అన్వేషించండి

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Today Episode: హోమం ఆపడానికి ఫణేంద్ర, నాగకన్యలు ప్రయత్నించి విఫలం అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Naga Panchami Telugu Serial Today Episode : సప్త రుషులు మోక్ష కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్పి యాగం ప్రారంభిస్తారు. ఇక నాగలోకం నుంచి నాగ కన్యలు, ఫణేంద్ర యాగాన్ని ఆపేందుకు అక్కడికి వస్తారు.  అందరూ యాగంలో పూర్తిగా లీనమైనప్పుడు పాములుగా మారి ఒక్కసారిగా దాడి చేయాలని ఫణేంద్ర నాగకన్యలకు సూచిస్తాడు. భయంతో వారంతా అక్కడి నుంచి పారిపోవాలని చెప్తాడు. హోమాన్ని భగ్నం చేసి వెంటనే యువరాణి దగ్గరకు వెళ్లి ఆమెను నాగలోకానికి తీసుకెళ్లి పోవాలని ఫణేంద్ర చెప్తాడు. మరోవైపు నాగ దేవత మిగతా నాగులతో సమావేశం అవుతుంది. 

నాగదేవత: ఈరోజు కార్తీకపౌర్ణమి మన నాగలోకానికి ప్రత్యేకమైన రోజు. మనం ఆరాధించే చంద్రుడు మనకు ప్రత్యేకమైన శక్తులను ప్రసాదించే రోజు. ఈ రోజు మరో విశేషం కూడా జరగనుంది. మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువరాణి మన లోకానికి రానుంది. ఈ రాత్రికే పట్టాభిషేకం జరిపించి రాణి పీఠం మీద కూర్చొపెట్టాలి. అందుకే ఈ రోజు మనకు ఒక అద్భుతమైన రోజు కానుంది. ఏ ఆటంకం కలగకుండా.. యువరాణి రాకను ఏ శక్తి ఆపకుండా ఒక మహా పూజ జరిపిస్తాను. ఆ పూజ పూర్తి అయ్యేలోగా యువరాణి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు నాగలోకం అంతా పండగ చేసుకుంది. పూజ ప్రారంభిస్తాను. అంటూ నాగదేవత హోమం చేస్తుంది. 

పంచమి: మీరు ఇక్కడే ఉండండి మోక్షబాబు. నేను స్వామి గారు ఇచ్చిన విభూదిని గుడి చుట్టూ వేసి వస్తాను. 
మోక్ష: అలాగే పంచమి
పంచమి: విభూది చల్లిన తర్వాత మనసులో.. శివయ్య నన్ను ఎందుకు పుట్టించావో తెలీదు కానీ అర్ధాంతరంగా నాకు ముగింపు పలుకుతున్నావు. ఇంకొన్ని నిమిషాల్లో నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నా దేహాన్ని పంచభూతాలు తనలో కలిపేసుకుంటాయి. పరమాత్మా.. నా ఆత్మను మాత్రం మీలో ఐక్యం చేసుకోండి. మా అమ్మకు గుండె ధైర్యం ఇచ్చి నా భర్తను కాపాడుకునే బాధ్యత నీదే శివయ్య. ఇంకెప్పుడు ఈ పంచమి మీకు కనిపించదు. మోక్షా బాబు చీకటి పడనుంది నేను త్వరగా వెళ్లాలి
మోక్ష:  పంచమి.. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పు పంచమి. 
పంచమి: చాలా దూరం మోక్షాబాబు తిరిగి మిమల్ని చేరుకోలేని అంత దూరం
మోక్ష:  అంత దూరం వెళ్లడం ఎందుకు పంచమి. నిన్ను నువ్వు ఓ గదిలో బంధించుకుంటే సరిపోతుంది కదా
పంచమి: అలా ఊపిరి ఆడకే మోక్షబాబు ఈ దారి ఎంచుకున్నాను. నాకు వేరే ఏ మార్గం కనిపించకే చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది 
మోక్ష: నువ్వు ఒక్కదానివే అంత దూరం వెళ్లొద్దు పంచమి
పంచమి: అప్పుడే నేను మీ దగ్గరకు వచ్చి కాటేయలేను. నాకు ఇప్పుడు నా గురించి ఎలాంటి దిగులు భయం లేదు మోక్ష బాబు.. నా దిగులు అంతా మీ గురించే 
మోక్ష: ఈ రాత్రి గడిస్తే చాలు పంచమి. మళ్లీ నిన్ను వదలను నువ్వు శాశ్వతంగా ఈ భూమ్మీద ఉండిపోయేలా చేస్తాను
పంచమి: ఇప్పటికే మీ గుండెల్లో మీ భార్యగా శాశ్వతంగా ఉండిపోయాను మోక్షాబాబు. ఆ స్థానాన్ని ఇంకెవ్వరూ చెరిపేయలేరు. ఈ జన్మకి ఇది చాలు మీరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ విభూది గీత దాటి బయటకు రాకూడదు. 
మోక్ష: నువ్వే నా దగ్గరకు రాలేనప్పుడు నాకెందుకు పంచమి భయం. నాకు ఏం కాదు. నిన్ను నువ్వు కాపాడుకో పంచమి. నాకు నీ క్షేమం ముఖ్యం
పంచమి: నేను చాలా క్షేమంగా ఉండే చోటుకే వెళ్తున్నా మోక్షాబాబు. ఇక మీరు నా గురించి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. మీరు మిమల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎవరికి కోపం తాపం వచ్చినా జీవితం మీద విరక్తి కలిగినా అవి రెండు నిమిషాలే. నమ్మక నమ్మక మీరు దేవుడిని నమ్మారు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి
మోక్ష: ఇప్పుడు నేను దేవుడ్ని పూర్తిగా నమ్ముతున్నా పంచమి
పంచమి: అలా నమ్ముకుంటే ఆ స్వామి మిమల్ని కాపాడుతారు. దేనికి అధైర్య పడకండి. ఎవరు ఉన్నా లేకున్నా తోడుగా ఎవరు రాకున్నా జీవితం ముందుకు సాగిపోవాల్సిందే.  ఈ లోకంలో  ఎవరూ ఏదీ శాశ్వతం కాదు
మోక్ష: ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు పంచమి
పంచమి: మనసుకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్పేయాలి. తర్వాత చెప్పాలి అనుకున్నా చెప్పలేం
మోక్ష:  నీ ఆందోళన నాకు తెలుసు పంచమి. నాకు ఏం కాదు. నువ్వు భయపడిపోతున్నావ్
పంచమి: శాశ్వతంగా వదిలి వెళ్లిపోతున్నాను. ఇదే చివరి వీడ్కోలు. అందుకే నా ఆవేదన అంతా. నన్ను క్షమించండి మోక్షాబాబు
మోక్ష: ఏడవకు పంచమి తెల్లవారగానే అందరం హ్యాపీగా ఉంటాం. నాకోసం నువ్వు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నవు. ఇక నాకు ఏం కాదు
పంచమి: వెళ్తా మోక్షాబాబు మీరు ఈ గీత దాటి బయటకు రాకండి

ఇక పంచమి మోక్షకు జాగ్రత్తలు చెప్పి అడవికి వచ్చేస్తుంది. అయితే మోహిని పంచమికి తెలీకుండా తనని ఫాలో అవుతుంటుంది. ఇక మధ్యలో పంచమి మోహినికి కనపడదు. దీంతో మోహిని ఎక్కడికి వెళ్లినా పాముగా మారిన తర్వాత మోక్షను కాటేయడానికి గుడి దగ్గరకే వస్తుంది. దగ్గర్లోనే కాపు కాసి ఉండాలి అనుకుంటుంది. మోక్షకు కూడా తెలీకుండా పంచమి పామును గుట్టుగా తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది. మరోవైపు హోమం దగ్గర నాగకన్యలు, ఫణేంద్ర కాపు కాసి ఉంటారు. నాగ కన్యలు, ఫణేంద్ర పాములుగా మారి హోమం దగ్గరకు వెళ్లాలి అని ప్రయత్నిస్తారు. కానీ హోమం శక్తికి వెళ్లలేకపోతాయి. దీంతో వెనక్కి వెళ్లి పోతారు. మరోవైపు పంచమి మోక్షతో తన పెళ్లి గుర్తుచేసుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget