అన్వేషించండి

Podharillu Serial Today Feb 12th: హాస్టల్‌ దొరక్కపోవడంతో రూమ్‌ చూడమని మాధవ్‌కు చెప్పిన మహా...చక్రిని నిద్రలేపడానికి వెళ్లిన మహాకు ఎదురైన అనుభవం ఏంటి..?

Podharillu Serial Today Episode February 12th:హాస్టల్‌ దొరక్కపోవడంతో రూమ్‌ చూడమని మాధవ్‌కు చెప్పిన మహా...చక్రిని నిద్రలేపడానికి వెళ్లిన మహాకు ఎదురైన అనుభవం ఏంటి..?

Podharillu Serial Today Episode: చక్రి ఎంత చెప్పినా వినడం లేదని.. అద్దెకు ఇల్లుగానీ, రూమ్‌గానీ చూడమని మహాలక్ష్మీ  మాధవ్‌కు చెబుతుంది. ఏంటమ్మా నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదా లేకపోతే మావల్ల ఏమైనా ఇబ్బందిపడుతున్నావా  అని అడుగుతాడు మాదవ్‌...అలాంటిదేమీ లేదని కాకపోతే నేను ఏ పరిస్థితుల్లో ఇక్కడి వచ్చానో మీకు కూడా బాగా తెలుసు కదా అని అంటుంది. దీంతో తప్పకుండా రూమ్ చూస్తానని మాధవ్‌ హామీ ఇస్తాడు. అబ్బాయిలు కంటే ఎలాగైనా రూమ్‌ దొరుకుతుందని...కాకపోతే  నువ్వు ఉండాలంటే  మాత్రం చాలా మంచి రూమ్ కావాలని, నీకు సౌకర్యంతో పాటు రక్షణగా ఉండే రూమ్ ఉండాలి కదా కొంచెం లేట్‌ అయినా మంచి రూమ్‌ వెతికిపెడతానని అంటాడు. అప్పటి వరకు నువ్వు మా ఇంట్లో నీ సొంత ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చని చెబుతాడు.  మధ్యలో చక్రి కలుగజేసుకుని నేను చూస్తానని చెప్పాను కదా అంటాడు. నీవల్ల కావడం లేదనే నీను మీఅన్నయ్యకు చెప్పానని వెళ్లిపోతుంది.
              మహాలక్ష్మీ వెళ్లిపోయిన తర్వాత నిజంగా రూమ్‌ చూస్తావా అన్నయ్య అని అడుగుతాడు  చక్రి. ఆమె అంతగా అడుగుతుంటే చూడకుండా ఎలా ఉంటానని అంటాడు. నువ్వు రూమ్‌ చూస్తే ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోతుందని...అప్పుడు నాకు శాశ్వతంగా  దూరమవుతుందని అంటాడు. తను నా దగ్గర ఉంటేనే కదా అన్న మేమిద్దరం  అర్థం చేసుకుని దగ్గర అయ్యేదని అంటాడు. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో నీతో తాళి కట్టించుకుందో  వివరంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ అమ్మాయిపై ఆశలు పెట్టుకోవడం తప్పని అంటాడు. ఆడపిల్ల అవసరాన్ని అడ్డుపెట్టుకుని నీ దాన్ని చేసుకోవాలని చూడటం స్వార్థమవుతుందని హెచ్చరిస్తాడు. ఆ అమ్మాయి దృష్టిలో ఇప్పటికీ నువ్వు చాలా సాయం చేశావని గౌరవం ఉందని అది పోగొట్టుకోవద్దని అంటాడు. నేను మహాను  ఇష్టపడటం నిజమేగానీ...ఏదీ నేను కావాలని చేయలేదని అన్నీ నాకు అలా కలిసొచ్చాయంతేనని అంటాడు. పెళ్లి కూడా నేను ప్లాన్ చేసి చేసుకోలేదని ఆ దేవుడే ఇలా చేశాడని అంటాడు. అయినాగానీ ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇక్కడ ఉంచలేనని చెబుతాడు. వెళ్లి అమ్మాయి గదికి గొల్లెం సరిచేసి రమ్మని పంపిస్తాడు. రాత్రికి చక్రి మళ్లీ వచ్చి  హాల్‌లోనే పడుకుంటుంటే కేశవ్‌, కన్నా మళ్లీ కోప్పడతారు. మాదగ్గర ఏదో దాస్తున్నావని నిలదీస్తారు. మాధవ్‌ వచ్చి అందరూ గొడవ చేయకుండా  పడుకోండని చెప్పి పడుకోబెడతాడు.
                     తెల్లారి మహా నిద్రలేచేసరికి  మాధవ్ ఇంటిపనులన్నీ చేస్తుండటం చూసి ఆమెకు జాలి వేస్తుంది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి పోలీసులు నారాయణను ఇంటివద్ద వదిలిపెట్టి వెళ్లిపోతారు. మీనాన్నను చాలా త్వరగానే వదిలిపెట్టారని మహా అనగా...ఇదంతా మాకు మామూలేనని ఆయన ఎప్పుడూ వాళ్ల అన్నయ్యపై గొడవపడి అలా స్టేషన్‌కు వెళ్లి వస్తూనే ఉంటాడని చెబుతాడు. ఇంతలో టీ పెట్టి ఇచ్చి మధ్యాహ్నం భోజనానికి  రెడీ చేస్తుంటాడు మాధవ్‌. అదేంటీ ఇంటి పనులన్నీ మీరు ఒక్కరే చేస్తుంటే  వీళ్లంతా  గుర్రుపెట్టి నిద్రపోతున్నారని మహా అడుగుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్లకు తల్లిలేకపోవడంతో  నేను దగ్గర ఉండి పెంచానని అప్పటి నుంచి మాకు ఇలా అలవాటు అయిపోయిందని అంటాడు. అప్పుడంటే చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు కదా మీకు సాయం చేయకుండా అలా నిద్రపోతే ఎలా అని అంటుంది. ఇంటి పనులన్నీ తానే చేస్తానంటూ  పెద్ద బిల్డప్‌ ఇచ్చిన మీ చక్రి కూడా నిద్రపోతున్నాడని...నేను నిద్రలేపుతానని చెప్పి నీళ్లు తీసుకుని వెళ్తుంది. చక్రిని నిద్రలేపడానికి  వెళ్తుండగా....కేశవ్‌ కాలు తగిలి నీళ్లు అతని ముఖంపై పడతాయి. నిద్రలో ఉన్న కేశవ్‌...తనపై ఎవరో నీళ్లు పోశారనుకుని చేయి పైకి ఎత్తుతాడు. దీంతో భయపడిపోయిన మహా ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ కేశవ్‌పై మండిపడతాడు. వదినపైనే చేయి ఎత్తుతావా అంటూ చక్రి అనగా...ఇద్దరూ గొడవపడతారు. దీంతో మాధవ్ ఇద్దరిని తిట్టి పంపిస్తాడు.
    

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget