అన్వేషించండి

Prema Entha Madhuram December 22 Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ : ఎట్టకేలకు ఒకరినొకరు చూసుకున్న మామ, అల్లుళ్లు - ఆర్యని నాన్న అని పిలిచి షాకిచ్చిన పిల్లలు! 

Prema Entha Madhuram Today Episode: ఆర్య తమ తండ్రి అని తెలుసుకొని అతనిని నాన్న అని పిలవడంతో అందరూ షాక్ అవుతారు. తరువాత కధ ఏమలుపు జరగబోతుందో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.

Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తల్లిని వెతకటానికి వెళ్లిన పిల్లలకి అను ఎక్కడ కనిపించదు.

అక్కి: అమ్మ కావాలనే దాక్కుంటునట్లుగా అనిపిస్తుంది, ఎందుకు ఇలా అందరికీ దూరంగా ఉంటుంది.

అభయ్: నాకు ఒక ఐడియా వచ్చింది నాతో రా  చెప్తాను అని చెల్లెల్ని తీసుకుని ఎక్కడికో వెళ్తాడు.

సుబ్బు: పిల్లలు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తానని వెళ్లారు ఇంకా రాలేదు ఆలస్యం అవుతుంది నేను బయలుదేరుతాను అంటాడు.

అంతలో ఆర్య, యాదగిరి ఇద్దరు బయటినుంచి వస్తారు. ఇదంతా కిటికీలోంచి చేస్తున్న అను ఆర్య సుబ్బు ఒకరిని ఒకరు చూస్తారేమో అని కంగారు పడిపోతుంది. ఆమె అనుకున్నట్లే ఆర్య సుబ్బు ఒకరిని ఒకరు చూసుకుని ఇద్దరు షాక్ అయిపోతారు.

సుగుణ: ఇతనే నా కొడుకు సూర్య  అని పరిచయం చేస్తుంది. అలాగే పిల్లలు సుబ్బుకు చేసిన సఫర్యల గురించి ఆర్య కి చెప్పి సుబ్బు ని పరిచయం చేస్తుంది.

సుబ్బు: ఏమి తెలియని వాడిలాగా ఆర్యకి నమస్కరించి మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.

ఆయనని పంపించి వస్తాను  అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత తను ఇక్కడ సూర్య లాగా ఎందుకు ఉంటున్నది చెప్పాలనుకుంటాడు ఆర్య.

సుబ్బు : మీరు నాకు ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇస్తున్నారు సార్, మీరు ఏదైనా చేశారంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది.

ఆర్య : నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం మీరు అర్థం చేసుకున్నట్లు అను నన్ను అర్థం చేసుకొని ఉంటే తన కష్టం నాకు చెప్పుకునేది, ఈరోజు ఇంత బాధ ఉండేది కాదు.

సుబ్బు: జరిగిపోయిన దానికోసం బాధపడటం ఎందుకు ఎప్పటికైనా మీరు కలుస్తారు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

ఇదంతా కిటికీలోంచి చూస్తున్న అను ఆ మాటలు విని బాధపడుతుంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఏంటి సార్ మీకోసమే, మీరు క్షేమంగా ఉండాలనే నేను మీకు దూరంగా ఉంటున్నాను. నాలో నేను నలిగిపోవడమే కానీ నా బాధను ఎవరితో  చెప్పుకోలేను అనుకుంటుంది. ఆ తర్వాత గదిలోంచి బయటికి వచ్చిన అనుతో

సుగుణ : ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు పిల్లలు నీకోసమే వెతుకుతూ బయటికి వెళ్లారు ఇంకా రాలేదు.

అను ఏమి తెలియనట్లుగా అవునా నేను లోపలే ఉన్నాను అంటుంది.

సుగుణ ఆర్యని పిలిచి పిల్లలు బయటికి వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఒకసారి వెళ్లి చూడు అని చెప్తుంది. ఇంతలో అయ్యప్ప మాల వేసుకొని పిల్లలిద్దరూ వస్తారు వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు.

సుగుణ: ఎవరికీ చెప్పకుండా ఇలా మాల వేసుకున్నారు ఏంటి అని అడుగుతుంది.

యాదగిరి : ఇందాక ఒక పెద్దాయన వచ్చారు కదా ఆయనే ఈ పిల్లలిద్దరికీ మాల వేయించి ఉంటారు అని అంటాడు.

పిల్లలిద్దరూ ఏమీ మాట్లాడకుండా తండ్రి దగ్గరకి వెళ్తారు. ఆర్యతో వాళ్లు గడిపిన క్షణాలని తలచుకొని బాగా ఎమోషనల్ అవుతారు. ఇద్దరూ ఆర్య పాదాలకి నమస్కరించి నాన్న అని పిలుస్తారు. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

అను: వీళ్ళు నాన్న అని పిలుస్తున్నారేంటి, నాన్న వీళ్ళకి నిజం చెప్పేసాడా అని కంగారు పడిపోతుంది.

ఉష: మీరేంటి మా అన్నయ్యని నాన్న అని పిలుస్తున్నారు అని అడుగుతుంది.

ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు ఏం చెప్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: రైతుబిడ్డ కోసం పాటబిడ్డ న్యాయపోరాటం - అందుకే అలా జరిగిందన్న భోలే

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget