అన్వేషించండి

Karthika Deepam 2 Serial August 31st: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ మెడకు చుట్టుకుంటున్న స్వప్న, కాశీల బంధం.. ప్రేమంటే చిరొత్తుకొస్తుందంటోన్న శ్రేయాభిలాషి!

Karthika Deepam 2 Serial Episode శ్రీధర్‌కి స్వప్న ప్రేమ విషయం తెలిసి స్వప్నకు మరో సంబంధం ఫిక్స్ చేయడం స్వప్న కార్తీక్‌కి కాల్ చేసి చనిపోతానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode స్వప్న కాశీ బైక్‌ మీద వెళ్లి చేతిని ముద్దు పెట్టుకోవడం చూసిన శ్రీధర్ సడెన్‌గా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. తన ఆఫీస్‌లో పని చేసే శ్రీకాంత్ అనే అబ్బాయి ముందు స్వప్నని కూర్చొపెట్టి నెలకి లక్షన్నర శాలరీ, ఇళ్లరికం వస్తాడని స్వప్నకి చెప్తాడు. స్వప్న కోపంతో తండ్రి మాటలు వింటుంది. ఇక పెళ్లికొడుకుతో మాట్లాడాలి అని స్వప్న అంటుంది. శ్రీకాంత్‌తో స్వప్న తను కాశీని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవడం లేదని అంటుంది. దానికి శ్రీకాంత్ కాశీ నువ్వు ప్రేమించుకున్నావని తెలిసే మీ నాన్న నాకు పెళ్లి చేసుకోమన్నారని శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటానని అంటాడు.

స్వప్న కాశీకి కాల్ చేస్తే కాల్ కలవదు. ఇంతలో స్వప్న కార్తీక్, దీపలకు విషయం చెప్పాలని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ కాశీ, స్వప్నల ఫ్యామిలీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ దగ్గరకు శౌర్య వచ్చి మాట్లాడుతుంది. ఇంతలో కాశీ కూడా వచ్చి వాళ్ల దగ్గర కూర్చొంటాడు. శౌర్యతో ప్రేమగా మాట్లాడుతాడు. ఇక కాశీతో శౌర్య నిన్ను ఏమని పిలవాలని అంటే మామయ్య అని పిలవమని అంటాడు. ఇక కాశీ కార్తీక్‌ని బావ అని పిలుస్తాడు. మీరు మాకు బంధువులు అని తెలిశాక నిజమేనా అని ఆశ్చర్యంగా ఉందని అంటాడు. కాశీ తన తండ్రిని ఒప్పించే బాధ్యత కూడా కార్తీక్ మీదే పెట్టేస్తాడు. దాసు దీప, జ్యోత్స్నల గురించి ఆలోచిస్తూ జ్యోత్స్న ప్రవర్తనకు బాధ పడతాడు. ఇంతలో సుమిత్ర దాసుకి కాఫీ ఇస్తుంది. పారిజాతం చాటుగా వాళ్ల మాటలు వింటుంది.

దాసు: తల్లిదండ్రుల మంచితనం పిల్లలకు వస్తే బాగున్ను వదిన.
సుమిత్ర: రోడ్డు మీద వదిలేసింది కాశీనే అని తనకు తెలీదు దాసు. 
పారిజాతం: వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు. అసలే వాడేం మాట్లాడుతాడో వాడికే తెలీదు. 
దాసు: నేను మాట్లాడింది వదిలేసి వెళ్లిన దాని గురించి కాదు వదినా నేను ఇలా అంటున్నాను అని ఏం అనుకోవద్దు వదిన.. నీ మంచితనం నీ పెంపకంలో లేదు వదినా. ఇన్ని కోట్ల ఆస్తికి నువ్వు ఏకైక కోడలివి. నా లాంటి పేదవారిని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నన్ను కూడా నువ్వు పట్టించుకొని కాఫీ ఇచ్చావ్. కానీ ఇవన్నీ జ్యోత్స్నలో లేవు జ్యోత్స్నలో డబ్బు ఉందనే అహంకారం ఎక్కువ ఉంది.  రేపు ఏం జరిగినా తల్లినే అంటారు కదా.
పారిజాతం: ఓరేయ్ దాసుగా నీకు ఎందుకురా ఇవన్నీ.. నోరు అదుపులో పెట్టుకొని చావొచ్చుగా వీడి మాటలు ఎవరూ వినలేదు కాబట్టి సరిపోయింది. అనుకుంటుంది ఇంతలో  శౌర్య రావడం చూసి శౌర్య విందేమో అనుకుంటుంది. ఇక నువ్వు మాటలు చాటుగా విన్నావని ముద్దుల తాతయ్యకి చెప్తానని అంటుంది. పారిజాతం శౌర్యని బుజ్జగించేలోపు శివనారాయణ వచ్చేస్తాడు. శౌర్యని కాకాపడుతున్నావని అంటే శౌర్య పారిజాతాన్ని ఇరికించేస్తుంది. 

స్వప్న ప్రేమ విషయం అప్పుడే ఇంట్లో వాళ్లకి చెప్పొద్దని కార్తీక్ అనుకునేలోపు స్వప్న కార్తీక్‌కి కాల్ చేసి తన ఇంట్లో వాళ్లకి తెలిసిపోయిందని పెళ్లి ఫిక్స్ చేశారని చనిపోతానని అంటుంది. ఇక స్వప్న మాట ఇమ్మంటే స్వప్నకి మాట ఇస్తే తన తల్లికి ప్రమాదమని కార్తీక్ అనుకుంటాడు. నీ ప్రాణాలు నువ్వు కాపాడుకో నీ ప్రేమ నేను కాపాడుతా అంటాడు. ఇక కార్తీక్ ఇది రాఖీ పండగలా లేదు దసరా పండగలా ఉందని బాధ పడతాడు. ఇక శౌర్య వచ్చి తల్లి కాల్ చేయమని అంటుంది. ఇక జ్యోత్స్న వస్తే శౌర్య కార్తీక్ దగ్గరకు వెళ్లొద్దని అంటుంది. జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్లి మాట్లాడితే కార్తీక్ తిట్టి వెళ్లిపోతాడు. ఇంతలో దీప కార్తీక్ కాల్ చేస్తుంది. దీప నరకం చూపిస్తుందని మనసులో అనుకొని జ్యోత్స్న కోపంతో వెళ్లిపోతుంది. దీప, కార్తీక్‌లు ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: సుమన, పెద్దబొట్టమ్మ కలిసి పెద్ద ప్లానే వేశారుగా.. మణి కోసం పేపర్లు తీసుకొని వెళ్లిపోతారా?

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
Nuvvu leka Neanu Lenu Serial Today July 18th:రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
నువ్వులేక నేను లేను: రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
Illu Illalu Pillalu Serial Today July 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget