అన్వేషించండి

Jagadhatri Serial January 22nd: కౌషికి ఇంట్లోకి ప్రవేశించిన దివ్యాంక.. సాక్ష్యాలను యువరాజ్ తారుమారు చేస్తాడా!?

Jagadhatri Serial Today Episode: జగద్ధాత్రి వాళ్ళ మాటల ద్వారా సూరి మామ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలుసుకున్న యువరాజ్ తర్వాత ఏం చేస్తాడో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో వాళ్లు నన్ను మోసం చేసినా పర్వాలేదు నేను వాళ్లకు డబ్బు ఇస్తాను అన్నాను, ఇస్తాను. నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంది నిషిక.

కౌషికి : ధాత్రి చెప్పిన తర్వాత కూడా నీకు డబ్బులు ఇస్తానని ఎలా అనుకున్నావు అంటుంది.

నిషిక: కోపంతో రగిలిపోతూ ఇదంతా నీ వల్లే ముందు నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి పో అని ధాత్రి జుట్టు పట్టుకుంటుంది.

కేదార్: నువ్వు ఇంట్లోకి రమ్మంటే రాలేదు పొమ్మంటే పోవడానికి. అక్క పిలిస్తే వచ్చాము అక్క పొమ్మంటేనే పోతాము అని నిషిక మీద ఫైర్ అవుతాడు.

వైజయంతి : కౌషికితో పొమ్మని చెప్పమ్మా ఈరోజుతో ఇంట్లో గొడవలన్నీ సర్దుకుంటాయి అంటుంది.

కౌషికి : మాటిచ్చాను పిన్ని, పొమ్మన లేను అంటుంది.

నిషిక: నా ఆస్తివాటా ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి చందా కి వచ్చిన వాళ్ళతో నేను తరువాత  కాల్ చేస్తాను అప్పుడు రండి అని చెప్పి పంపించేస్తుంది. అత్తగారి దగ్గరికి వెళ్లి ఈ ఇంట్లో నా బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

వైజయంతి : కౌషికి దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అయినా వాళ్ళకి ఇచ్చిన గడువు ఎప్పుడో అయిపోయింది కదా అంటుంది.

మరోవైపు ధాత్రి, కేదార్ నిషిక మొండి ప్రవర్తన గురించి 
మాట్లాడుకుంటూ ఉంటారు.

ద్ధాత్రి : మోసం చేసే వాళ్ళది కాదు తప్పు, మోసపోతున్నామని తెలిసినా కూడా ఎదుటి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు వాళ్ళది తప్పు అంటుంది.

అప్పుడే అక్కడికి వస్తారు కౌషికి, సుధాకర్.

కౌషికి : కరెక్ట్ గా చెప్పావు మీరు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాను కదా నిజంగా మాదే తప్పు. గడువు ముగియటానికి ఆరు రోజులు మాత్రమే టైముంది ఇంకా ఒక్క సాక్ష్యం   కూడా తీసుకురాలేదు అందుకే ఇంట్లోంచి వెళ్లిపోండి అంటుంది.

కేదార్: ఇంట్లోంచి వెళ్తే సుధాకర్ కొడుకు గానే వెళ్తాను సాక్షాధారాలు తీసుకువస్తాను అంటాడు. అయినా అక్కకంటే తెలియదు కానీ మీకు తెలుసు కదా అని సుధాకర్ ని అడుగుతాడు కేదార్.

సుధాకర్: నాకేమీ తెలియదు అని దబాయిస్తాడు.

ధాత్రి:  ఆడిటోరియంలో జరిగిందంతా మర్చిపోయారా అని అడుగుతుంది

సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వాడిని కూడా మీరు అరేంజ్ చేసి ఉంటారు అంటాడు.

మీరు ఆవేశ పడకండి బాబాయ్ అని చెప్పి సుధాకర్ ని అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతుంది కౌషికి.

మనం ఎలాగైనా సూరి మామ దగ్గర నుంచి సాక్షదారాలు తీసుకురావాలి అనుకుంటారు ధాత్రి దంపతులు. ఆ మాటలు వింటాడు యువరాజ్. అంటే సూరి మామ దగ్గరికి వెళ్తే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అనుకుంటాడు.

మరోవైపు అత్తగారితో మన ఆస్తులు పంచేయమని మావయ్యతో చెప్పండి మనం ఆ కౌషికి కింద బ్రతకడం ఏమిటి అంటుంది నిషిక.

వైజయంతి: ఆయన కూతురు దగ్గర గట్టిగా మాట్లాడనే మాట్లాడరు. ఇంకా ఆస్తులు గురించి అడుగుతారా అంటుంది.

నిషిక : అలా అయితే ఇంట్లోంచి నేను వెళ్ళిపోతాను అంతేగాని ఇలా బానిస బ్రతుకు బ్రతుకును అంటుంది.

వైజయంతి :మీ మామ గారితో నేను మాట్లాడతాలే అని సర్ది చెప్తుంది.

మరోవైపు దివ్యాంక  కుడికాలు లోపల పెట్టి కౌషికి ఇంట్లోకి రావాలనుకుంటుంది. కానీ కౌషికి అందుకు ఒప్పుకోదు.

నిషిక:  ఒకరి దయ మీద పడి బ్రతుకుతున్నావు, నాకోసం వచ్చిన వాళ్ళని రావద్దని చెప్పటానికి నువ్వు ఎవరు అని నిలదీస్తుంది.

కౌషికి: తనకి హక్కు లేకపోవచ్చు కానీ ఇంటికి ఎవరు రావాలి రాకూడదు చెప్పే హక్కు నాకు ఉంది కదా తను ఈ ఇంటికి రావటానికి వీలు లేదు అంటుంది.

దివ్యాంక గర్వంగా ఇంట్లోకి అడుగుపెట్టి నాకు సురేష్ కి పెళ్లి అని చెప్పాను కదా ఎంగేజ్మెంట్ కి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను.

 నిషిక: ఆనంద పడిపోతూ మీరు తనని ఎంత ఇబ్బంది పెట్టినా మొదటి ఇన్విటేషన్ మనకే ఇస్తుంది తీసుకోండి అంటుంది.

కౌషికి: కోపంగా బయట వాళ్ల ముందు నోరు జారటం బాగోదని ఊరుకుంటున్నాను ఇంట్లోంచి నిన్ను బయటికి పంపించేసే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ధాత్రి: ఎందుకు వదినని బాధపెట్టి ఆనందపడతావు అంటుంది.

నిషిక : నా ఇంట్లో నన్ను నిలదీయడానికి నీకేం హక్కు ఉంది అంటుంది.

ధాత్రి : మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు.

అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget