అన్వేషించండి

Jagadhatri Serial January 24th: కౌషికిపై తిరగబడిన వైజయంతి.. దివ్యాంక ఉచ్చులో చిక్కుకున్న నిషిక

Jagadhatri Serial Today Episode: కౌషికి మీద పగతో నిషికకి ఎండి సిటీ ఇచ్చిన దివ్యాంక నిషికతో ఎలాంటి అరాచకాలు చేయిస్తుందో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది. 

Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో తన తండ్రి మొదటి పెళ్లి గురించి నిషిక కి తెలిస్తే తనని వదిలి వెళ్ళిపోతుందని భయపడతాడు యువరాజ్. అందుకే ఆ విషయం నిషికకి తెలియకూడదనుకుంటాడు. ఇంతలో నిషిక రూమ్ లోకి వస్తుంది. వెంటనే చేతిలో ఉన్నది దాచేస్తాడు యువరాజ్.

నిషిక: ఎందుకంత కంగారు పడుతున్నారు, ఏదో దాచేశారు ఏంటది అని అడుగుతుంది.

ఏం లేదు అంటాడు యువరాజ్. ఇంతలో వైజయంతి అక్కడికి వస్తుంది ఇద్దరు డల్ గా ఉండటం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది.

నిషిక : నన్ను చూసి ఈయన ఏదో దాచేసారు చెప్పమంటే చెప్పటం లేదు అంటుంది.

వైజయంతి : అబ్బోడు నిజాలు దాచే మనిషి కాదు లేమ్మా చెప్పాల్సిన విషయం అయితే తనే చెప్తాడు అని చెప్పి ఇద్దరినీ భోజనానికి పిలుస్తుంది.

నిషిక : రేపు పొద్దున్న మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మరుసటి రోజు పొద్దున్న నిషిక సుధాకర్ దగ్గర ఆశీర్వచనం అడుగుతుంది.

సుధాకర్ : ఎందుకు అని అడుగుతాడు.

నిషిక: నాకు ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అంటుంది.

ధాత్రి: ఏ కంపెనీలో అని అడుగుతుంది.

నిషిక: ఛానల్ డి లో మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ అని చెప్తుంది.

యువరాజ్ వాళ్ళు ఆనందపడితే, కౌషికి వాళ్ళు షాక్ అవుతారు.

ధాత్రి : అది దివ్యాంక ఛానల్ అందులో నువ్వు పనిచేయటం ఏమిటి. నీకు జాబ్ ఇచ్చిందంటే అందులో ఏదో తిరకాసు ఉంటుంది అంటుంది.

నిషిక : ఈ ఇంట్లో నా గురించి మాట్లాడటానికి నీకు గాని నీ మొగుడికి గాని ఎలాంటి హక్కు లేదు పెట్టింది తిని పక్కన ఉండండి అంటుంది.

కౌషికి: తనకి హక్కు లేకపోవచ్చు కానీ నాకు హక్కు ఉంది కదా. నువ్వు అక్కడ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది.

వైజయంతి : ఎందుకు ఇష్టం లేదమ్మి, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుతిననివ్వదు అని తనకి నచ్చిన జాబు తనని చేసుకోనివ్వు. ఈ విషయంలో నువ్వు వద్దంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ కౌషికి పై తిరగబడుతుంది.

నిషిక : ఇకపై ఈ ఇంట్లో నేను కూడా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను నాకు దక్కాల్సిన గౌరవంలో ఎలాంటి లోటు పాట్లు జరగకూడదు అంటుంది.

సుధాకర్: అర్హత లేని వాళ్ళు హక్కుల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు నిషికకి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది దివ్యాంక.

నిషిక : మా ఇంట్లో వాళ్ళు నా అర్హతను గుర్తించలేదు కానీ నువ్వు గుర్తించి ఇంత పెద్ద పోస్ట్ ని అప్పజెప్పావు అని థాంక్స్ చెప్తుంది.

దివ్యాంక: మనలో మనకి థాంక్స్ ఏంటి మన ఇద్దరికీ శత్రువు కౌషికి. మన ఇద్దరం కష్టపడి పనిచేసే కంపెనీని ఫస్ట్ ప్లేస్ కి తీసుకు వద్దాం. ఆ కౌషికి పై దెబ్బకొడుదాం అంటుంది. మనసులో మాత్రం గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు నువ్వు నన్ను నమ్మావు. నిన్ను అడ్డం పెట్టుకొని ఆ దివ్యాంకని రోడ్డు మీదకి లాగుతాను అంటుంది.

మరోవైపు సురేష్ ధాత్రి ని కలవడం కోసం కౌషికి ఇంటికి వస్తాడు. ఎవరికైనా కనిపిస్తే గొడవ చేస్తారు అని ఎవ్వరికీ కనిపించకుండా ధాత్రి దంపతులను కలుస్తాడు.

కేదార్: ఇంత రిస్క్ చేసి మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఏదో ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది అంటాడు.

సురేష్: ఒక పెన్ డ్రైవ్ చూపించి ఇది మినిస్టర్ బ్లాక్ మనీ కి వాడు చేసిన అరాచకాలికి సంబంధించిన ఎవిడెన్స్. ప్రాణానికి తెగించి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి సంపాదించాను అంటాడు.

ధాత్రి : వీటిని పోలీసులకి ఇవ్వండి వాళ్ళే చూసుకుంటారు అంటుంది.

సురేష్: ఇది పెద్దవాళ్లకు సంబంధించిన వ్యవహారం ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోరు. అంతేకాదు ఎవిడెన్స్ వాళ్ళు చేతిలో పడిన తర్వాత మినిస్టర్ తో బేరం కుదుర్చుకుంటారు అంటాడు.

కేదార్: ఇప్పుడు ఇది ధాత్రికి ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతాడు.

సురేష్: ఇది కౌషికి కి ఇచ్చి టీవీలో టెలికాస్ట్ చేయమని చెప్పు అని చెప్తాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: నెల రోజుల ముందుగానే ఓటీటీకి వెంకటేష్‌ 'సైంధవ్‌'? స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! విహారి అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! కటకటాలపాలైన విహారి!
Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget