Janaki Kalaganaledu June 7th (ఈరోజు) ఎపిసోడ్: చార్మినార్ వద్ద గాజుల కోసం వెళ్లిన రామచంద్ర- తెలియక చెంప దెబ్బ కొట్టిన జానకి
తనకున్న మానవత్వంతో తొలి రౌండ్‌లో ఎలాంటి పోటీ ఎదుర్కోకుండానే రెండో రౌండ్‌కు వెళ్లిపోతాడు రామచంద్ర. ఈ ఆనందంలో హైదారాబాద్ అంతా తిరిగేస్తారు.
ఐదు వందల రూపాయలతో వంటల పోటీలకు కావాల్సిన సరకులు కొనాలనుకుంటాడు రామచంద్ర. కావాల్సినవన్నీ తీసుకుంటాడు. బిల్ వేయిస్తే 800 వందలు అవుతుంది. ఐదు వందలకు సరిపడా సరుకులు మాత్రమే తీసుకుంటాడు.
సరకులకు వెళ్లి వాళ్లందరూ వస్తారు కానీ... రామచంద్ర మాత్రం కనిపించడు. జానకి కంగారు పడుతుంది. పోటీలు ప్రారంభమైనప్పటికీ రామచంద్ర ఇంకా సరకులు కొంటూనే ఉంటాడు. కాస్త టైం ఇవ్వాలని నిర్వాహకులకు రిక్వస్ట్ చేస్తుంది జానకి. సరకులు కొనడం కూడా ఆయనకు రాదా అని ప్రశ్నిస్తారు వాళ్లంతా. రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని రిక్వస్ట్ చేస్తుంది. ఆమె రిక్వస్ట్‌ను మన్నించి ఐదు నిమిషాల సమయం ఇస్తారు. రెండు నిమిషాల తర్వాత రామచంద్ర వస్తాడు.
తాము ఇచ్చిన డబ్బులకు అంతా చాలా ఐటెమ్స్ తీసుకొస్తే మీరేంటి తక్కువ సరకులు తీసుకొచ్చారని రామచంద్రను ప్రశ్నిస్తారు నిర్వాహకులు. ఏం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేస్తాడు రామచంద్ర. రెండు వందలతో సరకులు కొని.. మిగతా సొమ్ము పాకెట్‌లో వేసుకొని ఉంటాడని హేళన చేస్తారు. ఇంతలో జానకి కలుగజేసుకొని ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని చెబుతుంది. ఇక్కడ మనిషి గురించి కాదని.. డబ్బులు ఏం చేశారో అని ప్రశ్నిస్తారు నిర్వాహకులు.
తనకు జరిగింది వివరిస్తాడు రామచంద్ర. కథలు బాగా చెప్తున్నాడని మిగతావాళ్లు కామెంట్ చేస్తారు. రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్లిన వాళ్లను ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందని అంటారు నిర్వాహకులు.
ఇదంతా చూస్తున్న జ్ఞానాంభ కంగారు పడుతుంది. ఇలాంటివి ఉంటాయనే తన బిడ్డను ఎక్కడికి పోటీలకు పంపించొద్దని అనుకున్నట్టు చెబుతుంది. టీవీలో ఆ సీన్స్ చూసి భళే సంబరపడిపోతుంది మల్లిక. జానకిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని కామెంట్ చేస్తుంది. పక్కనే ఉన్న ఆమె భర్త మల్లికపై సెటైర్లు వేస్తాడు.
నిర్వాహకులు అలా అనేసరికి... రామచంద్ర కూడా వెళ్లిపోదామంటాడు. ఓడిపోయాడని అంతా అంటుంటే.. వెళ్లిపోవడమే బెటర్ అంటాడు రామచంద్ర. ఇంకా రిజల్ట్స్ చెప్పలేదని.. ఓడిపోయామని ఎలా అనుకుంటామంటుంది జానకి.
నిర్వాహకులు కూడా రామచంద్రను తప్పుపడతారు. ఇచ్చిన డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టు దానం చేస్తే ఎలా అని క్లాస్ తీసుకుంటారు. అందుకే ఫస్ట్ రౌండ్‌లో ఎలిమినేట్ అయినట్టు ప్రకటిస్తారు. బాధతో జానకి రామచంద్ర నడుచుకుంటూ వెళ్లిపోతారు. ఇంతలో అక్కడే ఉన్న జడ్జెస్‌కి ఫోన్ వస్తుంది. వీడియో కాల్‌లో ఓ వ్యక్తి మాట్లాడుతూ అసలు విషయాన్ని వివరిస్తాడు.
మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి వచ్చి సాయం కోరాడని... ఆ వ్యక్తి తాము నియమించిన వాలంటీర్ అని ట్విస్ట్‌ను రివీల్ చేస్తాడు. ఈ పోటీల ఉద్దేశం ప్రతిభ ఒక్కటే కాదని... మానవత్వం కూడా అని చెప్తాడు. ఓటమి అంటే భయం లేకుండానే అమ్మ పేరు చెబితే ఎలా సాయం చేశావని రామచంద్రను ఆయన అడుగుతాడు.
తాను ఓ పల్లెటూరి వ్యక్తినని.. నాకు తెలిసిన భాషలోనే తెప్తానంటాడు రామచంద్ర. సాయం కోసం వచ్చిన వ్యక్తి ఎవరో తెలియనప్పటికీ అమ్మ కోసం బాధపడుతుంటే... నేను చేయగలిగిన సాయం మాత్రమే గుర్తుకు వచ్చిందంటాడు. మనకు జన్మనిచ్చిన అమ్మ ఆవిడ గురించి ఆలోచించాలా... కనిపించిన దేవత అమ్మ... ఆమెను బాగా చూసుకుంటే చాలు ముక్కోటి దేవతలను మొక్కిన పుణ్యం వస్తుందని అంటాడు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే తర్వాత రౌండ్‌కు ఎంపికయ్యారని జడ్జెస్ ప్రకటిస్తారు.
ఆ మాట విన్న ఫ్యామిలీ మెంబర్స్, జానకి అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిగతా రౌండ్స్‌లో గెలిచి మనకి మంచి పేరు తీసుకొస్తాడని అంటాడు గోవిందరాజు. ఇది చూసిన మల్లిక.. అత్త వద్ద జానకి మంచి పేరు వస్తుందేమో అని అసూయతో కుంగిపోతుంది.
బయటకు వచ్చిన గోవిందరాజు రామచంద్రకు ఫోన్ చేస్తాడు. రేపటి నుంచి అసలు పోటీలు మొదలవుతాయని... ఇప్పుడు విజయం ఆనందాన్ని ఇచ్చిందంటాడు. అదే ఆనందంతో జ్ఞానాంభతో మాట్లాడుతాడు. పోటీలో డబ్బులు అవసరం ఉన్నా... తల్లి మందుల కోసం డబ్బులు ఖర్చు పెట్టావు కదా అది అన్నింటి కంటే గొప్ప గెలుపు అంటుంది జ్ఞానాంభ. తర్వాత పోటీల్లో కూడా ఇలానే గెలవాలని అంటుంది.
హైదరాబాద్‌లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు జానకీరామచంద్ర. ఫొటోలు తీసుకుంటారు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీసుకోవడం నేరమని ఫైన్ కట్టాలని బెదిరిస్తాడు.
రేపటి భాగం
హైదరాబాద్‌లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు జానకి రామచంద్ర. ఛార్మినార్ వద్ద ఒక్కసారిగా రామచంద్ర కనిపించకుండా పోతాడు. మొత్తం వెతికిన జానకి కంగారు పడుతుంది. కాసేపటికి వచ్చిన రామచంద్రను చెంపదెబ్బ కొడుతుంది జానకి. గాజుల కోసం వెళ్లిన విషయం తెలియకుండా చేయి చేసుకుంటుంది.