అన్వేషించండి

Jagadhatri Serial Today July 2nd Episode: జగద్ధాత్రి సీరియల్: విక్కీ ఆకతాయి చేష్టలు.. ఆటకట్టించిన జేడీ.. సంచలన నిజాలు బయటపెట్టిన బసిరెడ్డి

Jagadhatri Today Episode ప్రతిపక్ష నేత బసి రెడ్డి రావడం తాయారు గతంలో చేసిన నేరాలు గురించి చెప్పడం అందులో జేడీ తల్లి కేసు కూడా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode తాయారుకి హోంమంత్రి పదవి ఇవ్వడంతో అందరూ ఇంటికి వచ్చి కృతజ్ఞతలు చెప్తారు. తాయారు కొడుకు ఫుల్‌గా తాగుతూ ఉంటాడు. తల్లిని పిలిచి నాన్నని చంపినవాళ్లు ఇక్కడి వస్తారు. ఈ రోజు వాళ్లని నేను చంపాలని అన్నావ్ వస్తున్నారా నేనే చంపేస్తా అని ఊగిపోతూ ఉంటాడు. 

తాయారు కొడుకుతో నువ్వు చంపుతావ్ వస్తున్నారు అని అంటుంది. పోలీసుల్ని చంపేస్తే కేసు అవుతుందని తాయారు తమ్ముడు అంటే దానికి విక్కీ ఏంటి మామ నువ్వు నాన్న దగ్గర ఇన్ని రోజులు ఉన్నావ్ కదా ఏం నేర్చుకోలేదా.. పోలీసుల్ని నువ్వు చంపితే కేసు అవుతుంది కానీ నేను చంపితే ఎందుకు అవుతుంది అని పిచ్చోడిలా నటిస్తాడు. తాయారు తమ్ముడితో విక్కి అందరి ముందు పిచ్చోడిలా ఉంటాడని అంటుంది. (విక్రమార్కుడు సినిమాలో పోలీస్ క్యారెక్టర్‌లో ఉన్న రవితేజతో విలన్ కొడుకు పిచ్చోడిలా చంపాలని ప్లాన్ చేసినట్లు జేడీని చంపాలని తాయరు కొడుకు విక్కీతో కలిసి ప్లాన్ చేస్తుంది) 

విక్కీతో అతని మామ నీ ప్లాన్స్ అన్నీ జేడీ కాంపౌండ్‌లో అడుగు పెట్టనంత వరకే తను అడుగు పెడితే మొత్తం తన కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది అంటాడు. ఇక జేడీ, కేడీ, సాధు సార్ బొకే తీసుకొని తాయారు దగ్గరకు వస్తారు. బొకే ఇచ్చి విష్ చేస్తారు. తాయారు జేడీతో ఏంటి జేడీ నన్ను ఇలా చూస్తానని ఊహించలేదు కదా అని అంటుంది. దాంతో జేడీ మన తర్వాత మీటింగ్ జైల్‌లో ఉంటుంది అనుకున్నా కానీ ఇలా ఉంటుంది అనుకోలేదు అని కౌంటర్ ఇస్తుంది. జేడీ తీసుకొచ్చిన బొకేని విక్కీ లాక్కొని తీసుకెళ్లి కాళ్ల కింద నలిపేసి పువ్వులు బాలేవు బొకే బాలేదు అని చిందరగా ప్రవర్తించి జేడీ దగ్గరకు వెళ్లి నువ్వు కూడా నచ్చలేదు అంటాడు. దాంతో జేడీ విక్కీ చేయి పట్టుకొని మెల పెట్టేస్తుంది. 

తాయారు విక్కీ తన కొడుకు అని చెప్తే ఎవడో పిచ్చోడు అనుకున్నా అని అంటుంది జేడీ. తాయారు జేడీతో నా మొగుడుని చంపారు.. నా కొడుకుని కొట్టారు మిమల్ని వదలను అంటుంది. ఇక తాయారు నేను మీ టీమ్ కదా ఆ ముసుగులు తీయమని జేడీ కేడీలకు  చెప్పమని సాధుసార్‌కి చెప్తే వాళ్లు ఎవరు అనేది ఎవరికీ తెలీకూడదు అనే ఇలా చేశాం మా టీంతప్ప ఇంకెవరికీ తెలీకూడదు అని సాధు సార్ అంటాడు. తాయారు జేడీతో నీ తెలివి నాకు బాగా నచ్చింది నువ్వు నా మొగుడిని చంపకపోయి ఉంటే నీతో దోస్తానా చేసేదాన్ని అంటే క్రిమినల్స్‌తో నేను ఫ్రెండ్‌షిప్ చేయను అరెస్ట్ చేస్తా అంటుంది. 

విక్కీకి తాయారు జ్యూస్ తెప్పిస్తుంది. విక్కీ తాగినట్లు నటించి గుర్రం బొమ్మకి తాగిస్తానని చెప్పి కేథార్ మీద విసిరేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. జేడీ కొట్టడానికి లేస్తే సాధు ఆపేస్తారు. తర్వాత మళ్లీ విక్కీ జ్యూస్‌ అడిగి ఈ సారి సాధుని చూసి నాకు ఈయన నచ్చేలేదు అని అతని మీద విసిరేస్తాడు. జేడీ మళ్లీ అవేశంగా లేస్తే సాధుసార్ ఆపేస్తారు.  కోపంగా జేడీ బయటకు వెళ్లిపోతుంది. ఇంకో జ్యూస్‌ తీసుకొచ్చిన విక్కీ జేడీ మీద వేయాలని అనుకుంటాడు. 

జేడీ బయటకు వెళ్లి తాయారు కొడుకుని అడ్డు పెట్టుకొని మనల్ని అవమానిస్తుంది. నా ముందే సాధుసార్‌ని అవమానించింది అంటే నేను ఊరుకుంటే నా యూనిఫాంకే విలువ ఉండదు అని రమ్యకి చెప్పి ఆవేశపడుతుంది. ఇక సాధుసార్తో కేథార్ జేడీని ఎక్కువ సేపు ఆపలేం సార్ అని చెప్తాడు. సాధు కూడా అదే అని తొందరగా వెళ్లిపోదాం అంటాడు. జేడీ బయట గేట్‌ పట్టుకొని కోపంగా ఉంటే విక్కీ జేడీ మీద జ్యూస్ పోయడానికి వెళ్తాడు. జేడీ సైడ్ నుంచి చూసి సడెన్‌లే తప్పుకొని విక్కీ కాళ్లకి అడ్డంగా కాలు పెడుతుంది. దాంతో విక్కీ గేటు మీద పడి గుద్దుకుంటాడు. విక్కీకి చాలా రక్తం వస్తుంది. తాయారు వచ్చి నా కొడుకుని కొట్టి ఇలా చేసింది జేడీతో సారీ చెప్పించు అని సాధుసార్‌కి చెప్తే పళ్లు రాలిపోతాయ్ అని జేడీ అంటుంది. ఏమన్నావ్ అని తాయారు అంటే అదే మీ కొడుకుకి పళ్లు రాలాయేమో చూసుకోండి అని అంటుంది.

జేడీ సాధుసార్‌తో ఆమె మినిస్టర్ అయి ప్రజల్లో ఉండకూడదు జైలులో ఉండాలి నేను వదలను అంటుంది. కాచి, బూచిలు పవన్‌కి డబ్బులు ఇచ్చి ఇంకా ఉద్యోగం ఇవ్వలేదని టెన్షన్ పడతారు. కేథార్, జగద్ధాత్రిలకు చెప్దాం అంటే వాళ్లకి ఇలా బ్యాక్ డోర్ నుంచి వెళ్లడం ఇష్టం ఉండదు అని అనుకుంటారు. పవన్‌ లుంగీ కట్టుకొని డ్యాన్స్‌లు వేస్తుంటాడు. బూచి కాల్ చేస్తే పది నిమిషాల్లో ఫోన్ చేయిస్తా అని అంటాడు. ఒక ఫేక్ లేడీతో ఇంటర్యూ చేయిస్తాడు. ఆఫర్ లెటర్ వస్తుందని చెప్తాడు. కాచి బూచి ఇద్దరూ బూచికి జాబ్ వచ్చేసిందని నెలకి రెండు లక్షలు వస్తాయని గెంతులేస్తారు. పవన్ మళ్లీ కాల్ చేసి ఇంకో పది లక్షలు కట్టాలి అని చెప్తాడు. బూచి సరే అంటాడు. 

తాయారు కొడుకుకి జేడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటుంది. ఇక మీనన్‌ని ఇంటికి తీసుకొస్తానని అంటే విక్కీ వద్దని ఇంకా మంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయలేదు అని అంటాడు. దాంతో తాయారు ఎవరికీ తెలీకుండా మీనన్‌ని ఇంటికి తీసుకొచ్చి పెడతా మీనన్ జేడీని ఎవరికీ తెలీకుండా చంపేస్తాడని అంటుంది. వెంటనే తాయారు మీనన్‌కి కాల్ చేస్తుంది. జేడీని చంపడానికి రమ్మని చెప్తే ఇప్పుడు కాదని వద్దని అంటుంది. ఇక ప్రతిపక్ష పార్టీ నేత బసిరెడ్డి తాయారు డౌన్ డౌన్ అని వస్తాడు. ఆ విషయం తాయారు మీనన్‌కి చెప్తే ఎలాగోలా బసిరెడ్డి  అరెస్ట్ అయ్యేలా చేయ్ నేను రేపు మీ ఇంటికి బసిరెడ్డి కార్యకర్తగా ఎవరికీ తెలీకుండా వస్తా జేడీని చంపేస్తా అంటాడు. తాయారు సూపర్ ప్లాన్ అని ఒకే చెప్తుంది. 

బసిరెడ్డి రావడం చూసిన తాయారు జేడీతో బసిరెడ్డి నా ప్రాణాలు తీయడానికి వెనకాడడు నువ్వే కాపాడాలి అంటుంది. బసిరెడ్డి మినిస్టర్ డౌన్ డౌన్ అని వస్తాడు. జేడీ కేడీలు బసిరెడ్డిని ఆపుతారు. తాయారు కావాలనే బసిరెడ్డిని రెచ్చగొడుతుంది. దాంతో బసిరెడ్డి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీకు అయినా గుర్తు లేదా. నీకు మనిస్టర్ కుర్చీలో కూర్చొనే అర్హతే లేదు అంటారు. దాంతో తాయారు సాక్ష్యాలు లేవు అని అంటుంది. దాంతో బసిరెడ్డి నువ్వు ఇప్పుడు చేసిన నేరాలకు సాక్ష్యాలు లేకపోయినా పాతికేళ్ల క్రితం చేసిన నేరానికి సాక్ష్యాలు ఎక్కడో ఒక చోట బతికే ఉంటాయ్. ఏంటి గుర్తొచ్చిందా..పాతి కేళ్ల క్రితం చిన్న కేసుతో మొదలైన నీ నేరచరిత్ర మర్చిపోయావా. ఆర్కేయాలజీ ఆఫీసర్‌తో మొదలైన కేసులు నాతో ఆగుతాయి అనుకుంటున్నావా అంటాడు. 

జేడీ ఆయన దగ్గరకు వెళ్లి ఆర్కేయాలజీ కేసా ఏంటి అని అడుగుతుంది. తాయారు ఆ విషయాలు ఇప్పుడు వద్దు అని బసిరెడ్డిని బెదరిస్తుంది. ఇన్‌స్పెక్టర్ కావ్య చావుకి కారణం నువ్వు అని తెలిసినా ఎలా మర్చిపోగలను తాయారు.. ఇంకా ఆ ఫ్యామిలీ మోస్తున్న నింద  మనం మర్చిపోవచ్చు కానీ కాలం మర్చిపోదు అంటారు. జేడీ మనసులో అమ్మ కేసు గురించి మాట్లాడుతున్నారు అంటే అతని అమ్మ గతం తెలుసుంటుందని అనుకుంటుంది. జేడీతో కేథార్‌ అతను చెప్పిన దాని ప్రకారం అత్తయ్య కేసుకి తాయారుకి సంబంధం ఉందని అంటాడు.  అత్తయ్య చావుకి కారణం అయి అందరికీ శిక్ష పడేలా చేయాలి అంటాడు. తాయరు సాధుతో తనకు జేడీ కేడీలు బందోబస్తుకి కావాలని బసిరెడ్డి అరెస్ట్ అవడంతో వాళ్ల కార్యకర్తలు గొడవకు వస్తారని అంటుంది. జేడీ తన టీమ్ ఉంటుందని మాకు పెండింగ్ కేసులు ఉన్నాయని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Itlu Me Yedhava Trailer : ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
Ajith Kumar : 'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్
'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్
Amazing Train Journey Routs in India: జీవితంలో ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిన ఇండియన్ రైలు మార్గాలు ఇవే! ఎడారి, జలపాతాలు, సముద్రం, మంచు కొండలు ప్రతీ ప్రయాణం ఒక అద్భుతమే!
జీవితంలో ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిన ఇండియన్ రైలు మార్గాలు ఇవే! ఎడారి, జలపాతాలు, సముద్రం, మంచు కొండలు ప్రతీ ప్రయాణం ఒక అద్భుతమే!
November Birthday Calender: ఐశ్వర్య , షారుఖ్, టబు సహా నవంబర్ లో సినీ తారల పుట్టిన రోజుల లిస్ట్ ఇదిగో!
ఐశ్వర్య , షారుఖ్, టబు సహా నవంబర్ లో సినీ తారల పుట్టిన రోజుల లిస్ట్ ఇదిగో!
Embed widget