అన్వేషించండి

Podharillu Serial Today Feb 19th: ఉద్యోగం చూసి పెట్టాలంటూ మాధవ్‌ను కోరిన మహాలక్ష్మీ....స‌ర్టిఫికేట్ల కోసం ఇంటికి ఫోన్‌చేసిన మాహాకు ఎలాంటి అనుభవవం ఎదురైంది.

Podharillu Serial Today Episode February 19th:ఉద్యోగం చూసి పెట్టాలంటూ మాధవ్‌ను కోరిన మహాలక్ష్మీ....స‌ర్టిఫికేట్ల కోసం ఇంటికి ఫోన్‌చేసిన మాహాకు ఎలాంటి అనుభవవం ఎదురైంది.

Podharillu Serial Today Episode: మాధవ్‌ వంటచేస్తుండగా అక్కడికి వచ్చిన మహాలక్ష్మీ...తనకు ఓ ఉద్యోగం చూడమని అడుగుతుంది. ఎంతకాలం మీ ఇంట్లో ఉంటానని నా కాళ్లమీద నేను నిల్చుని సొంతంగా బతకాలని అనిపిస్తోందని అంటుంది. ఆ మాటలు వినగానే మాధవ్‌ ఇక్కడ నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా అని అడుగుతాడు. ఏం లేదుకానీ  ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నానని....కనీసం తనకు ఇష్టమైన ఉద్యోగమైనా  చేసుకోనివ్వండని కోరుతుంది. మీరు పెద్ద ఆర్కిటెక్‌ కదా మీ కంపెనీలోనే ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుతుంది. ఆ మాటలు విన్న మాధవ్‌కు ఏదోలా అనిపిస్తుంది. ఆమెకు నిజం చెప్పేయాలని అనుకుంటాడు. కానీ చక్రి వద్దని బ్రతిమాలడంతో  అప్పటికి సరేనని అనడంతో మహా సంతోషంతో  అక్కడి  నుంచి వెళ్లిపోతుంది.
                      రాత్రికి ఇంట్లో అందరూ బయటకు వెళ్లిపోవడంతో మహా  ఒక్కతే ఇంట్లో ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన నారాయణ అందరూ ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు. బయటకు వెళ్లారని చెప్పడంతో   ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని బయట కూర్చుని మందు బాటిల్ ఓపెన్ చేసి తాగడం మొదలుపెడతాడు. ఇదంతా మహాకు చిరాకుగా అనిపిస్తుంది. కొంచెం మందు తాగిన వెంటనే ఇక వాగడం స్టార్ట్ చేస్తాడు. తన గురించి, భార్య గురించి బిడ్డల గురించి చెబుతుంటాడు. అప్పుడే కరెంట్ పోతుంది. దీంతో మహాకు మరింత భయం వేస్తుంది. కొవ్వొత్తి ఉందా అని అడిగితే లేదని చెబుతాడు నారాయణ. దేవుడి దగ్గర దీపం పెట్టి అక్కడే కూర్చుకుంటుంది.  నారాయణ చెప్పిందే చెప్పి విసుగుపుట్టిస్తుండటంతో   భయంతో రోడ్డుమీదకు  వచ్చి స్ట్రీట్‌ లైట్‌ కింద అటుఇటు తిరుగుతుండగా....చక్రి, కన్నా వస్తారు.  ఏంటి ఇక్కడ ఉన్నావని అడిగితే మీ నాన్న వచ్చారని అంటుంది. తాగి వచ్చి గొడవ చేశాడా అంటే లేదు ఇంట్లోనే తాగి చెప్పించే చెప్పి బుర్ర తింటున్నాడని చెబుతుంది. దీంతో కోపంతో ఇంటికి వెళ్లిన చక్రి....వాళ్లనాన్నపై మండిపడతాడు. నీకు  ఇంట్లోఎలా ఉండాలో కూడా తెలియడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంతకు ముందు మనం మాత్రమే ఉన్నామని ఇప్పుడు...ఇంట్లోకి ఓ అమ్మాయి వచ్చిందన్న జ్ఞానం కూడా లేదని అంటాడు. మహా అతన్ని వారించి ఇంట్లోకి తీసుకువెళ్లిపోతుంది.
                      ఇంట్లోకి  వెళ్లిన తర్వాత మహా నిహారికకు  కాల్‌ చేస్తుంది. దీంతో వాళ్లవదిన చాలా కంగారుపడి ఏం జరిగిందని అడుగుతుంది. నువ్వు ఫోన్ చేస్తున్నావని తెలిసి మీ  అన్నయ్య నామీద చాలా కోపంగా ఉన్నారని అంటుంది.మీ నాన్న నువ్వు వెళ్లిన దగ్గర నుంచి అస్సలు ఏం బాగాలేదని చెబుతుంది. అక్కడ అంతా బాగానే ఉందా అని అడిగితే లేదని...నాకు అసలు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదని చాలా ఇబ్బందిగా ఉందని చెబుతుంది. దీంతో నిహారిక ఇంకాస్త భయపడుతుంది. ఐదుగురు మగవాళ్లు ఉన్న ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావని అడుగుతుంది. అలాంటి ఇబ్బంది ఏమీ లేదని...వీళ్లంతా చాలామంచిగా చూసకుంటున్నారని అంటుంది. అయితే తాను చక్రిని నిజంగా ఇష్టపడి పెళ్లిచేసుకోలేదని...పరిస్థితులు ప్రభావం వల్ల  చేసుకోవాల్సి వచ్చిందని చెప్పడంతో  నిహారిక షాక్‌కు గురవుతుంది. అదేంటని అడగగా...ఆ విషయాలన్నీ తర్వాత చెబుతానని నేను ఉద్యోగం చేయాలని అనుకుంటున్నానని  అంటుంది. నాకాళ్ల మీద నేను నిల్చున్న తర్వాత  వెళ్లి హాస్టల్‌లో ఉంటానని అంటుంది.అందుకు  నా సర్టిఫికేట్లు కావాలని అంటుంది. నువ్వు వెళ్లిపోతే చక్రి పరిస్థితి ఏంటని నిహారిక అంటుంది. ఆ విషయాలన్నీ నేను తర్వాత  చెబుతానని...ముందు నువ్వు ఏదోలా నా సర్టిఫికేట్లు తీసుకున్న  తర్వాత కాల్‌ చేసి చెప్పమని అంటుంది. దీంతో  నిహారిక సరేనని అంటుంది.
               మహా ఫోన్ చేసిన విషయాన్ని నిహారిక వాళ్ల అత్తయ్యకు చెబుతుంది. మహా అక్కడ ఉండలేకపోతుందని చాలా ఇబ్బందులు పడుతోందని చెబుతుంది. దీంతో ఆమె చాలా బాధపడుతుంది. తన సర్టిఫికెట్లు కావాలని అడుగుతోందని చెబుతుంది. దీంతో ఆమె ఈ విషయం ఇవాళ ఎలాగైనా తేల్చేస్తానని  భర్త దగ్గరకు వెళ్లి చెబుతుంది. ఆది,ప్రతాప్‌ ఆమెపై కోప్పడతారు. మనం  ఊహించే జరుగుతోంది కదా అని అంటే....నా కూతురు ఇబ్బందులు నేను చూడలేనని....అది వస్తానంటే వెంటనే తీసుకురావాలని అంటుంది.లేకుంటే నా చావును చూస్తారంటూ  బెదిరించి వెళ్లిపోతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget