అన్వేషించండి

Krishna mukunda Murari November 7th: కృష్ణను ఇంట్లోకి తీసుకొచ్చిన మురారి – ముకుందకు వార్నింగ్ ఇచ్చిన రేవతి

కృష్ణను ఇంట్లోకి తీసుకొచ్చి తనే స్వయంగా కాఫీ చేసి ఇస్తాడు మురారి. దీంతో ముకుంద షాక్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రస్టింగ్ మలుపులతో ఇవాళ ఎపిసోడ్ సాగింది.

మురారి ఆవేశంగా భవాని దగ్గరకు వచ్చి వేణిని ఎందుకు దూరం పెడుతున్నారని అడుగుతాడు. షాక్‌ తిన్న భవాని నిజం చెప్తానని అయితే నిజం తెల్సిన తర్వాత మళ్లీ నువ్వు వేణి దగ్గరకు వెళ్లి అడగకూడదని చెప్తుంది. మురారి సరే అంటాడు.

భవాని: ఆ అమ్మాయిని డాక్టర్‌ చదివించింది మనమే.. ఏ దిక్కు లేదని చేరదీసి ఒక దారి చూపిస్తే.. వాళ్లింట్లో వాళ్లు మన ఫ్యామిలీ పట్ల చాలా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించారు. మనల్ని బాధపెట్టారు. ఒకరకంగా నువ్విలా కావడానికి కూడా కారణం వాళ్లే. ఇంతకంటే ఎక్కువ అడగొద్దు నాన్నా. అందుకే ఆ అమ్మాయితో నువ్వు ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నా మాట కాదనవు కదా?

మురారి: లేదు పెద్దమ్మ కాదనను.

అనగానే భవాని సంతోషంగా లోపలికి వెళ్తుంది. మురారి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు.

కృష్ణ నిద్రలేచి బయటికి రాగానే బయట వరండాలో మురారి కూర్చుని ఉంటాడు. మురారిని చూసిన కృష్ణ షాక్‌ అవుతుంది. వెంటనే తేరుకుని మురారిని టీ తాగుతారా అంటూ లోపలికి పిలుస్తుంది. గ్యాస్‌ అయిపోవడంతో మురారి ఇక్కడ టీ తాగలేం కానీ మా ఇంటికి రండి నేను టీ పెడతాను తాగుదాం అంటూ చేయి పట్టుకుని కృష్ణను తీసుకుని వారి ఇంట్లోకి మురారి వెళ్లబోతుంటే

కృష్ణ: ఆగండి కొంచెం ప్రెష్ అప్‌ అయి వస్తాను

అంటూ లోపలికి వెళ్తుంది.  ఇంట్లో ముకుంద కంగారుగా మురారిని వెతుకుతూ రేవతిని ఢీ కొంటుంది.

ముకుంద: సారీ అత్తయ్య చూసుకోలేదు. మురారి కనిపించకపోయే సరికి  

రేవతి: మురారి ఏమైనా పసిపిల్లవాడా? పిచ్చోడా? నువ్వే వాణ్ని నీ పిచ్చి చేష్టలతో పిచ్చి వాన్ని చేస్తున్నావు.

ముకుంద: అత్తయ్య వెళ్తూ వెళ్తూ మురారి బాధ్యత నాకు అప్పగించింది కదా అత్తయ్య.

మధు: బాధ్యత తీసుకోవడం అంటే సంకనెక్కించుకోవడం కాదు. నువ్వు చాలా ఓవర్‌ చేస్తున్నావ్‌.

ముకుంద: ఎక్కువ మాట్లాడితే నా రియాక్షన్‌ మామూలుగా ఉండదు మధు.

మధు: నా రియాక్షన్‌ సంగతి అటుంచు. ఒక్కసారి అటు చూడు నీ రియాక్షన్‌ మామూలుగా ఉండదు.

అని మురారి, కృష్ణని వెంటబెట్టుకుని ఇంటికి రావడం చూసి మధు చెప్తాడు. వాళ్లిద్దరూ రావడం చూసిన ముకుంద షాక్‌ అవుతుంది. రేవతి, మధు హ్యాపీగా ఫీలవుతారు. కృష్ణ లోపలికి వస్తూ గుమ్మం దగ్గర నిలబడి భవానికి తెలిస్తే ఏమవుతుందోనని ఆలోచిస్తుంటే.. మురారి, కృష్ణను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. రేవతి కాఫీ తెస్తానని చెప్పగా లేదమ్మా కృష్ణకు నా చేతి కాఫీ రుచి చూపిస్తానని కిచెన్‌లోకి వెళ్లి కాఫీ చేసుకుని తీసుకోస్తాడు మురారి.

కృష్ణ: సార్‌ మీరు చేసిన కాఫీ అద్బుతంగా ఉంది.

మురారి: థాంక్యూ.. ఇల్లు చూపిస్తాను రా..

ముకుంద: నేను వస్తాను.

అనడంతో మధు అడ్డుపడి ముకుంద పెద్దమ్మ నీకో ఇంపార్టెంట్ పని అప్పజెప్పిందని చెప్తాడు. మురారి, కృష్ణ పైకి వెళ్లగానే.. ఏం పని చెప్పిందని ముకుంద మధును అడుగుతుంది. రాజమౌళికి ఫోన్‌ చేసి బాహుబలి త్రీ ఎప్పుడో కనుక్కోమంది అంటాడు. ముకుంద కోపంగా మధును చూస్తుంది. మధు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మురారి బెడ్‌రూంలోకి కృష్ణను తీసుకెళ్లి అక్కడ ముకుంద ఫోటో చూసి మర్చిపోయి మిమ్మల్ని ముకుంద రూంకి తీసుకొచ్చాను. ప్రతిరోజు ఎందుకో నేను నా రూంకే వెళ్లేవాణ్ని కాని ఇవాళ మీతో మాట్లాడుతూ ముకుంద రూంకి తీసుకొచ్చాను అంటాడు మురారి.

కృష్ణ: మీకు ఈ రూం నచ్చితే ఇక్కడే ఉండండి. ఇది మీ ఇల్లే కదా!

అనగానే మురారికి ఏవోవో గుర్తుకు వస్తుంటాయి.

మురారి: నాకు ఈ రూంకి ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఏవేవో గుర్తొస్తున్నాయి.

రూంలోకి ముకుంద వస్తుంది.

ముకుంద: అదేంటి మీరిద్దరు ఇక్కడున్నారు.

మురారి: నా రూం అనుకుని నీ రూంకి వచ్చాము. ముకుంద ఇఫ్‌ డోంట్‌ మైండ్‌ ఇకనుంచి నేను ఈ రూంలో ఉండొచ్చా? రూం మార్చుకుందాం

ముకుంద: అవన్నీ  తర్వాత మురారి ముందు మనం షాపింగ్‌కు వెళ్లాలి. మళ్లీ పెద్దత్తయ్య వచ్చారంటే హడావిడి అయిపోతుంది. నువ్వే అన్నావ్‌ కదా వెళ్దామని..

మురారి: అవును కదా.. కృష్ణ నువ్వు కూడా మాతో రావొచ్చు కదా..

అనగానే ముకుంద వద్దంటుంది. ముకుందను మురారి ప్రతిదానికి ఎందుకు అడ్డుపడతావు అంటూ తిడతాడు. రేవతి, మధు కూడా అక్కడికి వచ్చి కృష్ణను షాపింగ్‌కు వెళ్లమని చెప్తారు. కృష్ణ అయిదు నిమిషాల్లో వస్తానని అక్కడి నుంచి వెళ్తుంది. ఔట్‌హౌస్‌లోకి వెళ్లిన కృష్ణ దేవుడికి మొక్కుతూ ఉంటే రేవతి అక్కడకు వస్తుంది. ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అక్కడకు ముకుంద వచ్చి మురారి ఎప్పటకీ నీకు దగ్గర కాడని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
Illu Illalu Pillalu Serial Today August 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కల్యాణ్‌ పేరు ధీరజ్‌నే రాశాడని గోల చేసిన ప్రేమ! గుడ్‌ బై చెప్పేసిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కల్యాణ్‌ పేరు ధీరజ్‌నే రాశాడని గోల చేసిన ప్రేమ! గుడ్‌ బై చెప్పేసిన ధీరజ్!
Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget