అన్వేషించండి

Podharillu Serial Today Feb 10th: హాస్టల్‌లోఉండటానికి మహా చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి..? నారాయణ వాళ్ల అన్న తలపగులగొట్టడానికి కారణమేంటి..?

Podharillu Serial Today Episode February 10th: హాస్టల్‌లోఉండటానికి మహా చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి..? నారాయణ వాళ్ల అన్న తలపగులగొట్టడానికి కారణమేంటి..?

Podharillu Serial Today Episode: మహా, చక్రి మాటలు విన్నప్పటి నుంచి మాధవ్‌ చాలా చిరాకుగా  ఉంటాడు. మహాలక్ష్మీ ఇంట్లోనుంచి వెళ్లిపోతానని పదే పదే చెబుతుండటంతో  అతను చాలా బాధపడుతుంటాడు. దీంతో చుట్టుపక్కల వారిపై మండిపడుతుంటాడు. వాళ్ల అత్తపెట్టిన శాపం నిజం కాబోతుందని  ఆందోళన చెందుతుంటాడు. పనికి వెళ్లిన దగ్గర కూడా  ఎప్పుడూ  ఎవరినీ ఒక్కమాట కూడా  అనని మాధవ్‌...అందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాడు. ఈలోగా చక్రిని తీసుకుని మహా హాస్టల్స్‌కు  వెళ్తుంది. ఎక్కడికి వెళ్లినా ఆమెకు సీటు ఇవ్వరు. గుర్తింపు కార్డులులేకుండా   తాము హాస్టళ్లలో చేర్చుకోబోమని తెగేసి చెబుతారు. ఉద్యోగం లేనివాళ్లని హాస్టళ్లలో ఉంచుకోమని చెబుతారు. వాళ్లు నాలుగైదు హాస్టళ్లు తిరుగుతారు.వాళ్లు అడిగే ప్రశ్నలకు  సమాధానం చెప్పలేక...తెల్లముఖం వేస్తారు.
ఇక  లాభంలేదనుకుని  చక్రి ఇక వెళ్లొద్దని చెబుతాడు.  మా ఇంట్లోనే  ఉండండని  రిక్వెస్ట్ చేస్తాడు. బయట పరిస్థితులు  ఏం బాగాలేవని ఆమెను సముదాయిస్తాడు. సరే అని తిరిగి కారులో ఇంటికి వెళ్తుంటే ఓ నగల దుకాణ వద్ద కారు ఆపించి మహా తన మెడలో ఉన్న గొలుసు అమ్మి డబ్బులు తీసుకుందామని అంటుంది. దీనికి చక్రి అభ్యంతరం చెప్పినా....ఆమె వినదు. సరేనని అక్కడికి తీసుకెళ్లి  ఆ గొలుసు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వమని చక్రి అంటాడు. దీనికి  దుకాణం వాడు సరేనని చెప్పి ఆగొలుసు తాకట్టు పెట్టుకుని వాళ్లకు డబ్బులు తిరిగి ఇస్తాడు.
                ఫంక్షన్‌ పూర్తవ్వడంతో  బ్యాలెన్స్ ఎమౌంట్‌ ఇవ్వాల్సిన వాళ్లందరికీ మాధవ్ డబ్బులు తిరగి ఇచ్చి పంపిస్తుండగా...అప్పుడే అక్కడికి వాళ్ల అత్తయ్య,  పెదనాన్న వస్తారు. ఎవరిని అడిగి మా స్థలంలో  ఈఫంక్షన్  ఏర్పాట్లు చేశారని మాదవ్‌పై గొడవపడతారు. ఇది మాఇల్లు  కదా మాఇంటి ముందు  ఫంక్షన్ చేయడానికి  ఎవరిని పర్మిషన్ అడగాలని  కేశవ్ అంటాడు. ఇది ఇంకా మీ ఇల్లు కాలేదని...వ్యవహారం కోర్టులో ఉందని అప్పటి వరకు  దీనిపై మాకు కూడా హక్కులు ఉన్నాయని అంటారు. కాబట్టి మా అనుమతి లేకుండా  ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఊరుకోమని అంటారు. మీరు ఫంక్షన్  చేసిన దానికి  అద్దె కట్టాలని అడుగుతారు. దీంతో అక్కడే ఉన్న నారాయణకు కోపం వస్తుంది.ఇంకోసారి ఈ  ఇంటి వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో వాళ్ల అన్నయ్య  వీళ్లు  కోర్టు  చెప్పినట్లు  నడుచుకోవడం  లేదని ...కాబట్టి మనం కూడా కోర్టు చెప్పినట్లు  నడుచుకోవాల్సిన అవసరం లేదని ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని  బయటపడేస్తే సరిపోతుందని ఇంట్లోకి  వెళ్లబోతాడు.  దీంతో నాాయణకు మరింత కోపం వచ్చి వాళ్ల అన్నయ్య చొక్కాపట్టుకుని గొడవపడతాడు.దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ పెద్దదవుతుంది. ఈగొడవలో  నారాయణ వాళ్ల అన్నయ్యను  గట్టిగా నెట్టివేయడంతో  కిందపడి తలకు దెబ్బతగులుతుంది.  దీంతో వాళ్లు పోలీసులను తీసుకుని వస్తామని వెళ్లిపోతారు.
                           హాస్టళ్లలో ఉండటానికి ఐడీ ఫ్రూప్స్‌ అడుగుతున్నారు కాబట్టి మనం ఏదైనా  ఇల్లు అద్దెకు తీసుకుందామని చక్రితో మహా అంటుంది. అప్పుడు ఎలాంటి ఐడీకార్డులు లేకుండానే  మనం  ఇల్లు అద్దెకు తీసుకోవచ్చు కదా అని అంటుంది. మీకు  తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే అద్దెకు ఇల్లు ఇచ్చే వాళ్లను చూడండని  అంటుంది. సింగిల్ రూమ్ ఉన్నా చాలు అంటుంది. రెంటల్ అగ్రిమెంట్‌ లేకుండా ఇల్లు అద్దెకు ఇవ్వరని చక్రి అంటాడు. అయితే మీకు తెలిసిన వాళ్ల దగ్గర తీసుకుందామని అంటుంది.అయితే ఇంటికి వెళ్లి ఆలోచిద్దామని  చెప్పి మహాను  తీసుకుని అతను ఇంటికి బయలుదేరతాడు. మార్గమధ్యలో తాకట్టు పెట్టిన బంగారం డబ్బులను  తిరిగి చక్రికి ఇస్తుంది.నాకు అవసరం లేదని మీ దగ్గరే ఉంచుకోమని చెప్పినా మహా వినదు.ఇప్పటికే నాకోసం చాలా ఖర్చు చేశారని...పైగా మీ పనులన్నీ మానుకుని నాకోసం  తిరిగారని  ఇప్పుడు ఈ డబ్బులు  తీసుకోకపోతే నాకు గిల్ట్గీగా ఉంటుదని బలవంతం చేయడంతో చక్రి తప్పక ఆమె వద్ద నుంచి డబ్బులు  తీసుకుంటాడు.
   

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget