Karthika Deepam 2 Serial Today December 30th: కార్తీకదీపం 2 సీరియల్: ఏదో చేస్తాం అని వచ్చి చక్కగా టిఫెన్ చేశారేంటో? వంటలక్కా మజాకా!
Karthika Deepam 2 Serial Today Episode దీప కార్తీక్‌లు హోటల్ పెట్టడం జ్యోత్స్న, పారిజాతం అక్కడికి వచ్చి హడావుడి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప టిఫెన్ బండి స్టార్ట్ చేస్తుంది. కార్తీక్ తప్ప కాశీ, స్వప్న, దాసు, కాంచన వాళ్లు వస్తారు. టిఫెన్ సెంటర్‌కి దీప కార్తీక్ టిఫెన్ సెంటర్ అని పేరు పెడుతుంది. అందరూ మంచి రెస్టారెంట్ స్థాయికి వెళ్లాలని ఆల్ ది బెస్ట్ చెప్తారు. శౌర్య నాన్నని పిలుస్తాను అంటే నాన్నకి ఇష్టం లేదు ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ లుంగీ కట్టి భుజాన వాటర్ క్యాన్ వేసుకొని వస్తాడు. అందరూ షాక్ అవుతారు. అన్నయ్యేనా అని స్వప్న అంటే దానికి కార్తీక్ నేను కాకపోతే ఎవరు అనుకున్నారు అని అంటాడు. ఇక కాశీ విజిల్ వేసి బావ సూపర్ ఎంట్రీ ఇచ్చావ్ అంటాడు.
శౌర్య కార్తీక్‌తో నీ పేరు మీదే అమ్మ టిఫెన్ బంటి పెట్టింది అంటే దానికి దాసు ఒక్కోక్కరు ఒక్కో రకంగా ప్రేమ వ్యక్త పరుస్తారు తను ఈ రకంగా చెప్పింది అని అంటాడు. దానికి కార్తీక్ తన పేరు మీద నేను రెస్టారెంట్ పెట్టాలి అనుకుంటే తను నా పేరు మీద ఇలా పెట్టింది థ్యాంక్స్ దీప అని అంటాడు. మీరు రావడం చాలా సంతోషంగా ఉందని కానీ వాటర్ క్యాన్ తీసుకురావడం ఏంటి అని అంటుంది. వచ్చినందుకు థ్యాంక్స్ అని అంటుంది. ఇక కార్తీక్ ఇడ్లీ పెడితే దీప పూరీ వేయిస్తుంది. అన్ని రకాల టిఫెన్స్ చేస్తారు. మొదటి ప్లేట్ నువ్వే తిని చెప్పు అని కార్తీక్ కాంచనకు ఇస్తాడు. దీప కార్తీక్‌లు అందరికీ టిఫెన్స్ ఇస్తారు. దీప కార్తీక్‌కి కూడా టిఫెన్ ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అంటుంది. నీ చేతి వంటలకు వంకలు పెట్టలేమని కార్తీక్ అంటారు అందరూ టిఫెన్స్‌ని పొగుడుతారు. అందరూ కలిసి సరదాగా ఫోటో తీసుకుంటారు. ఇంతలో కస్టమర్ వస్తాడు. కార్తీక్ సంతోషంగా తొలి కస్టమర్ వచ్చేశాడు నీ చేతితో ఇవ్వు అని చెప్తాడు. దీప సంతోషంగా టిఫెన్ ఇస్తుంది.
మరోవైపు జ్యోత్స్న లెహంగా డిజైన్ చేస్తుంటుంది. ఇంతలో కాశీ పారిజాతం ఫోన్‌కి టిఫెన్ సెంటర్ దగ్గర తీసుకున్న ఫొటో పెడతాడు. పారిజాతం ఆ ఫొటో జ్యోత్స్నకి చూపిస్తుంది. జ్యోత్స్న పారిజాతంతో నాకు బాగా ఆకలి వేస్తుంది దీప హోటల్‌కి వెళ్దాం పద అని అంటుంది. అందరూ దీపని తెగ పొగిడేస్తారు. అందరూ చాలా సంతోషిస్తారు. కార్తీక్‌నే స్వయంగా టిఫెన్స్ పెట్టి అందరికీ టిఫెన్స్ పంచుతాడు. ఇంతలో జ్యోత్స్న, పారిజాతం అక్కడికి వస్తారు. దీప వాళ్లని చూసి టెన్షన్ పడి కార్తీక్‌కి చూపిస్తుంది. వీళ్లు ఇలా వచ్చారేంటి అంటే కాశీ నేనే ఫొటో పెట్టానని అంటాడు. దాసు కాశీకి చీవాట్లు పెడతాడు. టైటిల్ అదిరిపోయిందని జ్యోత్స్న అంటే టిఫెన్ ఇంకా బాగుంటుంది తినండి అంటాడు కార్తీక్.
ఇక పారిజాతం నిన్ను ఇలా ఎప్పుడూ చూస్తాను అనుకోలేదు అంటుంది. కాంచన కూడా కోపంగా మాట్లాడుతుంది. గొడవ చేయొద్దని దాసు అంటే మేం కూడా టిఫెన్ చేయడానికే వచ్చాం అని అంటుంది. దాంతో కార్తీక్, దీపలు వాళ్లకి టిఫెన్స్ ఇస్తాడు. నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు బావ అని చెప్తుంది. మా బావని జీవితంలో ఇలా చూస్తానని అనుకోలేదు అని అంటుంది. రాజాలా ఉన్న మా బావని టిఫెన్ సెంటర్లో సర్వర్‌ని చేశావని దీప మీద కోప్పడుతుంది. దాంతో కార్తీక్ జ్యోత్స్న గారు మీరు ఇక బయల్దేరండి అని అంటుంది. ఇక పారిజాతం ఫోటోలు తీసుకుంటా అంటే కార్తీక్ ఫోజులు ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!