Jagadhatri Serial Today July 15th: జగద్ధాత్రి సీరియల్: వైజయంతికి తాయారు బంపర్ ఆఫర్.. కావ్య మర్డర్ కేసులో జేడీకి తెలిసిన లీడ్
Jagadhatri Today Episode మినిస్టర్ తాయారు వైజయంతికి ఎమ్మెల్యే పదవి ఇస్తానని చెప్పడం జగద్ధాత్రి వ్యతిరేకించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode తాయారు జగద్ధాత్రితో ఇన్‌స్పెక్టర్ కావ్య కూతురు నువ్వే కదా అని అడుగుతుంది. దాంతో అవును అని జగద్ధాత్రి అంటుంది. విక్కీ కోపంగా నువ్వేనా మా నాన్నని చంపింది అని జగద్ధాత్రి మీదకు పిల్లో విసురుతాడు. పిచ్చి బాగా ముదిరినట్లు ఉందని కేథార్ అంటే కేథార్‌ని కొట్టడానికి విక్కీ వస్తాడు. దాంతో జగద్ధాత్రి ఒక్క తోపు తోస్తే విక్కీ సోఫాలో పడతాడు.
నిషిక, వైజయంతి, యువరాజ్ అందరూ జగద్ధాత్రిని చివాట్లు పెడతారు. తాయారు జగద్ధాత్రితో వాళ్ల నాన్న చావుకి కారణం అయ్యేవారిని చూసి ఇలాగే రియాక్ట్ అవుతాడు అని చెప్తుంది. తాయారుని ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పి కౌషికి ఫ్యామిలీని పిలుస్తుంది. తర్వాత తమ పార్టీ తరఫున వైజయంతిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్నాం అని చెప్తుంది. వైజయంతి వాళ్లు సంతోషపడితే జగద్ధాత్రి,కేథార్ షాక్ అయి ఎందుకు అని అడుగుతారు. దానికి తాయారు వజ్రపాటి ఫ్యామిలీని పరపతి అది అని అంటారు. జగద్ధాత్రి అడ్డుపడితే యువరాజ్ జగద్ధాత్రి వాళ్లని ఉద్దేశించి అలగా జనం అంటాడు. పరువు మర్యాద గురించి మీకు ఎలా తెలుస్తుందిలే ఈయనకు తండ్రి ఎవరో తెలీదు.. ఆవిడ గారి తల్లి పోతూ పోతూ మా ఇంటి పరువు తీసిందని నిషిక జగద్ధాత్రి, కేథార్‌లను ఉద్దేశించి అంటుంది. మా అమ్మ నిజాయతీ పరురాలు తన గురించి తప్పుగా అనొద్దని జగద్ధాత్రి అంటుంది.
తాయారు జగద్ధాత్రితో మీ అమ్మ అవినీతి పరురాలు అనడానికి సాక్ష్యం నేనే అని అంటుంది. అప్పుడు మీ అమ్మ మీ ఇంటి పరువు తీస్తే ఇప్పుడు నువ్వు ఈ ఇంటి పరువు తీస్తున్నావు. మీ అమ్మ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయ్.. తన చుట్టూ ఉన్న ఆఫీసర్లను మోసం చేసింది.. లంచం తీసుకుంటూ దొరికిపోయింది ఆ న్యూస్ పేపర్‌లో కూడా వచ్చింది వెళ్లి చూసుకో అని తాయారు అంటుంది.ఎప్పుడు న్యూస్ వచ్చిందని జగద్ధాత్రి అడిగితే 20 ఏళ్ల క్రితం అని చెప్తుంది. వైజయంతి పోటీ చేస్తుందని కౌషికి అందరితో చెప్తుంది.
జగద్ధాత్రి కోపంగా వెళ్లిపోతుంది.
జగద్ధాత్రి తన తల్లి గురించి మినిస్టర్ మాట్లాడిన మాటలకు బాధ పడుతుంది. కౌషికి జగద్ధాత్రి దగ్గరకు వచ్చి నిజం ఎవరికీ తెలీదని నిజం గతంలో కలిసి పోయిందనే నమ్మకంతో ఆవిడ అలా మాట్లాడిందని అందుకే నేను కష్టమైనా నా చానెల్‌లో నిజమే మాట్లాడుతానని కౌషికి అంటుంది. కేథార్ వాళ్లతో పేపర్‌లో న్యూస్ వచ్చిందని చెప్పింది కదా ఆవిడ ఏదో దాస్తుందని అంటుంది. దాంతో జగద్ధాత్రి అంత పాత పేపర్ దొరకడం కష్టం కదా మీరు ఆ పేపర్ కోసం ప్రయత్నించండి అని జగద్ధాత్రి కౌషికికి చెప్తుంది. కౌషికి ఎలా అయినా సంపాదిస్తానని అంటుంది.
జగద్ధాత్రికి కిరణ్ కాల్ చేసి ప్రతి పక్ష నేత బసిరెడ్డి విడుదల అయ్యాడని చెప్తాడు. తాయారు గురించి తెలుసుకోవాలంటే బసి రెడ్డిని కలవాలని అనుకుంటారు. ఇక మినిస్టర్ వైజయంతి, నిషిక, యువరాజ్‌వాళ్లతో జగద్ధాత్రి, కేథార్‌లను ఇంటి నుంచి గెంటేయమని అందుకు ముందు జగద్ధాత్రి, కౌషికి, సుధాకర్‌లను విడగొట్టమని చెప్తుంది. మినిస్టర్ ఇచ్చిన ఆఫర్‌ని చక్కగా వాడుకోవాలని యువరాజ్ వాళ్లు అనుకుంటారు. జేడీ, కేడీలు బసిరెడ్డిని కలుస్తారు. తాయారు గురించి అడుగుతారు. ఇన్‌స్పెక్టర్ కావ్య గురించి కావ్య మర్డర్ గురించి అడుగుతారు. నేను ఎందుకు చెప్పాలి అని బసి రెడ్డి అడిగితే దానికి జేడీ మేం యూనిఫాం అమ్ముకునేవాళ్లం కాదు మేం కూడా తాయారుని మీలా మినిస్టర్ పదవి నుంచి తీసేయాలి అనుకుంటున్నాం అంటారు. దాంతో బసి రెడ్డి తాయారు గురించి చెప్తాడు. తాయారు చిన్న చిన్న దొంగతనాలు చేసి పని మనిషిగా చేసింది. హత్యలు చేసి క్రిమినల్స్‌తో పని చేసి అప్పటి కార్పొరేటర్‌తో ప్రేమలో ఉండి అన్ని ఇల్లీగల్ పనులు చేసిందని మీనన్‌తో కలిసి పని చేసి అన్ని నిజాలు తెలుసుకున్న కావ్యని అందరూ కలిసి దారుణంగా చంపేశారని ఆవిడ ప్రాణంగా చూసుకునే యూనిఫాంకి అవినీతి అంటకట్టారని అంటాడు.
కేథార్ సాక్ష్యాలు అడుగుతాడు. ఏం తెలీదని బసి రెడ్డి అంటారు. తాయారు తను చేసే తప్పు పక్క వారికి కూడా తెలీకుండా జాగ్రత్త పడుతుందని అంటారు. కేవలం ఒకే ఒక్కరు మీకు సాయం చేయగలరు అని ఓ పాత పేపర్‌ని జేడీ, కేడీల ముందు పెడతారు. అందులో కావ్య లంచం తీసుకుంటూ దొరికిపోయిన కావ్య అని పేపర్‌లో వస్తుంది. ఆ న్యూస్ అబద్ధం అని జేడీ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?





















