అన్వేషించండి

Krishna Mukunda Murari November 28th Episode : ముకుంద ప్రేమలో మురారి.. భవాని పెళ్లి ప్రపోజల్ .. కృష్ణ పరిస్థితేంటి!

Krishna Mukunda Murari Today Episode : గతంలో ముకుంద, మురారి ప్రేమలో ఉన్నారని భవాని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

krishna mukunda murari serial today Episode : రేవతి: ఇదివరకు మా ఇళ్లు బృందావనంలా ఉండేది. ఏ గొడవలు లేకుండా ఆహ్లదకరంగా ఉండేది.

ముకుంద: మా పెళ్లి అయ్యాక అలాగే ఉంటుంది. మీరే దిగులు పడకండి.

రేవతి: ఛీ.. నోర్ముయ్.. ఇంట్లో నువ్వు అడుగు పెట్టి నాశనం చేశావు. నరకాన్ని సృష్టించావు.

ముకుంద: అత్తయ్య స్వర్గం నరకాలు మనం ఏమైనా చూశామా చెప్పండి మన ఆలోచనలే వాటిని సృష్టిస్తాయి. ఎక్కువగా ఆలోచించి నరకాన్ని సృష్టించకండి. 

రేవతి: చాల్లే ఆపు. నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసింది నువ్వు అన్నీ నువ్వే చేశావు. కృష్ణ అమాయకురాలు అది ఏమీ చేయలేదు. ఈ నిజం ఇవాళ కాకపోతే రేపు అయినా బయట పడుతుంది. 

ముకుంద: (మనసులో.. ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతుంది) మంచిది పెద్దపల్లి ప్రభాకర్ మా చిన్నాన్న కదా అందుకే జైల్‌లో ఉన్నాడు. అన్నీ నేనే చేశాను. మురారి చనిపోయాడని బాడీని నేనే తెచ్చాను. ఇలా అన్నీ నేనే చేశాను. హాస్పిటల్‌లో మురారి ఉన్నాడని పాపం కృష్ణ మీకు చెప్పి అక్కడికి తీసుకెళ్లింది కదా.. అక్కడ మురారితో నేను ఉన్నాను కదా అవును అవును ఇలా అన్నీ నేనే చేశాను. ఇవన్నీ చేసింది కృష్ణ. వీటన్నింటికి సమాధానం చెప్పండి అప్పుడు కృష్ణ గురించి మాట్లాడండి వస్తాను. 

మురారి: (ఒంటరిగా మెట్ల దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు) ఎందుకు రెండు రోజులు. ఈ రెండు రోజుల్లో ఏం జరగనుంది. వేణి గారిని పంపించేస్తారా.. అందుకే రెండు రోజులు గడువు అడిగారా.. వేణి గారిని పంపించేస్తే నేను ఉండగలనా.. అసలు తట్టుకోగలనా.. అసలు బతకగలనా.. (ఇంతలో భవాని అక్కడికి వస్తుంది)రా పెద్దమ్మ నీ గురించే ఆలోచిస్తున్నాను.

భవాని: నా గురించి కాదు మురారి నేను రెండు రోజులు ఆగమన్న విషయం గురించి. ఇలా ఆలోచించి మనసు పాడుచేసుకుంటావనే అదేదో ఇప్పుడే చెప్పేయాలి అని వచ్చాను. ఏం ఆలోచిస్తున్నావ్ నాన్న. నీ గతం గురించి చెప్పొద్దు అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే చెప్పక తప్పదు. నువ్వు ప్రేమలో ఉన్నావు మురారి. (మనసులో.. భగవంతుడా నన్ను క్షమించు మురారికి పెళ్లి అయిన ఆ విషయం దాయక తప్పడం లేదు. వాడి జీవితం బాగుండాలి అంటే ఈ నిజం దాయక తప్పదు.)

మురారి: చెప్పండి పెద్దమ్మ నేను ఎవరి ప్రేమలో ఉన్నాను. ఎవర్ని ప్రేమించాను. 

భవాని: ముకుంద. అవును నాన్న. ముకుంద నువ్వు ప్రేమించుకున్నారు. అవును నాన్న నీ పెద్దమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. 

మురారి: నిజమా.. నమ్మలేకపోతున్నాను

భవాని: అదే కదా నా బాధ. నువ్వు నన్ను నమ్మడం మానేసి మనకి నమ్మకం ద్రోహం చేసిన వారిని బాగా నమ్ముతున్నావు. నీకో నిజం చెప్పనా. నువ్వు ఆ వేణి గారి మాయలో పడ్డావు. అది నీ తప్పు కాదమ్మా. నిన్ను వాళ్లు అలా మలచుకున్నారు. నువ్వు గతాన్ని మరచిపోయావు. నీ ఎదురుగా ఉంటూ సేవలు చేస్తూ.. దగ్గరగా ఉన్న ఆ వేణిని ఎవరైనా అలాగే చూస్తారు. కేవలం వర్తమానంలో జరిగినవి మాత్రమే నువ్వు చూస్తున్నావ్. మరి నిన్నే నమ్ముకొని నువ్వే సర్వస్వం అనుకొని నీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ముకుంద సంగతి ఏంటి. నా తర్వాత నువ్వే ఈ ఇంటిని నడిపించారు. ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి

మురారి: పెద్దమ్మ ఇంటి బాధ్యతలు తర్వాత అసలు మీరు చెప్పే ముకుంద ప్రేమ నా మనసు తీసుకోవడం లేదు. 

భవాని: మాకు తెలుసు నాన్న నీకు ఆ స్పేస్ కృష్ణ ఇవ్వడం లేదు కదా. ముకుంద గురించే కాదు మా గురించి కూడా నువ్వు ఆలోచించడం లేదు. తనివ్వట్లేదో నువ్వు తీసుకోవడం లేదో మాకు తెలీదు. కానీ ఇదంతా వాళ్లే చేశారు. అందుకే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఏం చేయను దానికి నువ్వు మమల్ని దారుణంగా శిక్షిస్తున్నావు. అయినా నీ మీదే ఆశలు పెట్టుకున్న ముకుందకు న్యాయం చేద్దాం. అర్థమైందని అనుకుంటా. అదే నాన్న పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. 

మురారి: పెద్దమ్మ అది.

భవాని: వద్దు నాన్న నువ్వు ఏం మాట్లాడకు నా మాట విను. నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఆ వేణిని కలవడం మానేయ్.  

మరోవైపు కృష్ణ తన పెళ్లి ఫొటో చూసుకుంటూ ఎప్పుడు మురారికి గతం గుర్తొస్తుందా అని బాధపడుతుంటుంది. ఇంతలో ముకుంద వచ్చి ఫొటో లాక్కుంటుంది. మురారి ఆ ఫొటో చూస్తే రిస్క్‌ అని దాన్ని కాల్చేయాలి అనుకుంటుంది. అగ్గిపెట్టి అడిగి కాల్చేస్తుండగా దాన్ని కృష్ణ లాక్కుంటుంది. ఈ ఫొటో ఏసీపీ సార్‌కి చూపించి ఎవరు కాల్చారు అంటే నీ పేరే చెప్తానంటుంది. దాంతో ముకుంద బయపడుతుంది. మరోవైపు మురారి తన గదిలో దేనికోసమో తెగ వెతుకుతుంటాడు. అక్కడ తన పెళ్లి ఫొటో ఉన్నా చూడడు.

మరోవైపు కృష్ణ దగ్గరకు మురారి తల్లి వస్తుంది ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఇక ముకుంద మురారితో తాను లండన్‌లో తీసుకున్న ఫొటోలు తనకి చూపించాలని మురారి కోసం వెతుకుతుంటుంది. కృష్ణ  ఇంట్లో మురారి ఉండడం చూసి అక్కడికి వెళ్తుంది. మురారి ముకుంద చేతిలో ఫొటోలు చూసి ఏంటని అడుగుతాడు. ఆ ఫొటోలలో ముకుందతో పాటు మురారి ఉంటాడు. అయితే మురారికి సర్జరీ చేయడం వల్ల అది తన పాత ముఖం అని తెలీక ఎవరు అని అడుగుతాడు. దానికి ముకుంద కృష్ణకు అడగమని చెప్తుంది. దీంతో కృష్ణ అది మీరే అని చెప్తుంది. మురారి షాక్ అయిపోతాడు. దీంతో మురారికి గతం గుర్తొస్తుంది. ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇరగవరం 20వ మైలురాయి.. వణికిపోయిన అంబిక! అఖండ దీపం పగలగొట్టేసిన మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇరగవరం 20వ మైలురాయి.. వణికిపోయిన అంబిక! అఖండ దీపం పగలగొట్టేసిన మహా!
Godavari Serial Today October 27th: 'గోదావరి' సీరియల్: జాను మీద నందు ఫైర్! తాంబూలం విసిరి కొట్టిన నందు! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: జాను మీద నందు ఫైర్! తాంబూలం విసిరి కొట్టిన నందు! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 27th: నిండు మనసులు: ప్రేరణలో మార్పునకు సిద్ధూ షాక్! కలిసి పని చేస్తానంటూ ట్విస్ట్!
నిండు మనసులు: ప్రేరణలో మార్పునకు సిద్ధూ షాక్! కలిసి పని చేస్తానంటూ ట్విస్ట్!
Nindu Noorella Saavasam Serial Today October 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి నిజం చెప్పిన అంజు - అంజును హగ్‌ చేసుకున్న వైజయంతి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి నిజం చెప్పిన అంజు - అంజును హగ్‌ చేసుకున్న వైజయంతి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Embed widget