అన్వేషించండి

కాKarthika Deepam 2 Serial Today December 7th: కార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌ల కౌంటర్‌కి రీ కౌంటర్‌ ఇవ్వడానికి జ్యోత్స్నకి తాత పర్మిషన్.. జ్యో ప్లాన్ ఏంటో!

Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ వాళ్లు తనని ఘోరంగా అవమానించారని శివనారాయణ జ్యోత్స్న వాళ్లతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శివనారాయణ దీప వాళ్లని వద్దని కార్తీక్, కాంచనలను మాత్రమే ఇంటికి రమ్మని పిలుస్తాడు. దాంతో కార్తీక్ నా భర్య, కూతురిని వద్దని అంటారా అని తాత మీద సీరియస్ అవుతాడు. వాళ్లని వదిలేసి రాను అని కావాలంటే మీరే వచ్చి మా ఇంట్లో ఉండండి అని అంటాడు. 

శివనారాయణ: కాంచన నువ్వు నీ కొడుకు నాతో వస్తున్నారా లేదా.
కాంచన: కోడలిని వదిలేసి ఎలా వస్తాను నాన్న.
శివనారాయణ: ఆహా కూతిరిగా నీకు పాస్ మార్కులు రాకపోయినా అత్తగా వంద మార్కులు పడ్డాయి. తగ్గి నీ ఇంటి గుమ్మం తొక్కానని తల పొగరుగా మాట్లాడుతున్నావ్.  
కార్తీక్: నువ్వు అర్థం లేని కోరికలు కోరినప్పుడు నా సమాధానం ఇలాగే ఉంటుంది. కార్తీక్ అనే వాడు వస్తే భార్యాకూతురితోనే వస్తాడు. విడిగా రాడు. 
శివనారాయణ: ఏమ్మా నువ్వేమంటావ్.
కాంచన: అందరం కలిసే వస్తాం నాన్న.
శివనారాయణ: మర్యాదగా బయటకు పొమన్నావ్ అంతే కదా. మనవరాలి కోసం తల వంచి నీ గుమ్మం ముందు అడుగుపెట్టినందుకు మంచి మర్యాదే ఇచ్చావ్.
కార్తీక్: లేదంటే నువ్వేం చెప్తే అది చేస్తాం అనుకున్నావా.
శివనారాయణ: రేయ్ దీనికి ఫలితం నువ్వు అనుభవిస్తావురా. ఇన్నాళ్లు కొడుకు కోసం నాన్నని వద్దు అనుకున్నావ్ ఇప్పుడు కోడలి కోసం నాన్నని వద్దు అనుకుంటున్నావ్ నా జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు.
దీప: తాతయ్య గారు.
శివనారాయణ: నువ్వు నన్ను అలా పిలవకు. నా కూతురిని నాకు దూరం చేశావ్ నా మనవడిని దూరం చేశావ్. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు. ఉండమ్మా. ఇలాగే అందరినీ ఏడిపిస్తూ నువ్వు మాత్రం సంతోషంగా ఉండు. 
కార్తీక్: తాత వెళ్లే ముందు ఈ ఇంటి కోడలిని అవమానించకు.
శివనారాయణ: ఇది అవమానం కాదురా నా బాధ నా నొప్పి గాయ పడిన నాకు ఆ బాధ తెలుసు. ఈ యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది గుర్తు పెట్టుకో. 
దీప: మీరు వెళ్లొచ్చు కదమ్మా.
కార్తీక్: నువ్వు వెళ్లు నువ్వు వెళ్లు జ్యోత్స్న బాధ పడుతుందంట నువ్వు వెళ్లి జ్యూస్‌లు ఇచ్చి ఓదార్చు. ఆయన ఉద్దేశం అర్థం కావడంలేదా. 
అనసూయ: కోడలిని పట్టుకొని అన్ని మాటలు అంటే ఏ అత్త అయినా ఊరు కుంటుందా.మీరు ఇలా సపోర్ట్ చేస్తే కాదమ్మా అదే నీ దారి నువ్వు చూసుకో అనండి అది ఎగిరి గంతేస్తుంది.
కాంచన: ఏంటో అక్క అడిగింది కాదన్నందకు నాన్న చాలా బాధ పడుంటారు. నన్ను క్షమించు నాన్న. 
పారిజాతం: తాతయ్య అని కూడా చూడకుండా ఆ కార్తీక్ గాడు మిమల్ని అంత అవమానించాడా.
శివనారాయణ: ఒక్క కార్తీకే కాదు అందరూ కలిసి అవమానించారు. 
జ్యోత్స్న: నువ్వు అత్త ఇంటికి ఎందుకు వెళ్లావు తాత.
శివనారాయణ: నీ కోసమే నిన్ను ఇలాగే వదిలేస్తే ఏమైపోతావా అని వెళ్లాను. 
పారిజాతం: మీరు పట్టుదల వదులుకొని వెళ్లారు వాళ్లు మీ పరువు తీశాడు. దీప వాడిని ఎంతలా మార్చేసిందో అర్థం చేసుకో.
జ్యోత్స్న: ఇంటికొచ్చిన తండ్రిని అత్త, బావ ఇంతలా అవమానించారు అంటే ఆ దీప ఎంతలా మార్చేసింది.
పారిజాతం: నన్ను ఎన్ని అన్నా పడతాను కానీ నా భర్తని అనడం ఏంటి. ఇప్పుడు నీ అత్తకి పుట్టిళ్లు తండ్రి ఏం అవసరం లేదు. దీప, శౌర్య, అనసూయ పాటి విలువ చేయరా మీ తాతయ్య. వాళ్లకి ఇచ్చే విలువ కూడా ఇవ్వడం లేదంటే వాళ్లని ఎందుకు క్షమించాలి. దీనంతటికి కారణమైన ఆ దీప సంగతి చూడాలి.
జ్యోత్స్న: తాత నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నా దీనికి కౌంటర్‌గా ఏమైనా చేయాలి అనుకుంటున్నా నువ్వేమీ అనుకోవు కదా.
శివనారాయణ: అనుకోను నువ్వు ఏమైనా చేయ్. ఏం చేసినా నన్ను దృష్టిలో పెట్టుకొని చేయి.
జ్యోత్స్న: నా కోసం నువ్వు ఓ మెట్టు దిగితే నేను నిన్ను తగ్గించను నీ పరువు నిలబెడతా.

మరోవైపు కాశీ, స్వప్నలు మాట్లాడుకుంటారు. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి జాబ్ చేస్తా అని స్వప్న అంటే దానికి కాశీ వద్దని దీప వంటలు బాగా చేస్తుంది కాబట్టి మనం ఓ ఫుడ్ కోర్ట్ పెట్టుకుందామని అంటాడు. స్వప్న ఓకే చెప్తుంది. కార్తీక్ దీప ఫుడ్ కోర్ట్ పెట్టుకుందామని అనుకుంటారు. ఇక ఈ విషయం గురించి కార్తీక్ వాళ్లకి చెప్దామని అనుకుంటారు. మరోవైపు దాసు దీప గురించి చెప్పలేకపోతున్నాను అని జ్యోత్స్న తన స్థానాన్ని కాపాడుకోవడానికి దీపని చంపాలనుకుంటుందని ఏం చేయాలని అనుకుంటాడు. కాశీ తండ్రి దగ్గరకు వచ్చి హాస్పిటల్‌లో జ్యోత్స్నని చేయి ఎత్తి మరీ వార్నింగ్ ఇచ్చావు ఎందుకు అని అడుగుతాడు. జాగ్రత్త కోసమే అని చెప్తే జ్యోత్స్న అక్క వినదు అని చెప్తాడు దాసు. జరిగింది తలచుకొని దీప ఏడుస్తుంటే కార్తీక్ వస్తాడు. ఈ జ్యోత్స్నని మీరు పెళ్లి చేసుకొని ఉంటే ఈ గొడవలు జరగకపోయున్నని అంటుంది. తాతయ్య పిలిచుంటే మీరు వెళ్లాల్సిందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget