Krishna Mukunda Murari Serial Today March 8th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: పాలగ్లాస్‌తో గదిలోకి వెళ్లిన ముకుంద ఆదర్శ్‌కి నిజం చెప్పేస్తుందా.. టెన్షన్‌లో కృష్ణ, మురారి!
Krishna Mukunda Murari Serial Today Episode ముకుంద శోభనం గదిలోకి వెళ్లడంతో అక్కడ ఆదర్శ్‌కి ఏం చెప్తుందా అని మురారి, కృష్ణలు టెన్షన్ పడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Krishna Mukunda Murari Serial Today March 8th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: పాలగ్లాస్‌తో గదిలోకి వెళ్లిన ముకుంద ఆదర్శ్‌కి నిజం చెప్పేస్తుందా.. టెన్షన్‌లో కృష్ణ, మురారి! krishna mukunda murari serial today march 8th episode written update in telugu Krishna Mukunda Murari Serial Today March 8th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: పాలగ్లాస్‌తో గదిలోకి వెళ్లిన ముకుంద ఆదర్శ్‌కి నిజం చెప్పేస్తుందా.. టెన్షన్‌లో కృష్ణ, మురారి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/a6fe6fdebdecc6126836217420a5b0151709860260113882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari Today Episode: ముకుందని రేవతి రెడీ చేస్తుంది. నువ్వు మారావు అని చెప్పినా ఏదో ఒక మూల భయం ఉండేది అని ఇప్పుడు పూర్తిగా మారావు అని నమ్మకం వచ్చింది అని రేవతి అంటుంది.
ముకుంద: మనసులో.. క్షమించండి అత్తయ్య నేను ఆదర్శ్‌ని ఎప్పటికీ క్షమించలేను. మీ సంతోషం కాసేపట్లో ఆవిరి కాబోతుంది.
రేవతి: భవాని అక్కయ్య ఇక్కడే ఉండి ఉంటే నిన్ను ఇలా చూసి ఎంత సంతోషించేదో తెలుసా.. ఎప్పుడు నువ్వు మనవడిని ఇస్తావో మనవరాలిని ఇస్తావో అని ఎంత ఎదురు చూసేదో తెలుసా.. ఎప్పుడెప్పుడు ఆడిస్తామా అని ఎదురు చూస్తున్నాం.
ముకుంద: మనసులో.. ఎప్పటికైనా నేను నా కడుపులో మోసేది మురారి బిడ్డనే నీ మనవడినే.. ఇది మాత్రం జరిగి తీరుతుంది.
మురారి: అద్దంలో చూసుకుంటూ.. అచ్చం శోభనం పెళ్లి కొడుకులా అదిరిపోయావ్ కానీ శోభనం మాత్రం నీ ముఖంలో రాసిపెట్టలేదు. ఏంట్రా నీ బతుకు ఇలా అయిపోయింది. ముకుంద అనే బాంబ్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలీదు. అసలు నీ ముఖానికి పెళ్లి అయిన ఒక్క రోజైనా ప్రశాంతంగా ఉన్నావా..
ఇంతలో మధు వస్తాడు. పెద్దమ్మ నిన్ను రెడీ చేయమని పెద్దమ్మ పంపింది. కానీ నువ్వెప్పుడో రెడీ అయిపోయావని సెటైర్లు వేస్తాడు. ఇక మధు శోభనం రోజు నేను ఆల్‌ది బెస్ట్ చెప్తే సక్సెస్ అవుతుంది అని అంటాడు. దీంతో మురారి నిజమా అని అడిగి చాలా సార్లు ఆల్ ది బెస్ట్ చెప్పించుకుంటాడు. మరోవైపు ఆదర్శ్ ముకుంద ఫొటో చూస్తూ హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో మధు అక్కడికి వస్తాడు.
మధు: నిన్ను, మురారిని చూస్తుంటే ముచ్చటేస్తుంది బ్రో. మీ ఇద్దరికీ భార్యలు అంటే చాలా ఇష్టం. భార్యలన్ని ఇంతలా ప్రేమించే భర్తలు దొరికినందుకు నిజంగా మీ భార్యలు అదృష్టవంతులు.
ఆదర్శ్: ఏ అలాంటి భార్యలు దొరికినందుకు మేం అదృష్టవంతులం కాదా.. మాట్లాడవేం మధు ముకుంద నాకు భార్యగా దొరికినందుకు నేను అదృష్టవంతున్ని కాదా.
మధు: ఎందుకు కాదు బ్రో నువ్వు ఇంకా అదృష్టవంతుడివి.
కృష్ణ: ముకుంద గురించి కృష్ణ ఆలోచిస్తూ.. ఇప్పుడేం చేసినా ఈ శోభనం ఆగేలా లేదు. అలా అని జరిగేలా కూడా లేదు. నా భర్తను నాకు కాకుండా చేసి తను సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను అని అప్పుడు అంటుంటే ఆవేశంతో కబుర్లు చెప్తుంది అనుకున్నాను. కానీ నిజంగానే ఎంతకైనా తెగిస్తుంది. అని ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో. ఆ పరిణామాలు నా జీవితం మీద ఈ కుటుంబం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో. పెద్దత్తయ్య బాధ్యత అప్పగించింది అని ఈ శోభనాలు ఏర్పాటు చేసి తప్పు చేశానా.. అసలు ఇవి ఏమీ లేకపోయి ఉంటే ముకుంద మామూలుగా ఉండేదేమో.. పరిస్థితి శృతిమించేది కాదేమో. పాపం అక్కడ ఏసీపీ సార్ ఎంత టెన్షన్ పడుతున్నారో.
శకుంతల: ఓయ్ కోడలు పిల్లా ఏం ఆలోచిస్తున్నావ్ ఊహల్లో విహరిస్తున్నావా..
కృష్ణ: అంత లేదు అత్తయ్య. అత్తయ్య ముకుంద ఎక్కడ రెడీ అయిపోయిందా.. శోభనం గదిలోకి వెళ్తాను అంటుందా లేక ఇబ్బంది పడుతుందా..
రేవతి: ఇబ్బంది లేదు మొహమాటం లేదు కాకపోతే నీలా తొందర పడటం లేదు.
కృష్ణ: మనసులో.. అంటే శోభనం గదిలోకి వెళ్లి ఆదర్శ్‌కి నిజం చెప్పాలి అనుకుంటుంది అన్నమాట . అందుకే అంత ప్రశాంతంగా ఉంది. తర్వాత కృష్ణ తమ గదిలోకి పాల గ్లాస్‌తో వెళ్తుంది. ఓయ్ ఏంటి అలా ఉండిపోయారు. ముకుంద గురించి ఏం ఆలోచించారు. నాకు అయితే ఏం అవుతుందా అని ఒకటే టెన్షన్‌గా ఉంది. ముకుంద నాలాగే పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్లుంది. అక్కడ ఏం జరుగుతుంది అని కొంచెం కూడా టెన్షన్ లేదా మీకు.
మురారి: ఎందుకు లేదు ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి చూడు. కానీ ఏం చేస్తాం ఇప్పుడు ఇక మన చేతుల్లో ఏం లేదు. ముకుంద ఏం చేసినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం తప్ప మనం ఇంకేం చేయలేం.
మరోవైపు ముకుంద ఆదర్శ్ దగ్గరకు పాల గ్లాస్‌తో వెళ్తుంది. ముకుంద రాక కోస ఆదర్శ్ ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుంటాడు. ముకుందతో ఆదర్శ్ ఈ అద్భుత క్షణాల కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూశానో తెలుసా అని అంటాడు. తర్వాత ముకుంద చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకోవడానికి ప్రయత్నస్తే ముకుంద ఆ పాల గ్లాస్‌ను టేబుల్ మీద పెట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: మహేష్: ఎంతపని చేశావ్ మహేష్! - ఆ రూల్ బ్రేక్ చేసి రాజమౌళికి షాకిచ్చిన సూపర్ స్టార్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)