అన్వేషించండి

Jagadhatri Serial Today January 8th:మధు పిల్లాడిని తీసుకెళ్లిన బామ్మను కేడీ, జేడీ కనిపెట్టారా..? తప్పిపోయిన పిల్లాడు తల్లిఒడికి చేరాడా లేదా..?

Jagadhatri Serial Today Episode January 8th: మధు పిల్లాడిని ఎత్తుకెళ్లిన బామ్మ అడ్రస్‌ దొరకడంతో జేడీ,కేడీ అక్కడికి వెళ్లి విచారణ చేస్తారు. అప్పుడే అక్కడికి పిల్లాడిని ఎత్తుకుని ఓ యువతి వస్తుంది.

Jagadhatri Serial Today Episode: మాధురి బాబు కోసం జగధాత్రి, కేదార్‌, కౌషికి వెళ్లి సీసీ ఫుటేజ్ చూస్తారు. అక్కడ వారికి ఓ బామ్మ సంచులు తీసుకెళ్తూ అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఆ బామ్మ ఎందుకొచ్చింది. ఏం తీసుకెళ్లిందోనని జనరల్‌వార్డుకు వెళ్లి ధాత్రి తనిఖీ చేస్తుంది. సెక్యూరిటీని అడిగితే ఎవరిని కలవడానికి వచ్చిందో చెప్పలేదని చెబుతాడు. దీంతో ఖచ్చితంగా ఆ బామ్మే బాబును తీసుకెళ్లి ఉంటుందని అనుమానిస్తారు. పోలీసులకు విషయం చెబితే వాళ్లే చూసుకుంటారని కేదార్ అంటాడు. యువరాజు ఫోన్ చేయడంతో పోలీసులు సైతం అక్కడికి వస్తారు. ధాత్రి చూపించిన భామ్మ ఫొటో తీసుకుని ఎస్‌ఐ అన్నిస్టేషన్లకు పంపి డిటైల్స్‌ తెప్పిస్తామని చెబుతాడు. ఇంతలో వైజయంతి మా అమ్మాయిని డిశ్చార్చి చేస్తే ఇంటికి వెళతామని చెబుతుంది. దీంతో మాధురి నా బాబు దొరికే వరకు ఇంటికి రానని మొండికేస్తుంది. కౌషికిసహా అందరూ మధును సముదాయించేందుకు ప్రయత్నిస్తారు. కానీ మధు ఎవ్వరి మాట వినదు.ఇంతలో ధాత్రి కలుగజేసుకుని నీ బాబును నీ అప్పగించే పూచీ నాదని చెబుతుంది. దీంతో వారితో కలిసి మధు ఇంటికి వెళ్తుంది.
             కేదార్ సాదు సార్‌తో మాట్లాడి ఈ కేసు  పర్సనల్‌గా తీసుకోవాలని చెబుతాడు. ఎలాంటి లీడ్‌ దొరికినా ముందు చెప్పాలని అడుగుతాడు. ఈ కేసును మీరే హ్యాండిల్‌ చేయమని చెప్పాడని ధాత్రికి కేదార్ చెబుతాడు. ఆస్పత్రి నుంచి  ఇంటికి వచ్చినప్పటి నుంచి మధు ఏం తినకపోవడంతో ఆమెకు నచ్చజెప్పి ధాత్రి, కేదార్ అన్నం తినిపిస్తారు. తెల్లారేసరికి బామ్మ అడ్రస్ దొరికిందంటూ రమ్య ఫోన్ చేయడంతో  కేదార్‌, జగధాత్రి రంగంలోకి దిగుతారు. బామ్మ తీసుకెళ్లిన బ్యాగ్‌లో ఏం ఉందో తెలుసుకుందాం పదా అంటూ కేదార్‌ను తీసుకుని ధాత్రి బయలుదేరుతుంది. బాబును అమ్మగా వచ్చిన డబ్బులు చూసుకుని బామ్మ మురిసిపోతుంటుంది. పెద్దింటి బిడ్డ కాబట్టి ఎక్కువ డబ్బులు ఇచ్చారని సంతోషపడుతుంది. ఇంతలో కేదార్‌, జగధాత్రి అక్కడికి చేరుకుంటారు.
                  బామ్మ ఇంటి తలుపులు కొట్టగానే కంగారుపడి డబ్బులు దాచిపెట్టి వచ్చి తలుపు తీస్తుంది. ఎవరు మీరంటూ నిలదీస్తుంది. మీతో మాట్లాడాలంటూ కేడీ,జేడీ ఇంట్లోకి వస్తారు. తాము పోలీసులమని చెప్పగానే  బామ్మ భయపడుతుంది. ఆస్పత్రిలో ఓ పిల్లాడు కనిపించకుండా పోయాడని...ఆ కేసు గురించి మాట్లాడటానికి వచ్చామని చెబుతారు. ధాత్రి బామ్మను మాటల్లో దింపగా...కేదార్ ఇళ్లంతా వెతుకుతాడు. హాస్పటల్‌కు ఎందుకు వెళ్లారని అడిగితే మా అమ్మాయి రిపోర్ట్‌ చూపించడానికి వెళ్లానని అంటుంది.  ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో  ధాత్రి మరింతగా ప్రశ్నించి కంగారుపెట్టిస్తుంది. ఇంట్లో ఉయ్యాల ఉండటం, అందులో పాలబాటిల్ ఉండటంతో  ఎక్కడిదని కేదార్ అడుగుతాడు. మా అమ్మాయి బిడ్డదని బామ్మ అబద్ధం చెబుతుంది. ఆస్పత్రిలో మీ ఎడమచేతిలో ఉన్నబ్యాగ్‌ను ఎందుకు అంత జాగ్రత్తగా పట్టుకున్నారని....అందులో ఏముందని ధాత్రి మళ్లీ నిలదీస్తుంది. ఏమీ లేవని పండ్లు ఉన్నాయని చెబుతుంది. అయితే మీరు పెంచుకుంటున్న కూతురు ఇదే బస్తీలో ఉంటుందని చెప్పారు కదా...అక్కడికి వెళ్దాం రండని కేదార్ అంటాడు. ముగ్గురు కలిసి వెళ్తుండగా...ఓ యువతి పిల్లాడిని ఎత్తుకుని లోపలికివస్తుంది. మీరు చెప్పింది ఈ అమ్మాయి గురించేనా అని ధాత్రి అంటే అవునని బామ్మ అంటుంది. బామ్మ సైగ చేయడంతో వచ్చిన అమ్మాయి కూడా అబద్ధం చెబుతుంది.
  

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! విహారి అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! కటకటాలపాలైన విహారి!
Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget