అన్వేషించండి

Jagadhatri December 29th Episode: తండ్రికి వార్నింగ్ ఇచ్చిన యువరాజ్.. ధాత్రి, కేధర్ లను ప్రశ్నించిన కౌషికి!

Jagadhatri Today Episode: కేదార్ కి తండ్రి నువ్వే అని తెలిస్తే మా ఇద్దరి లో ఎవరో ఒకరే బ్రతుకుతారు అని యువరాజ్ తండ్రికి వార్నింగ్ ఇవ్వడం తో సుధాకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.

Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నిజం చెప్పు ఆ కేదార్ నీ కొడుకే కదా అని తండ్రిని నిలదీస్తాడు యువరాజ్.

కౌషికి : యువరాజ్ చెంప పగలగొడుతుంది. ఆయనతో ఇంకొకసారి వాయిస్ రైజ్చేసి మాట్లాడితే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది.

యువరాజ్: గన్ బయటికి తీసి నువ్వు తప్పు చేసావు అనటానికి నా దగ్గర సరైన ఆధారాలు లేవు ఒకవేళ ఉంటే మాత్రం ఈ గన్ లో ఉన్న బుల్లెట్ ఎవరి గుండెల్లో దిగుతుందో తెలియదు. ఆ కేదారో, నేనో మా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే మిగులుతాము అని తండ్రికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఇదంతా చూస్తున్న ధాత్రి దంపతులు యువరాజ్ మూర్ఖత్వానికి బాధపడతారు. బయటికి వెళ్ళిపోతున్న యువరాజ్ ని ఏం జరిగింది అని అడుగుతారు నిషిక, వైజయంతి. వాళ్ల మీద చిరాకు పడుతూ బయటికి వెళ్లిపోతాడు యువరాజ్.

వైజయంతి : లోపలికి వస్తూ ఏం జరిగింది? ఎందుకు అబ్బోడు కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది.

కౌశికి : బిజినెస్ విషయంలో బాబాయ్ కి యువరాజ్ కి మాట మాట పెరిగింది అందుకే కోపంగా వెళ్ళిపోతున్నాడు అంటూ సుధాకర్ విరిగిపోయిన ఫోటోని తీసుకుని వెళ్ళిపోబోతుంది.

నిషిక : ఆ ఫోటో ఏంటి నేను చూస్తాను.

కౌశికి : ఇది బాబాయ్ చిన్నప్పటి ఫోటో ఇందులో చూడ్డానికి ఏముంది వద్దులే అంటుంది.

అయినా నిషిక పట్టుబట్టడంతో ఇది బిజినెస్ కి సంబంధించిన విషయం బయట వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది కౌషికి.

నిషిక : నేను బయటిదాన్నా ఆ మాటకొస్తే మీరు బయట మనిషి. గొడవ జరిగింది నా భర్తకి, నా మామ గారికి మధ్యన ఏం జరిగిందో తెలుసుకునే రైట్స్ నాకు ఉన్నాయి మీ అధికారం ఎక్కడ వరకు చూపించాలో అక్కడ వరకే చూపించండి అని పొగరుగా మాట్లాడుతుంది.

అప్పుడే ధాత్రి వాళ్ళు ఏం జరిగింది అనుకుంటూ ఏమీ తెలియనట్లుగా కిందికి వస్తారు.

నిషిక: ఇంట్లో గొడవ జరిగింది ఏం జరిగింది అని అడిగితే వదిన ఏవేవో మాట్లాడుతుంది అంటుంది.

కౌషికి : తెలివిగా  మాట్లాడుతున్నాను అనుకోకు అంటూ నిషిని కోప్పడుతుంది.

ఇంట్లో జరిగిన గొడవలు చాలు ఇంకాపండి అని కోప్పడతాడు సుధాకర్.

కౌశికి : బాబాయ్ ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను మీరేమీ భయపడకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మిగిలిన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక సుధాకర్ ధాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి నీకు కావాల్సింది ఇదే కదా, ఇందుకే కదా మీరు ఇక్కడికి వచ్చింది నా కుటుంబం ముక్కలైపోతుంది దయచేసి మీరు ఇంట్లోంచి వెళ్లిపోండి అని చేతులు జోడిస్తాడు.

ధాత్రి : ఒక్కరోజు మీ కొడుకు మిమ్మల్ని నిలదీశాడని మీరు ఇంతలా బాధపడుతున్నారు, అలాంటిది కేదార్ ని నీ తండ్రి ఎవరు ఎందుకు మిమ్మల్ని వదిలేసాడు అని బయటి వాళ్లు ప్రశ్నిస్తున్నప్పుడు అతను పడిన బాధ మీకు అర్థం కావడం లేదా, బాగా ఆలోచించండి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని చెప్పి భర్తను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

తర్వాత తమ గదిలో కూర్చుని యువరాజ్ ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ధాత్రి దంపతులు. మనకి తెలియకుండా మనల్ని ఫాలో అయ్యి సూరి మామ ఇంటికి వచ్చినట్లు ఉన్నాడు అనుకుంటారు. ఇంతలో వాళ్ళ డోర్ ఎవరో కొట్టడంతో ద్ధాత్రి వెళ్లి తలుపు తీస్తుంది. కౌషికి  లోపలికి వస్తుంది.

కౌషికి : ఇంట్లో సమస్యలు చూస్తున్నారు కదా, ఈ నింద అబద్ధం అయితే బాబాయ్ పరిస్థితి  ఎలా ఉంటుందో అంటుంది.

కేదార్: అలాంటి పరిస్థితి వస్తే నా ప్రాణాలు అడ్డు వేస్తాను.

కౌషికి : సమస్యని మీరే సృష్టించి మీరే ఏ ప్రాణాలు అడ్డువేస్తానంటున్నారు అంటుంది. అయినా నేను వచ్చింది అందుకు కాదు మీ పెళ్లి ఎక్కడ జరిగింది అని సడన్ గా పెళ్లి టాపిక్ తీసుకువస్తుంది. మీ పెళ్లికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతుంది.

ధాత్రి: మేము ఫోటోలు తీయించుకోలేదు అంటుంది.

కౌశికి : పోనీలెండి నా దగ్గర వీడియో ఉంది చూపిస్తాను చూడండి అనడంతో ధాత్రి దంపతులు ఇద్దరు షాక్ అవుతారు.. నా మెడలో నేనే తాళి వేసుకోవడం చూసిందేమో అనుకుంటుంది ద్ధాత్రి.

కానీ ఆ సీసీ ఫుటేజ్ లో ఆ ఒక్క సీన్ మాత్రం ఉండదు. అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది కౌషికి. రేపు నల్లపూసల ఫంక్షన్ లోపు మీ ఇద్దరికీ పెళ్లి అయిందని ఆధారం నాకు తీసుకొని రండి.. లేదంటే మీరు చెప్పిన ఏ నిజాన్ని కూడా నేను నమ్మను. ఎందుకంటే పెళ్లి విషయంలోనే మీరు అబద్ధం చెప్పారంటే మిగిలిన విషయాలలో అబద్ధం చెప్పటానికి వెనకాడరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: దిల్ రాజు బ్యానర్‌లో ‘బేబీ‘ బ్యూటీకి ఛాన్స్, ఆశిష్ తో వైష్ణవి చైతన్య రొమాన్స్

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget