అన్వేషించండి

Jagadhatri Serial Today March 30th: శ్రీవల్లిని దత్తతు అడ్డుకోవడానికి వైజయంతి చేసిన సాహసం ఏంటి..? ఇంతకీ శ్రీవల్లిని దత్తతు తీసుకున్నారా లేదా..?

Jagadhatri Serial Today Episode March 30th:శ్రీవల్లిని దత్తతు తీసుకుంటానన్న సుధాకర్‌...అడ్డుకోవడానికి నిషిక వాళ్లు వేసిన ప్లాన్ అడ్డుకున్న జగధాత్రి

Jagadhatri Serial Today Episode: శ్రీవల్లి దత్తతు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయగా...జగధాత్రి అదే పనిగా ఆలోచిస్తుంటుంది. ఏమైందని కేదార్ అడగ్గా...ఇన్నాళ్లు శ్రీవల్లిని అత్తయ్యగారు అసహ్యించుకున్నా...యువరాజు మాత్రం చెల్లిగానే ఆదరించాడని అంటుంది. కానీ ఇప్పుడు కనీసం శ్రీవల్లిని చూస్తేనే కోపంతో రగిలిపోతున్నాడు ఎందుకోనని అంటుంది. అది కూడా అనాథ ఆశ్రమం నుంచి మేనేజర్ వచ్చి వెళ్లిన నాటి నుంచే ఇలా చేస్తున్నాడని చెప్పడంతో కేదార్‌ కూడా నిజమేనంటాడు. నాకు తెలిసి శ్రీవల్లి తల్లి ఫొటోనే యువరాజు బెదిరించి మార్పించి ఉంటాడని ధాత్రి అంటుంది. 

ఆరోజు కూడా మేనేజర్‌ ఫొటో తీసుకురమ్మని అసిస్టెంట్‌కు చెప్పినప్పుడు కూడా యువరాజు ఇంట్లో లేడని...ఖచ్చితంగా  దారికాచి యువరాజు ఫొటో మార్పించి ఉంటాడని అంటుంది. అయితే అసలు శ్రీవల్లి తల్లి ఫొటో ఇక్కడే ఇంట్లో ఉండి ఉండాలని జగధాత్రి చెబుతుంది. ఇప్పుడు శ్రీవల్లి దత్తత కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వీళ్లంతా ఇక్కడే ఉంటారని...మనం వెళ్లి నిషిక రూమ్‌లో వెతికితే ఫొటో దొరుకుతుందని చెప్పడంతో ఇద్దరూ కలిసి నిషిక రూమ్‌కు వెళ్తారు. అక్కడ అన్నిచోట్ల ఫొటో కోసం వెతుకుతుంటారు. మొగుడు, పెళ్లాలిద్దరూ కనిపించకుండాపోవడంతో నిషికకు అనుమానం వస్తుంది. వాళ్లను వెతుక్కుంటూ ఇద్దరూ తమ గదిలోకి వెళ్తారు. అప్పుడే ధాత్రికి ఫొటో దొరుకుతుంది కానీ అది చూడదు. 

అప్పుడే అక్కడికి వచ్చిన నిషిక ఆ ఫొటో లాక్కుంటుంది. ఇద్దరూ గొడవపడుతుండగా....ఆ ఫొటో ఎగిరి టేబులు కిందపడిపోతుంది. ఎందుకు ఈ రూమ్‌లోకి వచ్చారని యువరాజు నిలదీయగా...శ్రీవల్లి అసలు తల్లి ఎవరో కనుక్కునేందుకు వచ్చామని చెబుతారు. దీంతో నలుగురు గొడవపడుతుండగా...కౌషికి అక్కడికి వస్తుంది. కింద దత్తతు కార్యక్రమం జరుగుతుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని నిలదీయగా...అందరూ కిందకు వచ్చేస్తారు.

సుధాకర్‌ శ్రీవల్లిని దత్తత తీసుునేందుకు పూజలో కూర్చుండగా....నిషిక, యువరాజు ఆందోళన చెందుతుంటారు. నేను బతికి ఉన్నంత వరకు ఈ కార్యక్రమం జరగనివ్వనని....మీరు ఏం కంగారుపడొద్దని చెప్పి వైజయంతి వెళ్లి పూజలో కూర్చుంటుంది. ఈ కార్యక్రమం ఆపేందుకు వీళ్లు ఏం చేయడం లేదని కేదార్‌ అనగా....అత్తయ్యగారు అంత కంగారుగా లేరంటే ఆమె ఏదో ప్లాన్ వేసి ఉంటుందని ధాత్రి అంటుంది. 

ఇంతలో ఉన్నట్టుండి వైజయంతి నోటిలో నురగతో పడిపోతుంది. ఏం జరిగిందని చూడగనా ఆమె విషం తాగుతుంది. తనకు ఈ దత్తతు కార్యక్రమం ఇష్టం లేదని...అందుకే చనిపోవాలని అనుకున్నట్లు చెబుతుంది. దీంతో కంగారుపడిన సుధాకర్‌...నేను శ్రీవల్లిని దత్తతు తీసుకోనని మాట ఇవ్వడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తారు.

ఆస్పత్రి బయట శ్రీవల్లిపై యువరాజు, నిషిక మండిపడతారు.ఈ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని గొడవలే జరుగుతున్నాయని అంటారు. అత్తయ్యగారికి ఏమైనా అయ్యిందంటే దానికి ఈ శ్రీవల్లియే కారణమని అంటారు. దీంతో శ్రీవల్లి చాలా బాధపడి ఏడుస్తుంది. ఇంతలో జగధాత్రి కలుగజేసుకుని ఇందులో తన తప్పేముందని ప్రశ్నిస్తుంది. దీంతో యువరాజు కోపంతో మరింత రెచ్చిపోతాడు. 

అసలు మీరు ఎవరు మాట్లాడటానికి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. కేదార్‌ను కొట్టడానికి అతని మీదకు యువరాజు వెళ్లగా....జగధాత్రి యువరాజును తోసేస్తుంది. కౌషికి కలుగజేసుకుని అసలు ఇక్కడ ఏం జరుగుతోందని మండిపడుతుంది. ఒకపక్క పిన్ని ప్రాణాపాయస్థితిలో ఉంటే... మీరు ఇక్కడ కొట్టుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినా వాళ్లు ఇక్కడ ఉంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటని సుధాకర్‌ కొడుకుపై కోపం వ్యక్తం చేస్తాడు. 

వీళ్లంతా ఆస్తికోసమే నాటకాలు అడుతున్నా మీకు ఎందుకు అర్థం కావడం లేదని నిషిక...సుధాకర్‌ను నిలదీస్తుంది. శ్రీవల్లి కలుగజేసుకుని నేను ఆస్తికోసం రాలేదు అన్నయ్య అని యువరాజు దగ్గరకు వెళ్తుంది. నన్ను అన్నయ్య అని పిలవొద్దని చెప్పాను కదా అంటూ ఆమెపై యువరాజు చేయిచేసుకోవడంతో కేదార్ కలుగుజేసుకుని యువరాజు చొక్కా పట్టుకుంటాడు. ఇంతలో డాక్టర్‌ వచ్చి వైజయంతికి బాగానే ఉందని చూడొచ్చని చెప్పగా...అందరూ లోపలికి వెళ్తారు.అక్కడ శ్రీవల్లి కనిపించకపోయేసరికి ఆమెను వెతుకుతూ కేదార్‌, ధాత్రి వెళ్తారు.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Embed widget