అన్వేషించండి

Karthika deepam 2 Serial Today August 24th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: దీపను మెచ్చుకున్న పారిజాతం – హాస్పిటల్ కు వెళ్లిన జ్యోత్స్న

Karthika deepam 2 Today Episode: కాశీని చూడ్డానికి హాస్పిటల్ కు వెళ్లిన జ్యోత్స్న దీపను వెటకారంగా తిట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Karthika deepam 2 Serial Today Episode:  పారిజాతం దగ్గరకు వచ్చిన దాసు.. జ్యోత్స్న ఎంతలా దిగజారిపోతుందోనని బాధపడతాడు. తన కళ్ల ముందే రోడ్డు మీద యాక్సిడెంట్‌ జరిగితే పట్టించుకోకుండా వెళ్లిందని.. ఎమోషనల్‌ అవుతాడు. తర్వాత  తన కొడుకు యాక్సిడెంట్‌ వీడియో పారిజాతానికి చూపిస్తాడు. ఈ వీడియోలో ఉన్న కాశీ తన కొడుకని దాసు చెప్పడంతో పారిజాతం షాక్‌ అవుతుంది. మరోవైపు హాస్పిటల్‌ కు జ్యోత్స్న వెళ్లడంతో దీప ఆశ్యర్యపోతుంది.

జ్యోత్స్న: యాక్సిడెంట్ అయిన వీడు ప్రశాంతంగా ఉన్నాడు. వీడిని కాపాడినట్టు బిల్డప్ ఇచ్చిన నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు. కారు ఆపకుండా వెళ్లిపోయానని వాడు ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో నన్ను ఛీ అనిపించాడు.

దీప: ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా జ్యోత్స్న.

జ్యోత్స్న: నీతో గొడవ పెట్టుకుంటే ఊరుకుంటారా? ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ వీడియో కూడా ఎవడో ఒకడు ఎడిట్ చేసి మానవత్వంతో యాక్సిడెంట్ అయిన అబ్బాయిని కాపాడిన మహిళ మీద మిస్‌ హైదరాబాద్‌ దౌర్జన్యం అని రాస్తారు. యాక్సిడెంట్ అయ్యింది వీడికి కానీ డ్యామేజ్ జరిగింది నాకు.

   అని జ్యోత్స్న మాట్లాడుతుంటే ఇంతలో కార్తీక్‌ వస్తాడు. కార్తీక్‌ ను చూసిన జ్యోత్స్న మాట మారుస్తుంది. ఇప్పుడు కాశీకి ఎలా ఉందని అడుగుతుంది. దీంతో దీప షాక్‌ అవుతుంది. అయితే కార్తీక్‌ దారి తప్పి వచ్చావా? అంటూ జ్యోత్స్న ను అడుగుతాడు. ఇప్పటికే చేసిన దానికి ఎంతో గిల్టీగా ఫీల్‌ అవుతున్నానని యాక్టింగ్‌ చేస్తుంది జ్యోత్స్న. అయితే తన తప్పు కవర్‌ చేసుకోవడానికే జ్యోత్స్న ఇలా మాట్లాడుతుందని కార్తీక్‌ కనిపెడతాడు. మరోవైపు మనవడిని తలుచుకుని పారిజాతం బాధపడుతుంది. జ్యోత్స్న ను మరీ ఇలా పెంచావేంటని పారిజాతాన్ని ప్రశ్నిస్తాడు. మనిషి ప్రాణం పోయిన పట్టించుకోనంత దుర్మార్గంగా పెరిగింది. అని అడుగుతాడు. ఇంతలో పారిజాతం వస్తుంది.

జ్యోత్స్న: ఎక్కడికి వచ్చావు పారు..

పారిజాతం: యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూసి వస్తాను.

జ్యోత్స్న: వాడిని చూడాల్సిన అవసరం నీకేంటి?

పారిజాతం: వాడు… నీ ( తమ్ముడు అని చెప్పబోయి ఆగిపోతుంది.)  

జ్యోత్స్న: వాడు నా.. ఏంటి చెప్పు..

పారితాజం: ఏం లేదులే వెళ్లు నేను వస్తాను. ( కాశీని చూసి) నన్ను క్షమించురా మనవడా, యాక్సిడెంట్ అయింది నీకని తెలిస్తే రోడ్డు మీద అలా వదిలేసి వెళ్లిపోయే దాన్ని కాదు. (అని మనసులో అనుకుంటుంది.)

కార్తీక్‌: ఏంటి పారు ఏదో సొంత మనవడిని చూసినట్టు చూస్తున్నావ్ నా మీద కూడా నువ్వు ఇంత ప్రేమ ఎప్పుడూ చూపించలేదు. ఏదో తేడాగా ఉన్నావు.

పారిజాతం: కార్తీక్‌ దగ్గరుండి వీడిని సొంత మనిషిలా చూసుకుంటున్నావు.. నువ్వు చాలా గ్రేట్‌

కార్తీక్ : నేను కాదు చూసుకుంటుంది దీప. కాపాడింది కూడా దీపే..

పారిజాతం: చాలా మంచి పని చేశావు దీప.

 అని మొదటిసారి పారిజాతం దీపను మెచ్చుకుంటుంది. తర్వాత పారిజాతం లేటుగా వచ్చినందుకు జ్యోత్స్న, పారిజాతాన్ని తిడుతుంది. మరోవైపు కావేరీ,  స్వప్న గురించి ఆలోచిస్తూ… శ్రీధర్ కు ఫోన్ చేస్తుంది. కాంచన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కావేరీ కంగారుగా బేబీ ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. బేబీ ఎవరు అని కాంచన ప్రశ్నించడంతో కావేరీ భయంతో ఫోన్‌ కట్‌ చేస్తుంది.

     అప్పుడే ఇంట్లోకి వచ్చిన శ్రీధర్‌ ను బేబీ ఎవరని కాంచన అడగడంతో శ్రీధర్‌ ఫస్ట్‌ షాక్‌ అయినా తేరుకుని ఎవరో నాకేం తెలుసని మాట మారుస్తాడు. ఎవరో అర్థం పర్థం లేని వాళ్ళు ఇలా ఫోన్ చేస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టిస్తారని కవర్ చేస్తాడు. మరోవైపు ఇంటికొచ్చిన దీపను సుమిత్ర మెచ్చుకుంటుంది. జ్యోత్స్న మాత్రం వెటకారంగా దీపను తిడుతుంది. నువ్వే ఆ వీడియో తీయించి ఉంటావని దీపను అనుమానిస్తుంది జ్యోత్స్న. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మంచు విష్ణు నట వారసుడు వచ్చేస్తున్నాడు, ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ పోస్టర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget