్టి నువ్వు ఇక్కడ పావని అనే పేరుతో నర్సుగా ఉండి నీ భర్తకు దగ్గర ఉండి సేవలు చేయు అని అనటంతో పూర్ణ తృప్తి పడుతుంది. ఇక ఇంట్లో వర్ష పనిచేస్తుండగా తన భర్త ఆకాష్ ఎటువంటి పనులు చేయవద్దని చెబుతూ ఉండగా అప్పుడే ఆకాష్ తండ్రి వచ్చి వర్ష కు తన తండ్రి ఆక్సిడెంట్ అయ్యి చూపు కోల్పోయాడని విషయం చెబుతాడు.

అంతేకాకుండా జరిగిన విషయం కూడా చెప్పటంతో వర్ష నాన్న అని గట్టిగా స్పృహ కోల్పోతుంది. దాంతో ఆకాష్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఈ విషయం ఎందుకు చెప్పావు నాన్న అంటూ తండ్రి పై అరుస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుందని తెలియదు కదా అని.. అయిన తనకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా చెబితే ఇలా జరగటానికి అని అనటంతో.. ఇక ఆకాష్ తన మనసులో నిజంగానే తనకు అనారోగ్య సమస్య ఉందని అనుకుంటూ బాధపడతాడు.

ఆ తర్వాత వర్ష కళ్ళు తెరిచి నాన్న దగ్గరికి వెళ్దాము అని అనటంతో తీసుకెళ్తాను అని ఆకాష్ ధైర్యం చెబుతాడు. ఇక శంకర్ ప్రసాద్ బెడ్ దిగి ముందుకు నడుస్తూ ఉండగా కుర్చీ తగిలి కింద పడిపోతుండగా వెంటనే పూర్ణ వచ్చి పట్టుకుంటుంది. జాగ్రత్త అని చెబుతుంది. ఆ గొంతు విని నువ్వు అర్చన కదా అంటూ చీదరించుకుంటాడు. అప్పుడే నూకాలమ్మ తను అర్చన కాదు అన్నట్లుగా చెబుతుంది. డాక్టరమ్మ కూడా వచ్చి వాళ్ళను పంపించేశాను.. ఇప్పుడు నీకు ఒక నర్స్ తోడు అవసరం కాబట్టి పావని అనే ఈ నర్స్ ను నీ దగ్గర ఉంచాను అని అంటుంది.

Also Read: Trinayani June 27th: గాయత్రి వర్ధంతిలో అందంగా రెడీ అయిన సుమన, తిలోత్తమాకు ప్రాణగండం ఉందని తెలుసుకున్న నయని?

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today November 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మీద కోప్పడిన అమర్ – ఎమోషనల్‌ అయిన మను  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మీద కోప్పడిన అమర్ – ఎమోషనల్‌ అయిన మను  
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget