అన్వేషించండి

Jagadhatri serial January 25th: నిషికకి సీఈవో పోస్ట్ ఇస్తానంటున్న దివ్యాంక.. సుధాకర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న మినిస్టర్! 

Jagadhatri Serial Today Episode: మినిస్టర్ కి సంబంధించిన న్యూస్ టీవీలో టెలికాస్ట్ కాకుండా చూడాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పెన్ డ్రైవ్ నేనే ఇచ్చే వాడిని కానీ నా మీద ఉన్న కోపంతో నా మొఖం కూడా చూడదేమో అని నీకు ఇస్తున్నాను పెన్ డ్రైవ్ ధాత్రికి ఇచ్చి కౌషికి కి ఇమ్మని చెప్తాడు సురేష్.

ధాత్రి: ఇది మీరు మీ ఛానల్ కి ఇచ్చుకుంటే మీ ఛానల్ రేటింగ్ పెరుగుతుంది అలాగే మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. ఎందుకు మీరు వదినకి ఇమ్మంటున్నారు అంటుంది.

సురేష్: ప్రతి ఛానల్ లో ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది కానీ ఏ రేటు లేకుండా నిజం కోసం నిలబడేది కేవలం కౌషికి మాత్రమే అంటాడు.

వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వైజయంతి వాళ్ళు వచ్చేస్తారు.

వైజయంతి: ఎంత రావద్దన్నా సిగ్గు లేకుండా ఈ ఇంటికి వస్తావేంటి అని సురేష్ ని కోప్పడుతుంది. అలాగే సీక్రెట్ గా ఇతనిని ఎందుకు కలుస్తున్నారు అని ధాత్రి దంపతులని కోప్పడుతుంది.

సురేష్: నేను దివ్యాంక ని పెళ్లి చేసుకోబోతున్నాను కౌషికి విడాకుల పత్రం మీద సంతకం పెట్టలేదు. నా ఆనందానికి అడ్డు వస్తే చూస్తూ ఊరుకోను ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని కౌషికి వైపు తిరిగి నేను చెప్పింది అర్థమైంది కదా ఇదే విషయం కౌషికి కి చెప్పు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

సురేష్ మాటల్లో అంతరార్థం అర్థం చేసుకున్న ధాత్రి వాళ్లు కౌషికి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు

ధాత్రి : అన్నయ్యకి మీరంటే ఎంతో నమ్మకం వదిన అందుకే వాళ్ల ఛానల్ ని కాదని మీకోసం వచ్చారు అంటుంది.

కౌషికి: ఇందులో నేనైతే నిజం చెప్తాననే నమ్మకం తప్పితే ప్రేమ ఎక్కడ కనిపించలేదు. అయినా మినిస్టర్ బాగోతాలు బయట పెట్టడం కోసమే తీసుకుంటున్నాను లేదంటే తీసుకునే దాన్ని కాను అని ధాత్రి దగ్గర పెన్ డ్రైవ్ తీసుకుంటుంది.

ఇదంతా దూరం నుంచి చూస్తుంది నిషిక. వాళ్ల దగ్గరనుంచి ఆ పెన్ డ్రైవ్ లాక్కోవాలనుకుంటుంది. పెన్ డ్రైవ్ తనకి కాకుండా కౌషికి కి ఇచ్చినందుకు దివ్యాంక సురేష్ ఉద్యోగం పీకేస్తే ఎక్కడ కౌషికి సురేష్ కలిసిపోతారో అనే భయంతో సురేష్ టాపిక్ తప్పించి మిగిలినదంతా దివ్యాంక కి చెప్పాలనుకుంటుంది నిషిక.

మరోవైపు సీనియర్ ధాత్రి కి ఫోన్ చేసి ఆ పెన్ డ్రైవ్ కౌషికి కి ఇమ్మని నేనే సురేష్ కి చెప్పాను. ఆ న్యూస్ టెలికాస్ట్ కాకుండా చూడాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఎలా అయినా 24 గంటల్లో ఆ న్యూస్ టెలికాస్ట్ కావాలి ఆ బాధ్యత నీదే అంటాడు. అందుకు ధాత్రి సరే అంటుంది.

మరోవైపు నిషిక జరిగిందంతా దివ్యంకకి చెప్తుంది.

దివ్యాంక : ఆ న్యూస్ ఎట్టి పరిస్థితులలోనూ కౌషికి ఛానల్ లో టెలికాస్ట్ కాకూడదు నువ్వు కనుక ఆ పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చేస్తే నీకు సీఈఓ పోస్ట్ ఆఫర్ చేస్తాను అంటుంది.

నిషిక : ఆ మాటలకి పొంగిపోయి ఎలాగైనా ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వస్తాను అంటుంది.

మరోవైపు మినిస్టర్ మీనన్ కి జరిగిందంతా చెప్పి న్యూస్ టెలికాస్ట్ కాకుండా చూడమని చెప్తాడు.

మీనన్ : యువరాజ్ కి ఫోన్ చేసి మీ అక్క దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది అది టీవీలో టెలికాస్ట్ కాకముందే ఆమె దగ్గర నుంచి ఆ పెన్ డ్రైవ్ తీసుకోవాలి అని చెప్తాడు. ఎందుకు సరే అంటాడు యువరాజ్.

మరోవైపు మినిస్టర్ సుధాకర్ కి ఫోన్ చేసి కౌషికి దగ్గర నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అవి గాని టీవీలో టెలికాస్ట్ అయితే నీ కూతురు ప్రాణాలతో ఉండదు అని బెదిరిస్తాడు.

కౌషికి : విషయం తెలుసుకొని వాడి బెదిరింపులకు లొంగను ఎలాగైనా న్యూస్ టెలికాస్ట్ చేస్తాను అంటుంది.

అయితే నిషిక, యువరాజ్ ఇద్దరూ కౌషికి కి అడ్డంపడతారు. వాళ్లు నిన్ను చంపేస్తారేమో అని భయపెడతారు

కేదార్: వాళ్ళు అలా చేయాలనుకునే లోపు నేను వాళ్ళని చంపేస్తాను అంటాడు . తను నిజం చెప్పాలనుకుంటుంది చెప్తుంది అందుకు అడ్డం వచ్చిన వాళ్ళు ఎవరైనా నేను ఊరుకోను అని కోపంగా అంటాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget