అన్వేషించండి

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: ఎలాగైనా నిరుపమ్‌, జ్వాలను ఒక్కటి చేయాలని తన ప్రేమను త్యాగం చేసి తిరుగుతున్న హిమకు నాన్నమ్మ షాక్ ఇస్తుంది.

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: హిమను బయటకు తీసుకొచ్చిన ప్రేమ్‌ అసలు విషయం తెలుసుకునే పనిలో ఉంటాడు. హిమను డైరెక్ట్‌గానే నిశ్చితార్థం ఎందుకు వద్దన్నావని అడుగుతాడు. దాని గురించి ఏమీ అడగొద్దని చెప్పేస్తుంది హిమ. అసలు నీ మనసులో ఏముంది ఎందుకు వద్దన్నావని ప్రశ్నిస్తాడు ప్రేమ్‌. ఇకపై ఈ విషయంపై నన్నేమీ అడగొద్దని దండం పెట్టి చెప్పేస్తుంది హిమ. అయినా లాగుతూనే ఉంటాడు ప్రేమ్. ఎవరు అడిగినా తన సమాధానం ఇదే అని చెప్పి వెళ్లిపోతుంది. ఇలా వెళ్లిపోతే హిమ మనసులో ఏముందో ఎలా తెలుస్తుందని అనుకుంటాడు ప్రేమ్. 

శోభ తన పని మనిషి శాంతాభాయ్‌ని పిలిచి డబ్బులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి.. వేరే ఇంటికి మారిపోమంటుంది. జ్వాల ఉన్న ఏరియాలోనే రూమ్‌ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండమంటుంది. ఏం చేయాలో తాను చెబుతానని శాంతాభాయ్‌ని పంపించేస్తుంది. జ్వాల, నిరుపమ్‌ మధ్య అడ్డుగోడ కట్టేందుకు ప్లాన్‌ చేస్తుంది శోభ.

ఇక్కడ రెస్టారెంట్‌కు వచ్చిన జ్వాల, నిరుపమ్‌ హిమ కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్లిద్దర్ని చూసి చాలా ఆనంద పడుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇద్దర్ని ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుంది. జ్వాలతో క్లోజ్‌గా ఉంటే హిమలో అసూయ మొదలవుతుందని నిరుపమ్‌ అనుకుంటాడు. 

మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావని అడుగుతుంది హిమ. అసూయ ప్రారంభమైందని అనుకుంటాడు నిరుపమ్. మరింత క్లోజ్‌గా ఉంటాడు. ఇంతలో ఐస్‌క్రీమ్‌ నిరుపమ్ ఆర్డర్‌ ఇస్తాడు. ఏం కావాలో చెప్పమని హిమను అడుగుతాడు. ఐస్‌క్రీం చల్లగా ఉంటుంది... వెజ్‌సూప్ చెబుతుంది. ఇది విన్న  నిరుపమ్‌... హిమలో అసూయ పీక్స్‌కు వెళ్లిందనుకుంటాడు. 

హిమ ఎందుకు నిశ్చితార్థం ఎందుకు వద్దనుకుందో ఆలోచిస్తుంటాడు ప్రేమ్. ఈ విషయం తెలిస్తే కానీ... తన మనసులో మాట చెప్పలేననుకుంటాడు. తనే జీవితం అనకుంటాడు. తనే సర్వశ్వం అని చెప్పేస్తాడు. 


ఇక్కడ రెస్టారెంట్‌లో జ్వాలను పొగిడేస్తుంటాడు నిరుపమ్‌. అతని ప్లాన్‌ ఏంటో గ్రహించిన హిమ.. దానికి రివర్స్‌లో రియాక్ట్ అవుతుంది. మనసులో ఏది ఉన్నా బయటకు చెప్పగలిగే గుణం జ్వాలకు ఉంటే... ఏదీ చెప్పుకోలేని వాళ్లు కూడా ఉంటారని హిమను టార్గెట్‌ చేసుకొని సెటైర్లు వేస్తుంటాడు. పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు నిరుపమ్. 

నిరుపమ్‌పై ఉన్న ప్రేమ గురించి హిమ, జ్వాల మాట్లాడుకుంటారు. ప్రేమ సంగతి జ్వాల చెప్తేస్తానంటే హిమ ఆగమంటుంది. ఇంతలో బిల్‌ కట్టడానికి తిరిగి వస్తాడు నిరుపమ్. వాళ్లిద్దరు మాటలు విన్నాడేమో అనుకొని హిమ, జ్వాల కంగారు పడతారు. కానీ అతను అవేమీ వినలేదని తెలుసుకొని టెన్షన్ తగ్గుతుంది. బిల్‌ పే చేసి నిరుపమ్ వెళ్లిపోతాడు. మళ్లీ నిరుపమ్‌పై ఉన్న ప్రేమ గురించి జ్వాల మాట్లాడుతుంది. ఇలా మనసులో దాచుకొని ఉంచడం తన వల్ల కాదని.. ఇప్పుడే చెప్పేస్తానంటూ వెళ్లిపోతున్న నిరుపమ్‌ను పిలుస్తుంది. హిమ మాత్రం వద్దని వారిస్తుంది. ప్రేమ గురించి చెప్పే రోజు గొప్ప రోజై ఉండాలని ఏదో చెప్పి జ్వాలను ఒప్పిస్తుంది. 

ఇంట్లో సౌందర్య, ఆనంద్‌రావు ఫ్యామిలీ సంగతులు మాట్లాడుకుంటారు. హిమ కారణంగా ఆనందాలు దూరమయ్యాయని బాధపడుతుంటారు. అక్కడ నిరుపమ్‌ ఓదార్చలేకపోతున్నామని.. హిమ నుంచి అసలు విషయం తెలుసుకోలేమని అంటుంది. ఇంతలో హిమ వస్తుంది. పెళ్లి సంగతి ప్రస్తావిస్తుంది సౌందర్య. సౌర్య వస్తేనే పెళ్లి చేసుకుంటాను అనే అవకాశం ఇక లేదని హిమకు సౌందర్య చెప్పేస్తుంది. ఇప్పుటికే చాలా అబాసుపాలయ్యామని.. ఇకపై పెళ్లి చేసుకొని అందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నట్టు చెబుతుంది. 

రేపటి భాగం

భోజనం తీసుకొచ్చిన జ్వాలపై గట్టి గట్టిగా అరుస్తాడు ప్రేమ్. భోజనం తెచ్చానా... డబ్బులు తీసుకున్నానా అన్నట్టు ఉండాలి కానీ ఎక్‌ట్రాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాక... సత్యం, నిరుపమ్ ఆశ్చర్యపోతారు.  జ్వాల ఏడుస్తూ ఉండిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget