Lakshimi Raave Maa Intiki Serial Today February 19th: ప్రియంవద దొంగచాటుగా నర్సుకు డబ్బులు ఎందుకు ఇచ్చింది..? గుడికి వెళ్లిన మ్యాడీకి సూర్యనారాయ ఇచ్చిన షాక్ ఏంటి..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 19 th: ప్రియంవద దొంగచాటుగా నర్సుకు డబ్బులు ఎందుకు ఇచ్చింది..? గుడికి వెళ్లిన మ్యాడీకి సూర్యనారాయ ఇచ్చిన షాక్ ఏంటి..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: తన భర్తకు చెడుమాటలు చెబుతున్న ప్రియంవదకు గట్టి క్లాస్‌పీకి శ్రీలక్ష్మీ వెళ్లిపోతుంది. దీంతో ప్రియంవద చాలా కోపంగా ఉంటుంది. శివరాత్రికి తాతయ్య మీ ఇద్దరితో గుడిలో పూజ చేయిస్తానని అన్నాడు కదా అందుకే అది అలా రెచ్చిపోతుందని మ్యాడీతో అంటుంది. ఆ ఎర్రబస్సు వెంట పూజకు వెళ్లడం కన్నా చావడం నయమని నేను చస్తే గుడికి రానని మ్యాడీ అంటాడు. లేదు మ్యాడీ మనం కచ్చితంగా గుడికి వెళ్దామని...ఆ ఎర్రబస్సును అక్కడి నుంచి అటే ఇంటికి పంపించేలా నేను మంచి ప్లాన్ వేశానని ప్రియంవద చెబుతుంది. దీంతో మ్యాడీ సరేనని అంటాడు.
ప్రియంవద ఇంట్లో ఉండగా అప్పుడే ఆమెకు ఓ ఫోన్‌కాల్ వస్తుంది.అది చూసిన వెంటనే ఆమె చాలా కంగారుపడుతుంది. ఫోన్ ఎత్తి ఎందుకు ఫోన్ చేశావని అడగ్గా...నాకు అర్జెంట్‌గా 25వేలు కావాలని అవతల నుంచి ఫోన్ చేసిన వ్యక్తి చెబుతుంది. రేపు పంపిస్తానని చెప్పగా...అంత టైం లేదని నేను మీ ఇంటి పార్కింగ్ ప్లేస్‌లో ఉన్నానని వెంటనే వచ్చి ఇవ్వాలని చెప్పగా...సరే వస్తున్నానని ప్రియంవద అంటుంది. ఆమె డబ్బులు తీసుకుని హడావుడిగా వెళ్తుండగా....శ్రీలక్ష్మీ చూస్తుంది. ఈ రాత్రివేళ ఈమె ఎందుకు అంత కంగారుగా వెళ్లిపోతుందని ప్రియంవద వెనకే వెళ్తుంది. ప్రియంవద అక్కడ ఓ నర్సుకు డబ్బులిచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావొద్దని ఎందుకు వస్తున్నావని అంటుంది. పసిబిడ్డను మాయం చేసిన సంగతి అందరికీ చెబుతానన్నట్లు ఆ నర్సు బెదిరిస్తుంది.కడుపున పుట్టిన బిడ్డనే వద్దనుకున్నాదాన్ని...నా విషయం బయటకు వస్తే నువ్వు ప్రాణాలతో మిగలవన్న సంగతి తెలుసుకో అని హెచ్చరించి వెనక్కి తిరగ్గానే వెనక శ్రీలక్ష్మీ కనిపిస్తుంది. ఇది మొత్తం వినేసిందా అని ప్రియంవద భయపడుతుంది. ఎందుకు అమ్మగారు అంత కంగారుగా ఉన్నారు. వచ్చిన ఆవిడ ఎవరని శ్రీలక్ష్మీ అడుగుతుంది.ఎందుకు మీరు ఆమెకు డబ్బులిచ్చారని అడుగుతుంది. దీంతో శ్రీలక్ష్మీ ఏం వినలేదని ప్రియంవదకు అర్థమవుతుంది.నా విషయంలో నీ జోక్యం అనవసరమంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏదో జరుగుతోందని...అదేంటో కనిపెట్టాలని శ్రీలక్ష్మీ అనుకుంటుంది.
తెల్లారిన తర్వాత సూర్యనారాయణ కుటుంబంతో కలిసి శివాలయానికి వెళ్తాడు.అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత...కమిటీ వాళ్లు వచ్చి రాత్రికి జరిగే శివకల్యాణం నాటకంలో శివపార్వతులుగా ఎవరు నటిస్తారో మీరు చెబుతానన్నారు కదా అని అడగ్గా...శివుడిగా మా మనవుడు మధుసూదన్,పార్వతీగా అతని భార్య లక్ష్మీ నటిస్తారని చెప్పడంతో మ్యాడీ షాక్ తింటాడు. నావల్ల కాదని నాకు రాదని చెబుతాడు. వెంటనే శ్రీలక్ష్మీ కలుగజేసుకుని నువ్వు పెద్ద హీరో అవ్వాలని కలలు కంటున్నావు కదా...అవకాశం వచ్చింది నిరూపించుకోమని సలహా ఇస్తుంది. పెద్దయ్యకు కూడా నీ ప్రతిభ ఏంటో తెలుస్తుందని చెబుతుంది.మేమిద్దరం ఈ నాటకంలో పాల్గొంటామని చెబుతుంది. కమిటీ వాళ్ల ముందు పరువు కాపాడినందుకు సూర్యనారాయణ శ్రీలక్ష్మీకి థ్యాంక్స్ చెబుతాడు. కాలేజీలో సీటు వస్తే 108బిందెలతో నీళ్లు పోస్తానని మొక్కుకున్నానని...ఆ మొక్కు తీర్చుకుని వస్తానని శ్రీలక్ష్మీ వెళ్తుంది. ఆమె వెళ్లే దారిలో అరటి తొక్కలు, నూనె, గాజు పెంకులు వేసి గాయపరచాలని మ్యాడీ, ప్రియంవద ప్లాన్ వేస్తారు.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















