అన్వేషించండి

Podharillu Serial Today May 4th: ఇంటి నుంచి వెళ్లిపోయిన కన్నా ఎక్కడ దొరికాడు..? కన్నాపై మహాలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి...?

Podharillu Serial Today Episode May 4th: ఇంటి నుంచి వెళ్లిపోయిన కన్నా ఎక్కడ దొరికాడు..? కన్నాపై మహాలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి...?

Podharillu Serial Today Episode: కన్నా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అన్నదమ్ములు పిచ్చవాళ్లలా ఊరంతా వెతుకుతారు.ఇంట్లో మహాలక్ష్మీకి కాళ్లు, చేతులు ఆడవు. అయితే తన ఏ కష్టం వచ్చినా అమ్మగార్డెన్‌ దగ్గరకు వెళ్లిపోతానని కన్నా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన మహాలక్ష్మీ ఆవిషయం చక్రికి చెప్పి అక్కడికి వెళ్లిచూడమని సలహా ఇస్తుంది. దీంతో చక్రి,మాధవ్‌ అక్కడికి వెళ్లగా...అర్థరాత్రి ఒంటరిగా  చెరువు ఒడ్డున కూర్చుని కన్నా కనిపించడంతో మాధవ్‌ ప్రాణాలు లేచివస్తాయి. చక్రి కన్నా దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలాంటి పనిచేశావని నిలదీస్తాడు. మేం ఏ రోజైనా నిన్ను వేరుగా చూశామని అని అడుగుతారు.నువ్వు ఒక్కరోజు కనిపించకపోతే మేం ఎంత బాధపడతామో కూడా ఆలోచించలేదా అని అంటాడు.

అన్నయ్యకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినంత పనైందని మందలిస్తాడు. చిన్నప్పటి నుంచి నిన్ను గుండెలపై వేసుుకుని పెంచిన అన్నయ్య ఏమైపోతాడోనని కూడా ఆలోచించలేదా అని అడుగుతాడు. పోనీ ఏరోజు  అయినా నిన్ను మా సొంత తమ్ముడిలా చూసుకోలేదా  అని ప్రశ్నిస్తాడు. అసలు నిన్ను వదిలి వెళ్లలేకే కదా అన్నయ్య పెళ్లి కూడా చేసుకోకుండా  ఉండిపోయాడని చెబుతాడు. ఈ మాటలు విన్న కన్నా కన్నీళ్లు పెట్టుకుని వెళ్లి మాధవ్‌ను కౌగిలించుకుని ఏడుస్తాడు.మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పిచ్చిపనులు చేయనని అంటాడు.ఇంతలో ఇంటివద్ద మహాలక్ష్మీ కంగారుపడుతుండగా...నారాయణ ఊరంతా వెతికి ఇంటికి వస్తాడు. కన్నా కనిపించలేదని చెప్పేసరికి ఆయనపై కోప్పడుతుంది.అసలు ఇదంతా నీవల్లే జరిగిందని చిన్న పిల్లలకు ఏం చెప్పాలో కూడా తెలియదా అని అంటుంది. వాడు దొరక్కపోతే  నీ పని చెబుతానని హెచ్చరిస్తుంది.
                 

కన్నా కనిపించడంతో చక్రి మహాలక్ష్మీకి ఫోన్ చేసి చెబుతాడు. మీరు భలే గెస్‌ చేశారని అంటాడు. మీరు  చెప్పినట్లే వాడు అక్కడే ఉన్నాడని....ఇప్పుడే ఇంటికి తీసుకుని వస్తున్నామని అంటాడు.చక్రికి కూడా ఫోన్ చేసి చెప్పగా....అతను కూడా ఇంటికి వచ్చేస్తాడు.అందరూ కలిసి కన్నా కోసం ఎదురుచూస్తుండగా....చక్రి, మాధవ్ ఇంటికి తీసుకువస్తారు. ఇంటికి రావడంతో కన్నా వాళ్ల నాన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.అసలు నిజం ఎందుకు చెప్పావని నిలదీస్తాడు. నీవల్లే ఇదంతా జరిగిందని అంటాడు. దీంతో నారాయణ కొడుకుపై మండిపడతాడు.

20 ఏళ్లుగా మేం  ఈ విషయం దాచిపెట్టామని...చెప్పేవాళ్లమే అయితే ఎప్పుడో చెప్పేవాళ్లం కదా అని  అంటాడు. ఒక్క ఫొటో పట్టుకుని నువ్వు నా చొక్కా పట్టుకుని నిలదీస్తుంటే చెప్పకుండా ఏం చేయమంటావు అని అడుగుతాడు. మీ అమ్మకు కనీసం నువ్వు అంటే ప్రేమ లేకుండా వదిలేసిపోయిందని....మరి మీఅమ్మ కన్నా మిన్నగా  పెంచిన మీ పెద్దన్నయ్య నీకు గుర్తుకురాలేదా అని అడుగుతాడు. వీళ్లందరినీ వదిలి ఎలా వెళ్లాలని అనిపించిందంటాడు.
                 

కన్నా మాట్లాడుతుండగా మహాలక్ష్మీ వచ్చి వాడిని చెంపమీదపెట్టి లాగి కొడుతుంది. మాధవ్‌ అడ్డుపడబోగా....మీరు ఎవరూ అడ్డురావద్దని హెచ్చరిస్తుంది. ప్రాణం కన్నా మిన్నగా  ప్రేమించే అన్నయ్యలను వదిలిపెట్టి వెళ్తావా అని నిలదీస్తుంది. మీ అమ్మ గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే ఉండబట్టలేక ఆ పెద్దమనిషి నిజం చెబితే అతన్నే ప్రశ్నిస్తావా అని అంటుంది.అసలు ఈ ముగ్గురు  ఏరోజు  అయినా నిన్ను వేరుగా  చూశారురా అని అడుగుతుంది. బయట నుంచి వచ్చిన నన్నే వీళ్లు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎలా వెళ్లిపోయావని అడుగుతుంది.మళ్లీ  ఎప్పుడూ  ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేయవద్దని చెబుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget