అన్వేషించండి

Podharillu Serial Today December17th: మాధవ్‌ ఇల్లు రిపేర్‌ పనులను తాయర్‌ ఎందుకు అడ్డుకుంది..? మహా చేసిన గొడవ తర్వాత భూషణ్ పరిస్థితి ఏంటి..?

Podharillu Serial Today Episode December17th: పెళ్లివారు వస్తున్నారని మాధవ్‌ ఇల్లు రిపేర్‌ పనులు మొదలుపెట్టగానే తాయర్‌ వచ్చి అడ్డుకుంటుంది. అటు మహా చేసిన పనికి భూషణ్‌ ఆమెపై కోపంగా ఉంటాడు.

Podharillu Serial Today Episode: మాధవ్‌ పెళ్లి చేయాలంటే  ఇల్లు రిపేర్ చేయించాలని బ్రోకర్ చెప్పడంతో అన్నదమ్ములు  ఆపనులు మొదలుపెడుతుంటారు. ఈవిషయాన్ని గాయత్రి వాళ్ల ప్రెండ్‌ ఆమెకు చెబుతుంది. మా అమ్మ, మామయ్యకు బయపడకుండా  ఇళ్లు బాగుచేయించుకోవడం చూసి గాయత్రి ఆనందపడిపోతుంది. కానీ వాళ్లు ప్రెండ్‌ అసలు విషయం చెబుతుంది. పెళ్లికోసమే ఇల్లు బాగుచేయించుకుంటున్నారని చెప్పడంతో షాక్‌ తింటుంది. ఆడపిల్ల సంబంధం వాళ్లు రానున్నారని చెబుతుంది. మీ బావ నీకు దక్కాలంటే ఆ ఇంటి రిపేర్ పనులు ఆపించాలని చెబుతుంది. దీంతో వెంటనే వెళ్లి ఈ విషయం వాళ్ల అమ్మకు చెబుతుంది. దీంతో తాయరు అగ్గిమీద గుగ్గిలమవుతుంది.
   
   అటు మాధవ్‌ సహా తమ్ముళ్లు అందరూ కలిసి ఇంటి రిపేర్ పనులు మొదలుపెడతారు. సిమెంట్‌ తో ప్యాచ్ వర్క్‌ చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఈలోగా అక్కడికి తాయర్‌తో కలిసి  నారాయణ వాళ్ల అన్నయ్య వస్తారు. కోర్టుతీర్పు ఉన్నా సరే ఎంత ధైర్యం ఉంటే ఇంటి రిపేర్ పనులు మొదలుపెడతారని మండిపడతారు. కోర్టు కేసు వచ్చేలోగా ఇంటిపై చేయి వేస్తే ఊరుకునేదే లేదంటారు. ఇల్లు మొత్తం పడగొట్టి కట్టించడం లేదని...చిన్న చిన్న రిపేర్‌లు చేయిస్తున్నామని మాధవ్‌ అంటాడు. ఇంటి మీద చేయి వేస్తే పోలీసు కేసు పెడతామని తాయరు అంటుంది. మళ్లీ తాయర్ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టడంతో చెల్లిను కొట్టేందుకు నారాయణ సైకిల్ పైకి ఎత్తుతాడు. దీంతో మాధవ్ వాళ్ల అత్తను ఒప్పించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎలాంటి రిపేర్‌ పనులు చేయబోమని చెబుతాడు.
  
   మహా చేసిన పనికి పిచ్చకోపంతో రగిలిపోతుంటాడు భూషణ్‌..హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చిన తర్వాత చిందులు తొక్కుతుంటాడు.నువ్వు ఇంత కోపం ప్రదర్శస్తే ఆ అమ్మాయి ఎలా పెళ్లిచేసుకుంటుందని వాళ్ల సముదాయిస్తుంటుంది. ఇంతలో ఆది వెళ్లి పెళ్లికొడుక్కి సారీ చెప్పి బ్రతిమాలుడుతాడు. రోడ్డుమీద వెళ్లే ఓ డ్రైవర్‌కు సపోర్ట్ చేసి నన్ను అవమానపరుస్తుందా అంటాడు.  నా పరువు మొత్తంపోయిందని మండిపడతాడు. నేను తప్పుచేసినా సరే నువ్వు దాన్ని కరెక్ట్‌ అని చెప్పాలి అంటాడు. దీంతో ఇద్దరూ గొడవపడుతుంటే  హారిక ఆపి మహాను  రూమ్‌లోకి తీసుకెళ్తుంది.
   ఆది వచ్చి మహామీద కోప్పడతాడు.ఎందుకు ఎదురుమాట్లాడుతున్నావని మండిపడతాడు.వాడు తప్పుచేసినా కరెక్టే అని సపోర్ట్‌ చేయడం ఏం న్యాయం అని మహా నిలదీస్తుంది. చిన్నప్పటి నుంచి వాడ్ని అలాగే పెంచామని వాళ్ల అమ్మ చెప్పింది కదా...నువ్వు కొంచెం తగ్గి ఉండొచ్చు కదా అని ఆది మహాకు సర్ధిచెబుతుంటాడు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పకుండా  గొప్ప పని చేశావని నెత్తిన పెట్టుకోమంటావా అని మహా మండిపడుతుంది. వాడితో జీవితాంతం కలిసి ఉండాల్సిన దానివి ఆ మాత్రం సర్దుకుపోలేవా అని అంటాడు. వాడిని ఒక్కపూట భరించడమే కష్టమని...జీవితాంతం ఎలా భరిస్తానని అంటుంది. కొత్తలో అలాగే ఉంటుందని...రానురాను  అతని ఇష్టాలకు అనుగుణంగా మారిపోవచ్చని అంటాడు. దీంతో మహాకు మరింత కోపం వస్తుంది. నువ్వు అసలు నా అన్నవేనా  అని నిలదీస్తుంది. మీరు ఏం చేసినా అతనే నీకు కాబోయే మొగుడని...అతనితో ఎలా నడుచుకోవాలో నేర్చుకోమని చెబుతాడు.

   చక్రికి వాళ్ల కారు ఓనర్‌ ఫోన్ చేసి జూబ్లిహిల్స్‌లో ఓ కారుకు డ్రైవర్‌గా వెళ్లాలని చెబుతాడు. కొద్దిరోజులు పాటు అక్కడే పనిచేయాలని చెబుతాడు. ఇంతలో గాయత్రి మాధవ్‌ కోసం జున్ను తీసుకుని వస్తుంది. మీ ఇల్లు బాగుచేయకుండా మా అమ్మవాళ్లు అడ్డుకున్నారంటగా అని జాలిపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today November 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని తిట్టిన ఐశ్వర్య – కొత్త ప్లాన్‌ చేసిన రేఖ
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని తిట్టిన ఐశ్వర్య – కొత్త ప్లాన్‌ చేసిన రేఖ
Meghasandesam Serial Today November 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  కేపీ, శారదల పెళ్లి – ఆపేందుకు వెళ్లిన అపూర్వ, శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌:  కేపీ, శారదల పెళ్లి – ఆపేందుకు వెళ్లిన అపూర్వ, శరత్‌ చంద్ర
Nindu Noorella Saavasam Serial Today November 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను షాపింగ్‌ మాల్‌లో కిలిసిన ఎస్సై – అదే మాల్‌కు వచ్చిన పార్థు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను షాపింగ్‌ మాల్‌లో కిలిసిన ఎస్సై – అదే మాల్‌కు వచ్చిన పార్థు
Jagadhatri Serial Today Nov 12:నిషిక,కాచీని మాయచేసి కౌషికితో కలిసి పూజలో కూర్చోబెట్టిన జగధాత్రి..కూతురిపై మండిపడిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:నిషిక,కాచీని మాయచేసి కౌషికితో కలిసి పూజలో కూర్చోబెట్టిన జగధాత్రి..కూతురిపై మండిపడిన కమలాకర్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Embed widget