అన్వేషించండి

Podharillu Serial Today April 10th: మాధవ్‌, గాయత్రిల పెళ్లికి గుడిలో మహా ఏర్పాట్లు...ఇంతకీ గాయత్రి ఇంట్లో నుంచి వచ్చిందా లేదా..?

Podharillu Serial Today Episode April 8th: మాధవ్‌, గాయత్రిల పెళ్లికి గుడిలో మహా ఏర్పాట్లు...ఇంతకీ గాయత్రి ఇంట్లో నుంచి వచ్చిందా లేదా..?

Podharillu Serial Today Episode: మాధవ్‌ పెళ్లికి మహాలక్ష్మీ అన్ని ఏర్పాట్లు చేసి గుడిలో సిద్ధంగా ఉంటుంది. గాయత్రి రాకకోసం ఎదురుచూస్తుంటుంది. అటు ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ గాయత్రిని  ఎక్కడికి పంపవద్దని బామ్మకు చెప్పి తాయర్ వెళ్తుంది. దీంతో బామ్మ గాయత్రిని అడుగు బయటపెట్టనివ్వదు. బామ్మను టీవీ సీరియల్‌లో లీనం చేసి గాయత్రి బ్యాగ్‌ తీసుకుని బయటకు అడుగుపెడుతుంది. అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వస్తున్న తాయర్‌ కూతురుని చూసి ఎక్కడికని నిలదీస్తుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని గాయత్రి బదులిస్తుంది. గట్టిగా అడగడంతో గుడికి వెళ్తున్నానని గాయత్రి చెబుతుంది. ఉదయం గుడికి వెళ్లి వచ్చావు కదా మళ్లీ ఎందుకని తల్లి ప్రశ్నిస్తుంది. అయినా గుడికి వెళ్లేదానికి చేతిలో బ్యాగు ఎందుకని లాక్కుని చూస్తుంది. అందులో తనకు సంబంధించిన సర్టిఫికేట్లు, నగలు ఉండటం చూసి గట్టిగా నిలదీస్తుంది. మాధవ్‌ బావను పెళ్లిచేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పడంతో గాయత్రిని లాక్కుని ఇంట్లోకి తీసుకెళ్తుంది తాయరు. ఎంత ధైర్యం ఉంటే లేచిపోతున్నానని నాకే చెబుతావా అని తాయర్‌ కూతురిని నిలదీస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి బావ అంటే ఇష్టమని....నేను బావను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లిచేసుకోనని తెగేసి చెబుతుంది. 
                  గాయత్రి ఎదురించి మాట్లాడటం చూసి తాయర్‌కు కోపం వస్తుంది. మేం చూసిన  సంబంధం కన్నా వాడు ఎందులో గొప్పవాడని నిలదీస్తుంది. అయినా ఆ ఇంటికి ఏ అమ్మాయి కోడలిగా రాకూడదని నేను శాపం పెడితే....నువ్వే వెళ్తానంటున్నావేంటని మండిపడుతుంది. ఆ దరిద్రుల కొంపకు నిన్ను ఎప్పటికీ వెళ్లనివ్వనని అంటుంది. మీరు ఏం చేసినా....నేను మాధవ్‌ బావను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లిచేసుకోనని చెప్పగా....తాయరు కూతురు చెంప పగులగొడుతుంది. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వాడికోసం లేచిపోతానంటావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాకు పెళ్లిచేయమని నేను అడగలేదని...దుబాయి సంబంధం తీసుకురమ్మని కూడా కోరలేదని గాయత్రి అంటుంది. అంతా మీకు నచ్చినట్లు మీరు చేసుకుని నాకేదో ప్రేమతో చేసినట్లు చెబుతున్నారేంటని నిలదీస్తుంది. మీ కోపం, పగలు తీర్చుకోవడానికి నన్ను ఆటబొమ్మగా మార్చారని అంటుంది. ఏదీఏమైనా నేను మాత్రం మాధవ్‌ బావను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోనని తెగేసి చెబుతుంది. గాయత్రిని మరోసారి కొట్టడానికి దగ్గరకు రాగా...వయసులో పెద్దదానివి నేను కొడితే బాధపడతావని గాయత్రి తల్లిని హెచ్చరిస్తుంది.
                   ముహూర్తం సమయం దగ్గరపడుతున్నా గాయత్రి రాకపోవడంతో మహాలక్ష్మీ, పెద్ది కంగారుపడిపోతుంటారు. గుడి మూసివేసే సమయం అవుతుందని తెలిసి గాబరా పడుతుంటారు. మహాలక్ష్మీ కాళ్లుచేతులు ఆడక అటుఇటు  తిరుగుతుంటుంది. దీంతో చక్రి వచ్చి ఆ గాయత్రి గురించి మాకు మొదటి నుంచి తెలుసని అది చివరి నిమిషంలో ఇలాగే చేస్తుందని అంటాడు. దీంతో మహాలక్ష్మీ చక్రిపై మండిపడుతుంది. ఎప్పుడూ నెగిటివ్‌గా ఆలోచించడమేనా అని  అరుస్తుంది. గాయత్రికి ఫోన్ చేయగా...తాయర్ ఫోన్ తీసుకుని ఇదంతా చేయిస్తుంది ఇదేనా అని అనుకుంటుంది.ఆ రోజు నామీద ఛాలెంజ్‌ చేసి వెళ్లిందికదా అందుకే ఇలా చేస్తుందా అని కూతురుతో అంటుంది. ఫోన్ తీసుకుని స్విచ్ఛాప్ చేస్తుంది. మహాలక్ష్మీ ఎంతసేపు ఫోన్ చేసినా స్విచ్ఛాప్‌ రావడంతో వాళ్లు  ఇంకా కంగారుపడతారు. వెంటనే వెళ్లి పెద్దికి ఈ విషయం చెబుతుంది మహాలక్ష్మీ..అయితే ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుందని మాధవ్‌ అంటాడు.ఈ వ్యవహారం ఇంతటితో వదిలేద్దామని చెప్పగా....ఇంతదూరం  వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహలక్ష్మీ అంటుంది. మేం వెళ్లి తీసుకొస్తామని చక్రి, మహాలక్ష్మీ, కేశవ్‌ గాయత్రి వాళ్ల ఇంటికి బయలుదేరతారు.
                         మహాలక్ష్మీ పిలవడంతో బయటకు వచ్చిన గాయత్రిని చూసి ఇంకా గుడికి రాలేదేంటని చక్రి,కేశవ్ నిలదీస్తారు. నాకు మాదవ్‌ బావను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని అందుకే రావడం లేదని చెబుతుంది. అదేంటి నువ్వు ఇష్టపడి వస్తానంటేనే కదా నేను పెద్దిని ఒప్పించిందని మహాలక్ష్మీ చెబుతుంది.అప్పుడు ఇష్టముండి వస్తానన్నా..ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడంతో మహాలక్ష్మీ గాయత్రి చెంప పగులగొడుతుంది. పెళ్లంటే ఆటలు అనుకున్నావా అని నిలదీస్తుంది. నీకోసం ఎంతో కష్టపడి పెద్దిని ఒప్పించి గుడిలో కూర్చోబెడితే...ఇక్కడ నువ్వు వేషాలు వేస్తున్నావా అని నిలదీస్తుంది.అసలు నీది ప్రేమే కాదని...ఓ అమాయకుడి జీవితంతో ఆడుకున్నావని తిడుతుంది. నీకు ఇష్టం లేకపోతే వాళ్ల ఇంటి చుట్టూ ఎందుకు తిరగుతున్నావని అడుగుతుంది. నీలాంటి దాని మాటలు నమ్మి...పాపం పెద్దికి లేనిపోని ఆశలు కల్పించి పెళ్లికి రెడీ చేశామని చెబుతుంది. ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కలకు వచ్చినా....మా అన్నయ్యను కలిసినట్లు చూసినా అక్కడి పాతిపెడతానని కేశవ్ గాయత్రికి గట్టి  వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అయితే చక్రి వాళ్లు వచ్చి తలుపు కొట్టినప్పుడు గాయత్రి తీయడానికి వెళ్తుండగా....తాయర్‌ కత్తిపీట మెడపై పెట్టుకుని కూతురిని బెదిరిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్లావంటే నేను ఇక్కకడికిక్కడే పీక నరుక్కుని చస్తానని బెదిరిస్తుంది. అందుకే గాయత్రి బయటకు వెళ్లి వాళ్లతో అలా మాట్లాడుతుంది..

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయమేంటి? విహారి ఆఫీస్‌లో శకుంతల ఏం చేసిందంటే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయమేంటి? విహారి ఆఫీస్‌లో శకుంతల ఏం చేసిందంటే!
Godavari Serial Today July 7th: 'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం తీసుకొచ్చిన సింహాద్రి! జాను అనుమానించడానికి కారణమేంటి?
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం తీసుకొచ్చిన సింహాద్రి! జాను అనుమానించడానికి కారణమేంటి?1
Nindu Manasulu Serial Today July 7th: నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!
నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!
Karthika Deepam 2 Serial Today July 7th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Embed widget