అన్వేషించండి

Karthika Deepam June 8th (ఈ రోజు) ఎపిసోడ్: అమెరికా వెళ్లిపోవడానికి నిరుపమ్ రెడీ- క్యాన్సర్ అంటూ షాక్‌ ఇచ్చిన హిమ

తనకు క్యాన్సర్‌ అంటూ నిరుపమ్‌కు రిపోర్ట్స్‌ చూపిస్తుంది హిమ. అది చూసి షాక్ అవుతాడు నిరుపమ్.

అందరం కలిసిపోయామని కలరింగ్ ఇస్తూ నిరుపమ్‌తో జ్వాల, హిమ ఫ్రెండ్‌ షిప్‌ కట్‌ చేయాలని ప్లాన్ చేస్తారు శోభ, స్వప్న. టిఫిన్లు మోయడాలు... మాటలు మోయడాలు మానేసి నీకు రావాల్సిన డబ్బులు తీసుకొని జ్వాలను వెళ్లిపోమంటుంది స్వప్న. సత్యం కూడా అదే చెబుతాడు. అంతా కలిసిపోయామని.. లంచ్‌ బాక్స్‌లు తేవడం ఆపేయమంటాడు. ఆ మాటకు జ్వాల షాక్ తింటుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నిరుపమ్ కోసం చూస్తూ వెళ్లిపోతుంది జ్వాల. 

జ్వాల వెళ్లిపోతుండగా... హిమ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని జ్వాలను అడుగుతుంది. ఆఖరిసారి  సత్యం సార్ వాళ్లకు లంచ్‌ బాక్స్‌ తెచ్చానంటుంది. ఆఖరి సారి ఏంటని హిమ ప్రశ్నిస్తుంది. అక్కడ జరిగింది వివరిస్తుంది జ్వాల. 

జ్వాల, హిమ మాట్లాడుకుంటుండగానే శోభ వచ్చి ఇదంతా నా గొప్పతనమే అంటూ కాలర్ ఎగరేస్తుంది. చాలా మంచి పని చేశావని హిమ అంటుంది. ముందు ముందు చాలా చేస్తానంటుంది. ముందు వాళ్ల కుటుంబాన్ని కలిపాను.. ఆ కుటుంబానికే కోడలిగా వెళ్తానంటుంది శోభ. ఏంటీ మాట్లాడటం లేదు... చెంప దెబ్బ కొడితే... దానికి ప్రతీకారం చెంప దెబ్బ కొట్టడంకాదు.. ఇలా దెబ్బ కొట్టడం ఈ శోభాదేవి స్టైల్ అంటుంది. ఒకవైపు లంచ్‌ బాక్స్‌లు కట్‌.. మరోవైపు నీ కనెక్షన్‌ కూడా కట్‌ అవుతుంది. 
ఏంటీ ఈ శోభ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. డాక్టర్‌ సాబ్‌కి ఐలవ్‌యూ చెబుతానంటే ఈ తింగరి ఆపేసి తప్పు చేసింది అని మనసులో అనుకుంటుంది. 
హలో ఆటోవాలా... ఏమైంది మాటల్లేవ్.. మాటలు రావా... మీ ఇద్దరి మధ్య మంచి సహకారమే ఉందే అని అంటుంది శోభ. 
ఇంతలో అక్కడకు వచ్చిన స్వప్న... శోభాదేవి నా మనసుకు నచ్చింది... మా కుటుంబాన్ని ఒక్కటి చేసింది...రేపు మా కుటుంబంలోకి రాబోతోంది... మీ నాన్నమ్మకు చెప్పు.. స్వప్న మాట నిలబెట్టుకుంటుందీ అని... ఇప్పుడు చెప్పండి అమ్మాయిలూ... వాట్‌ టు డూ వాట్‌ నాట్‌ టు డూ. అన్నీ మర్చిపోయీ... నీవు హాస్పిటల్ చూసుకో... నీవు ఆటో నడుపుకో... అన్నట్టు మర్చిపోయాను.. నీ లంచ్‌ బాక్స్‌లు తీసుకెళ్లు... ఇల్లు షిఫ్టు చేసినప్పుడు అవసరమైతే నీ ఆటోనే పిలుస్తాను. అద్దెకు వద్దువుగానీ అని వెటకారంగా మాట్లాడుతుంది స్వప్న. 

హాస్పిటల్‌కు వచ్చిన జ్వాల, హిమ అక్కడ జరిగిన సంఘటనల గురించే ఆలోచిస్తుంటారు. ఆ శోభ ఏదో అందని ఆ మాటల గురించి ఎందుకంతలా ఆలోచించడం ఏంటని హిమతో జ్వాల అంటుంది. 

సౌర్య నీకు అసలు విషయం తెలియదు.. బావ మనసులో నువ్వు లేవు నేను ఉన్నాని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని మనసులో భయపడుతుంది. 

శోభ ఏదో నాలుగు మాటలు చెబితే భయపడిపోతామా అని అంటుంది జ్వాల. నిరుపమ్ తనకు ఐలవ్‌యూ చెప్పాడని... మిగత వాళ్లు ఏమునుకుంటే ఏంటని అంటుంది. ఏమీ కాదని అంటుంది. 

అయ్యో సౌర్య ఆ శోభ తెలివిగా ప్లాన్ చేస్తుంది. ఇన్నాళ్లు కలవని స్వప్న, సత్యంను కలిపింది. ఆ శోభ స్పీడ్ చూస్తుంటే నాకు భయమేస్తుంది అని అంటుంది హిమ. 

ఏంటీ తింగరీ నువ్వు... మారిపోయినట్టు, భయంలేనట్టు అప్పట్లో ఉన్నావు ఇప్పుడెందుకు ఇలా ఉన్నావ్ అని ప్రశ్నిస్తుంది జ్వాల. నాకు డాక్టర్ సాబ్ ఎంత ఇష్టమో... నేనంటే కూడా డాక్టర్ సాబ్‌కు అంత కంటే ఎక్కువ ఇష్టం అని చెబుతుంది. నన్ను ఎలా పొగుడుతారో తెలుసా... నా ఫ్యామిలీ కోసమే పుట్టావు అన్నారోసారి. 

సౌర్యా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిరుపమ్ ఏదో అర్థంలో అంటే నువ్వు ఇంకేదో అర్థం చేసుకున్నావని అభిప్రాయపడుతుంది. 

నీకో విషయం చెబుతాను.. ఫీల్ అవుతావో.. షాక్‌ అవుతావో తెలియదు కానీ... ఇప్పటికిప్పుడు నీవు వెళ్లి డాక్టర్ సాబ్‌కు ఐలవ్‌యూ చెప్పినా డాక్టర్ సాబ్ నో అంటారు తెలుసా అని అమాయకంగా అడుగుతుంది జ్వాల. ఆమె ఆమాయకత్వాన్ని చూసి.. ఏడుస్తుంది హిమ. సారీ తింగరి... డాక్టర్ సాబ్‌ మనసులో నేనేంటో చెప్పడానికే ఇలా చెప్పానంటు వివరణ ఇస్తుంది జ్వాల. 

ఇంతలో జ్వాల ఫోన్ మోగుతుంది. ఇలా మాట్లాడుకున్నామో లేదో... డాక్టర్ సాబ్ ఫోన్ చేశారని అంటుంది జ్వాల. ఫోన్ లిఫ్ట్ చేసి మీరు రమ్మంటే ఆశ్రమానికేంటీ.. అంతరిక్షానికైనా వస్తానంటూ చెబుతుంది. 
వెళ్తున్న జ్వాలను అడ్డుకుంటుంది హిమ. ఏదో మాట్లాడుదామన్నారని... ఇంకేముంటుంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్తారేమో లే అంటుంది. 
ఆ మాట విన్న హిమ నేను కూడా వస్తానంటుంది. కంగారు పడి ఐలవ్‌యూ చెప్పేస్తుందేమో అని భయపడుతుంది. అలా చేస్తే  అసలు విషయం తెలిసిపోతుందని అనుకుంటుంది. మొత్తానికి జ్వాలను ఒప్పించి ఆమెతో వెళ్లడానికి ఓకే అంటుంది. 

కారులో వస్తున్న స్వప్న, శోభ.. నిరుపమ్ గురించి మాట్లాడుకుంటారు. నిరుపమ్ గురించి తలచుకుంటే భయమేస్తుందని అంటుంది స్వప్న. ఇప్పుడు కాకపోయినా ముందు ముందు నిరుపమ్ నీ మాటే వింటాడని అంటుంది శోభ. ఏంటో శోభ నాకైతే నమ్మకం లేదంటుంది. మొదటి నుంచి నువ్వు ఏం చెబితే అది చేస్తానంటూ అనే వాడు. ఈ పెళ్లి విషయంలో మాత్రం పట్టుదల పెంచుకున్నాడు. అలా మాట్లాడుకుంటూ.. అక్కడే ఉన్న జ్వాల, హిమను చూస్తారు. వాళ్ల కోసం మన టైం వేస్ట్‌  చేయడం ఎందుకని అంటుంది స్వప్న. అసలు ఈమె డాక్టర్, ఆమె ఆటోది వీళ్లకు స్నేహమేంటని అనుమాన పడుతుంది శోభ. వాళ్ల స్నేహం ఏమోగానీ.... నిరుపమ్ విషయంలో ఇది ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదంటుంది. వీళ్లిద్దరు ఫ్రెండ్స్‌లా కాకుండా అక్కాచెల్లెళ్లా ఎలా ఉండగలుగుతున్నారో... ఇంత ప్రేమ ఏంటని... ఇదేదో తెలుసుకోవాలనుకుంటుంది శోభ. 

ఆశ్రమంలో నిరుపమ్‌ వెయిట్ చేస్తుంటాడు. ఇవాళ తేల్చేస్తాను. హిమ ఎందుకు కాదన్నదో అడగమని జ్వాలకు చెప్తాను. జ్వాల అయితే మొహమ్మీదే అడిగేస్తుందని అనుకుంటాడు నిరుపమ్. ఇంతలో జ్వాల, హిమ రావడం చూసి... తను ఎందుకు వస్తుందని అనుకుంటాడు నిరుపమ్. ఆయన ఫీలింగ్ చూసి తింగరీ నువ్వు వచ్చేసరికి డాక్టర్ సాబ్ ఫీల్ అవుతున్నారని అంటుంది జ్వాల. 
నాకో డౌట్ తింగరి... అసలు మమ్మల్ని కలపాలని వచ్చావా... విడగొట్టే ఆలోచన ఏమైనా ఉందా అని హిమను జ్వాల అడుగుతుంది. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఎందుకని ప్రశ్నిస్తుంది. ప్రేమికులు అన్నాక... ఏదేదో ఉంటాయని అంటుంది. నువ్వు ఎవర్నైనా ప్రేమించావా... ప్రేమించి ఉండవులే... ప్రేమించి ఉంటే మా మధ్యకు ఎందుకు వస్తావు అంటుంది జ్వాల. నువ్వు బాగా చదువుకున్నావ్‌... తెలివిదానివి... నీ మొహంపైనే వద్దంటున్నా... మా ఇద్దరి మధ్య ఎందుకు వస్తున్నావ్‌... ఇప్పుడు చూడు డాక్టర్ సాబ్ ఎంత ఫీల్ అవుతున్నారో చూడు. 

సౌర్య నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలియదు.. బావకు నీపై ప్రేమ లేదని ఎక్కడ తెలిసిపోతుందో అని వస్తున్నాను అనుకుంటుంది. వెళ్లి నిరుపమ్‌ను పలకరిస్తుంది జ్వాల. అటునుంచి ఎలాంటి రెస్పాన్స్‌ ఉండదు. ఆశ్రమంలో బిస్కెట్లు పంచడానికి హిమ వచ్చిందని కవర్ చేస్తుంది జ్వాల. వెళ్లమంటుంది జ్వాల. హిమ వెళ్లకపోయేసరికి కొందరికి కొన్ని అర్థం కావు లెండి అంటుంది జ్వాల. ఏ విషయం గురించి జ్వాల నువ్వు అనేది అని అడుగుతాడు నిరుపమ్. అర్థమయ్యేవాళ్లకు ఇవన్నీ అర్థమవుతాయో లేదో అంటుంది జ్వాల. హిమ మనసులో ఏముందో తెలుసుకోవాలని జ్వాలను పిలిస్తే హిమను వెంటపెట్టుకొని వచ్చిందేంటి అని అనుకుంటాడు. 

చెప్పండి డాక్టర్ సాబ్‌ ఎందుకు పిలించారు అని అడుగుతుంది జ్వాల. నేను అమెరికా వెళ్దామనుకుంటున్నాను అంటాడు నిరుపమ్. ఆ మాటకు జ్వాల, హిమ ఇద్దరూ షాక్ అవుతారు. 

రేపటి భాగం
తనకు క్యాన్సర్‌ అంటూ నిరుపమ్‌కు రిపోర్ట్స్‌ చూపిస్తుంది హిమ. అది చూసి షాక్ అవుతాడు. నా ప్రాణాలు అడ్డేసి అయినా నిన్ను కాపాడుకుంటానంటాడు. అయితే నాకు ఓ మాట ఇమ్మంటుంది హిమ. తనను మర్చిపోమంటుంది. ఎన్నో రోజులు బతకని నాతో ప్రేమ పెళ్లి ఎందుకంటుంది. అలా మాట్లాడొద్దని రిక్వస్ట్ చేస్తాడు నిరుపమ్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
Embed widget