అన్వేషించండి

Podharillu Serial Today January 14th: చక్రితో పెళ్లికి మహా అంగీకరించిందా..? మహా నిర్ణయంతో ప్రతాప్, భూషణ్ ఏం చేశారు..?

Podharillu Serial Today Episode January 14th: ఈ గండం నుంచి గట్టెక్కాలంటే మీరు ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని ఎస్‌ఐ మహా, చక్రికి సూచిస్తాడు. అప్పుడు వాళ్లిద్దరూ ఏం చేశారు..?

Podharillu Serial Today Episode: మహాను స్టేషన్‌లోనే పక్కకు తీుసుకెళ్లి  ప్రతాప్‌ ఎంతో బ్రతిమలాడతాడు. నిన్ను ఎంతో గారాబంగా  పెంచితే ఇప్పుడు నువ్వు ఇలా పరువు తీయం భావ్యం కాదని అంటాడు. నువ్వుచెప్పినట్లే  నీ వెంట వస్తానని కాకపోతే...ఈ పెళ్లి ఆపించాలని కోరుతుంది. దీనికి  తండ్రి ససేమీరా  అంటాడు. అయితే నేను కూడా నీవెంట రావడం కుదురదని అంటాడు. అయితే ఆ డ్రైవర్‌తో లేచిపోతావా  అని అనడంతో మహాకు కోపం వస్తుంది. నువ్వు కూడా ఇంతేనే ఆలోచించేదంటూ  అక్కడ నుంచి వచ్చేస్తుంది. తన తండ్రితో వెళ్లడం ఇష్టం లేదని  మహా  చెబుతుంది. మీ అమ్మాయి ఇష్టం లేనిదే మీతో  పంపించడం కుదరదని ఎస్సై చెబుతాడు.
అయితే మీ పైఅధికారులతో  మాట్లాడి  తీసుకెళ్తానంటూ  ప్రతాప్‌ కోపంగా ఫోన్ చేస్తూ బయటకు వెళ్లిపోతాడు. 
                    ఖచ్చితంగా వీళ్లతో పంపిస్తే ఈ అమ్మాయిని  ఆశాడిస్టుకు  ఇచ్చి పెళ్లి చేస్తారని...ఆ తర్వాత ఈ డ్రైవర్‌ను  చంపేస్తారని పోలీసులు అనుకుంటారు. కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలని ఎస్‌ఐ  కానిస్టేబుల్‌తో  అంటాడు. నువ్వు వెళ్లి ఆ చక్రిని ప్రశ్నించు...నేను ఈ అమ్మాయి అభిప్రాయం తెలుసుకుంటానని ఎస్‌ఐ ఇద్దరినీ వేర్వేరుగా  పిలిచి మాట్లాడతాడు. మీ నాన్న  మా పై అధికారులతో చెప్పించి  ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని....కాసేపట్లో  ఆ పని జరిగిపోతుందని ఎస్‌ఐ  మహాలక్ష్మీతో  అంటాడు. ఇప్పుడు  నీ ముందు  ఉన్నది  ఒకటే మార్గమని....నువ్వు ఆ చక్రిని పెళ్లి చేసుకుని వెళ్తే నిన్ను ఎవరూ ఆపలేరని అంటాడు. ఒకవేళ మీరు  ఇక్కడ  నుంచి పెళ్లి చేసుకుండా  వెళ్లినా....మీ వాళ్లు మిమ్మల్ని వెంటాడి వాడిని చంపేసి నిన్ను  తీసుకుని వెళ్లిపోతారని చెబుతాడు.  నీకు సాయం చేయడానికి వచ్చి వాడి ప్రాణాల మీదకు తెచ్చకున్నాడని  చెబుతాడు. నిజంగా  మేం ఇద్దరం లవర్స్‌ కాదని...కేవలం  అతన్ని సాయం కోరి మాత్రమే వచ్చానని మహా చెబుతుంది. ఏదీఏమైనా  ఇప్పుడు  నీ ముందు  ఒకటేదారి ఉందని.....మీ నాన్న వెంట వెళ్లి వాడిని పెళ్లి చేసుకోవడమా   లేకపోతే ఇక్కడే  ఆ డ్రైవర్‌ను పెళ్లి చేసుకుని నీ భవిష్యత్‌ దిద్దుకోవడమా ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోతాడు.
                       అటు చక్రిని పక్కకు తీసుకెళ్లిన  కానిస్టేబుల్‌  కూడా చక్రిని  ప్రశ్నిస్తాడు.  ఇప్పుడు  ఆ అమ్మాయితో  నువ్వుబయటకు  వెళ్లావంటే  ఖచ్చితంగా  వాళ్లు  నిన్ను చంపేస్తారని బెదిరిస్తాడు. ఇప్పుడు   నువ్వు  ఆ అమ్మాయి మెడలో తాళి కడితే అన్ని సమస్యలు  తీరిపోతాయని  చెబుతాడు. దీనికి నీకు అంగీకారమేనా  అని అడుగుతాడు.  కోరి వరమిస్తే వద్దంటానా అని చక్రి అనుకుంటాడు.  ఇలా అన్నీ తనకు అనుకూలంగా  మారుతున్నాయని  లోపల ఆనందపడిపోతాడు. పైకి మాత్రం తనకు  ఏం అయిన పర్వాలేదు కానీ....మహాకు మాత్రం ఆ శాడిస్టు భూషణ్‌గాడితో  పెళ్లి తప్పిపోతే చాలని నటిస్తుంటాడు. తనను కాపాడటం కోసం పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. ఇదే విషయం  మహాతో చెప్పగా...ఆమె కోప్పడుతుంది. పెళ్లి ఏంటని నిలదీస్తుంది. ఇప్పుడు ఈపెళ్లి జరగకపోతే  నన్ను  చంపేస్తారంటా అని చక్రి చెప్పడంతో ఆమెకు ఏమీ పాలుపోదు. అయితే చక్రి ఇక్కడ ఉత్తుత్తి పెళ్లి చేసుకుందామని....ఆ గండం నుంచి బయటపడిన తర్వాత నీ భవిష్యత్‌ గురించి ఆలోచిద్దామని  అంటాడు. పోలీసులు  వాళ్లిద్దరికీ  పెళ్లి చేయాలని అనుకుంటున్నారని  తెలుసుకున్న  ఆది వెంటనే వెళ్లి వాళ్ల నాన్నకు  ఈ విషయం చెబుతాడు.
                             పోలీసు అధికారులతో మాట్లాడుతున్న  ప్రతాప్ వెంటనే లోపలికి వచ్చి ఎస్‌ఐ పై మండిపడతాడు. దానికి ఎస్‌ఐ కూడా  స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తాడు. వాళ్లిద్దరూ మేజర్లని....పెళ్లి చేసుకోవాలా  వద్దా అన్నది   వాళ్లు నిర్ణయించుకుంటారని చెబుతాడు. మీరు ఎంత పై అధికారులకు ఫోన్లు చేసినా...వాళ్లు కూడా నాకు ఇదే చెబుతారని చెబుతాడు. ఇంతలో  ఈ పెళ్లి చేసుకోవడం  తనకు కూడా  ఇష్టమేనని మహా చెబుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 30th: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
Podarillu Serial Today July 30th: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌
పొదరిల్లు: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌
Gundeninda Gudigantalu July30th Episode:సుందరి పెళ్లికి వెళ్లిన బాలు కుటుంబం....అక్కడ రోహిణి మామ మాణిక్యం పరిస్థితి ఏంటి...?
గుండెనిండా గుడిగంటలు: సుందరి పెళ్లికి వెళ్లిన బాలు కుటుంబం....అక్కడ రోహిణి మామ మాణిక్యం పరిస్థితి ఏంటి...?
Ashika Padukone: త్రినయని సీరియల్ నటి.. సాఫ్ట్‌వేర్ నుంచి బుల్లితెర వరకు.. ఆషిక గోపాల్ రియల్ లైఫ్ విషయాలు
త్రినయని సీరియల్ నటి.. సాఫ్ట్‌వేర్ నుంచి బుల్లితెర వరకు.. ఆషిక గోపాల్ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget