అన్వేషించండి

Janaki Kalaganaledu మే 30 (ఈరోజు) ఎపిసోడ్: వెన్నెల చేతిలో జానకీరామచంద్ర హైదరాబాద్ ప్రయాణం- టికెట్ చూపించమని చెప్పిన జ్ఞానాంభ

ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకునేది చాటు మాటున ఉంటూ వినే మల్లిక... జానకీ రామచంద్ర వెళ్లేది వైజాగ్‌ కాదు హైదరాబాద్‌ అని తెలుసుకుంటుంది. విషయాన్ని అత్తకు చేరవేస్తుంది. దీంతో జ్ఞానాంభ అనుమాన పడుతుంది.

మొదటి ఆహ్వాన పత్రి అందుకున్న మీరు షాప్‌ ఓపెనింగ్‌ రావాలంటూ తను తీసుకొచ్చిన స్వీట్స్, కార్డును జ్ఞానాంభ చేతిలో బలవంతంగా పెట్టేస్తుంది సునంద. స్వీట్స్‌ వ్యాపారంలో తలపండిన రామచంద్ర సలహాలు తీసుకుంటానంటూ చెప్తాడు కన్నబాబు. తప్పకుండా రావాలంటూ చెప్పి మరీ వెళ్తారు. 

వాళ్లు అలా వెళ్లిన వెంటనే అసలు స్వీట్‌ షాప్ ఎందుకు పెట్టాలనుకుంటాన్నారో అర్థం కాక తలబద్దలు కొట్టుకుంటారు జ్ఞానాంభ, గోవిందరాజు. వాళ్ల ఇష్టం వాళ్లదని... వాళ్ల గురించి మనం ఆలోచించడం ఏంటని చివరికి అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ జానకీ రామచంద్ర ప్రవర్తనపై మల్లిక అనుమాన పడుతుంది. 

ఇచ్చిన షాక్‌కు జానకీ రామచంద్రకు దిమ్మదిరిగి బొమ్మకనిపిస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు సునంద, కన్నబాబు. ఇంతలో అక్కడకు వచ్చిన జానకి... ఏంటీ పిచ్చి పిచ్చిగా ఉందా గడవులోపు డబ్బులు ఇస్తామంటే ఈ ఎక్స్‌ట్రాలు ఏంటని ప్రశ్నిస్తుంది. ఎక్‌ట్రాలు  కాదని.. నమ్మకమని అంటాడు కన్నబాబు. డబ్బులు కట్టడం మీ వల్ల కాదని నా నమ్మకమని అంటాడు. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకుంటానంటాడు. గడువు లోపు నీ డబ్బులు నీకు ఇస్తామని ఈ లోగా పిచ్చిపిచ్చిపనులు చేస్తే బోగాదని హెచ్చరిస్తాడు రామచంద్ర. మీ అమ్మకు చెప్పేస్తానని భయపడ్డావా... అని వెటకారం చేస్తాడు కన్నబాబు. ఈ భయం నీ పెళ్లాం నన్ను కొట్టక ముందు, నీవు నా తోటకు వచ్చి కొట్టకు ముందు ఉండాలంటాడు. వీళ్ల మధ్య జరుగుతున్న డిస్కషన్‌ను మల్లిక చాటుగా వింటుంది. 
మర్యాదగా వెళ్లిపోమంటుంది జానకి.. గడువు వరకు నోరుమూసుకొని ఉండమని హెచ్చరిస్తుంది జానకీ. మళ్లీ మళ్లీ ఇంటికి వస్తే బెదిరించడం నీకే కాదు మాకు వచ్చిని వార్నింగ్ ఇస్తుంది. ఆ బెదిరింపులకు నీవు తట్టుకోలేవని అంటుంది. 
జానకీ రామచంద్ర భయపడటానికి కారణం ఏమై ఉంటుందని మల్లిక తెగ ఆలోచిస్తుంది. కన్నబాబు, జానకీరామచంద్ర మధ్య ఏదో కథ ఉందని అనుకుంటుంది. ఇంతలో పని మనిషి చికితా వచ్చి ఎందుకలా ఆలోచిస్తున్నారని ఆరా తీస్తుంది. అసలు విషయం చెబుతుంది మల్లిక. అది విన్న చికితా... ఎందుకంతా ఆలోచించి చచ్చిపోతున్నారని కోపంతో వెళ్లిపోతుంది. ఎవరు ఏం చెప్పినా ఆ గొలుసుకొట్టు వెనుక ఉన్న కుట్ర తెలుసుకుంటానంటూ వెళ్లిపోతుంది మల్లిక. 

స్వీట్ షాపు రాయించుకున్న సంగతి అమ్మకు  ఆ కన్నబాబు ఎక్కడ చెప్పేస్తాడో అని భయపడ్డానంటూ డిస్కష్ చేసుకుంటారు జానకీరామ. గడువు తీరేలోపు ఆ డబ్బులు సంగతి కన్నబాబు ఎవరికీ చెప్పలేడని అంటుంది జానకి. ఇంతలో అక్కడే గోవిందరాజు ఉంటాడు. ఏంటమ్మ ఏదో డబ్బులు అంటున్నారేంటీ అంటాడు గోవిందరాజు. మీకు డబ్బులు గురించి టెన్షన్ ఏంటని ప్రశ్నిస్తాడు. హైదరాబాద్ వెళ్లడానికి డబ్బులు అంటూ కవర్ చేస్తాడు రామచంద్ర. ఇంతలో వీళ్ల డిస్కషన్ వింటుంది మల్లిక. సడెన్‌గా హైదరాబాద్ ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటుంది. రామచంద్రకు తండ్రి స్వీట్ బాక్స్ ఇస్తాడు. అందులో డబ్బులు ఉంటాయి. దాన్ని చూసిన మల్లిక షాక్ తింటుంది. ఇన్ని డబ్బులు ఎందుకని అడుగుతాడు రామచంద్ర. హైదరాబాద్‌ వెళ్తున్నారి ఖర్చులకు అవుతాయంటాడు. మీ దగ్గర డబ్బుల్లేవని ఇవ్వడం లేదన్న గోవిందరాజు... చిన్నప్పటి నుంచి రామచంద్ర పడి కష్టాన్ని గుర్తు చేసుకుంటాడు. నీ కోసం ఈ నాన్న  జత బట్టలు కూడా కొనివ్వలేకపోయాడని అనుకుంటాడు గోవిందరాజు. ఇప్పుడు నేను ఇచ్చన డబ్బులు కూడా నీవు ఇచ్చినవే అంటాడు. నా కోసం కాదనకుండా తీసుకోవాల్సిందేనంటాడు. హైదరాబాద్ వెళ్లడానికి తీసుకొచ్చిన బస్‌ టీకెట్‌ కూడా వాళ్ల చేతికి ఇస్తాడు. రాముడూ వంటల పోటీల్లో గెలవాలని... నీ గెలుపు చూసి నేను గర్వంతో పొంగిపోవాలంటాడు. ఆ క్షణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నానంటాడు. 

పక్కనే ఉండి వింటున్న మల్లిక... అంటే వీళ్లు వెళ్తుంది వైజాగ్‌ పెళ్లికి కాదని... హైదరాబాద్‌కు అని తెలుసుకుంటుంది. వెంటనే విషయాన్ని జ్ఞానాంభకు చేరవేయాలని పరుగెడుతుంది. 

పెళ్లికి వెళ్తున్నారని జానకీరామచంద్రకు పులిహోర కలుపుతుంది జ్ఞానాంభ. ఇంతలో అక్కడకు వచ్చిన మల్లిక.  బాధేస్తుందని... గుండె తరక్కుపోతుందని అంటుంది. ఎందుకు అని అడుగుతుంది జ్ఞానాంభ. వాళ్లు హైదరాబాద్‌లో బిర్యాని తినే ప్లాన్‌లో ఉన్నారని... చెబుతుంది మల్లిక. వాళ్లు వైజాగ్‌ పెళ్లికి వెళ్తుంటే... హైదరాబాద్‌ అంటావేంటని ఎదురు ప్రశ్నిస్తుంది జ్ఞానంభ. వాళ్లిద్దరు వెళ్లేది పెళ్లికి కాదని...హైదరాబాద్ వంటల పోటీకని ఊదేస్తుంది మల్లిక. ఈ ప్లాన్ అంతా మామయ్యే నడిపిస్తున్నారని చెబుతుంది. జ్ఞానాంభ మాత్రం నమ్మదు. వెళ్లి బస్‌ టికెట్లు చూపించమని అడగమంటుంది మల్లిక. 


రేపటి ఎపిసోడ్
ఊరు వెళ్తున్న జానకీరామచంద్రను బస్‌ టికెట్స్ చూపించమని అడుగుతుంది జ్ఞానాంభ. వెన్నెలా ఆ టికెట్‌ చూసి ఆ వివరాలు చెప్పమని అడుగుతుంది. టికెట్ చూసి ఆమె ఏం చదువుతుందో అని ఆ ముగ్గురిలో ఒకటే టెన్షన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 19th: ఫోన్ కొట్టేయాలని ప్రయత్నించిన శైలూకు కేశవ్‌ ఎలాంటి ఝలక్‌ ఇచ్చాడు..? మహాను కలిసి గాయత్రి ఏం చెప్పింది..?
పొదరిల్లు: ఫోన్ కొట్టేయాలని ప్రయత్నించిన శైలూకు కేశవ్‌ ఎలాంటి ఝలక్‌ ఇచ్చాడు..? మహాను కలిసి గాయత్రి ఏం చెప్పింది..?
Nindu Manasulu Serial Today March 19th: నిండు మనసులు: కళ్లు తెరిచిన రాజశేఖరం! ప్రేరణ వాళ్ల కోసం నిజం చెప్తాడా!
నిండు మనసులు: కళ్లు తెరిచిన రాజశేఖరం! ప్రేరణ వాళ్ల కోసం నిజం చెప్తాడా!
Brahmamudi Serial Today march 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు చెక్‌ పెట్టేందుకు అపర్ణ ప్లాన్‌ - పెరిగిపోయిన భ్రమరాంబ రాక్షసత్వం
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు చెక్‌ పెట్టేందుకు అపర్ణ ప్లాన్‌ - పెరిగిపోయిన భ్రమరాంబ రాక్షసత్వం
chinni serial today march 19th: చిన్ని సీరియల్: దేవాకి చెమటలు పట్టించేసిన చిన్ని! శ్రీవారిని దారిలోకి తెచ్చుకుంటుందా!
చిన్ని సీరియల్: దేవాకి చెమటలు పట్టించేసిన చిన్ని! శ్రీవారిని దారిలోకి తెచ్చుకుంటుందా!

వీడియోలు

Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam
India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Ugadi: జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
TVK Vijay trouble: కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
North Korean elections: ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
Dalal Street Market Crash 2026: దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
Dhurandhar 2 OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Anushka Shetty : అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
YS Jagan: సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Embed widget