అన్వేషించండి

Jagadhatri Serial Today January 19th: మీనన్‌ కోసం పనిచేస్తే చంపేస్తానంటూ తల్లికి యువరాజు వార్నింగ్‌..? కేదార్ ఇంటి వారసుడేనని నిరూపిస్తామని జగధాత్రి శపథం...?

Jagadhatri Serial Today Episode January 19th:మీనన్‌ కోసం పనిచేస్తే చంపేస్తానంటూ తల్లికి యువరాజు వార్నింగ్‌..? కేదార్ ఇంటి వారసుడేనని నిరూపిస్తామని జగధాత్రి శపథం...?

Jagadhatri Serial Today Episode: మీనన్‌ దగ్గర ఇన్నాళ్లు పనిచేసిన నీకు మీ అమ్మ మీనన్‌ కోసం పనిచేస్తోందని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని కేదార్‌ యువరాజుతో అంటాడు. పిన్నికి మాతో ఎలాంటి ఇబ్బంది ఉండదని...కాకపోతే మీనన్‌ సంగతి తెలిసిన నీకు మీ అమ్మకు వచ్చే కష్టం గురించి నేను చెప్పాల్సిన పనిలేదని చెప్పి జేడీ,కేడీ వెళ్లిపోతారు. ప్రస్తుతానికి గండం నుంచి గట్టేక్కానని ఊపిరి పీల్చుకుంటున్న వైజయంతి వద్దకు యువరాజు కోపంగా వస్తాడు. మీనన్‌తో చేతులు కలిపావా అని నిలదీస్తాడు. దీంతో ఆమె మరింత వణికిపోతుంది. ఈలోగా నిషి కలుగజేసుకుని అత్తయ్య మీనన్‌తో ఎందుకు చేతులు కలుపుతుందని అంటుంది. మనం ఇంట్లో పడుతున్న అవమానాలు చూడలేక మా అమ్మ వాడికోసం పనిచేస్తోందని నాకు అనుమానంగా ఉందని యువరాజు అంటాడు. ఈ మొత్తం బిజినెస్‌ను నా గుప్పిట్లోకి తీసుకోవడానికే నేను ఇన్ని అవమానాలు భరిస్తున్నానని....అది నాచేతికి వచ్చే సమయానికి నువ్వు ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తే తల్లివి అని కూడా చూడకుండా చంపేస్తానంటూ  ఆమెకు తుపాకీ గురిపెట్టి బెదిరిస్తాడు. నాకు ఇప్పటికి ఉన్న తలనొప్పులు చాలని...కొత్తగా నువ్వు ఏమీ తీసుకొచ్చి నా దారికి అడ్డుపడొద్దని తల్లిని హెచ్చరించి వెళ్లిపోతాడు.
                          బయట నుంచి లోపలకి వచ్చిన జగధాత్రి, కేదార్‌ను  కౌషికి నిలదీస్తుంది. ఎప్పుడూ  చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోతున్నారని అడుగుతుంది. కేదార్‌వాళ్లప్రెండ్‌కు ఏదో అర్జెంట్ పని ఉంటే వెళ్లామని జగధాత్రి చెబుతుంది. మీరు బయటకు వెళ్లిన ప్రతిసారీ ఇంట్లో ఏదో రచ్చ జరుగుతోందని కౌషికి అంటుంది.ఇకపై బయటకు వెళితే తప్పనిసరిగా చెప్పే వెళ్తామని కేదార్ అంటాడు. వాళ్లు మాట్లాడుతుండగానే అక్కడికి  సుధాకర్‌ తమ్ముడు కమలాకర్‌ వస్తాడు.అందరినీ పలకరిస్తూ కౌషికితో మాట్లాడుతుంటాడు. జగధాత్రి, కేదార్ మాట్లాడటానికి ట్రై చేసినా అతను పట్టించుకోడు. 
                           కేదార్ దగ్గరకు వెళ్లి ఎప్పుడు వచ్చావ్ బాబాయి అని అనగానే...కోపంతో రగిలిపోతాడు. ఎవడ్రా నువ్వు ...నేను నీకు బాబాయి ఏంటని మండిపడతాడు. సిగ్గులేకుండా ఈ ఇంటిని పట్టుకుని వ్రేలాడుతున్నారేంటని జగధాత్రిని అంటాడు. ఇంతలో కౌషికి, సుధాకర్‌ సర్దిచెప్పబోయేసరికి వాళ్లపైనా మండిపడతాడు. ఇంటికి సంబంధం లేనివాళ్లను ఇంట్లో పెట్టుకుని ఎందుకు పరువు తీస్తున్నారని అంటాడు. ఎవడికి పుట్టాడో తెలియని అలగా జనాలను ఎందుకు ఇంట్లో ఉంచుతున్నారని అంటాడు. దీనికి కౌషికి,యువరాజు కూడా వంతపాడతారు. బయట వాళ్లమీద చూపించే ప్రేమ మా మీద కూడా చూపించడం లేదని...వీళ్లు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోఅంతా గొడవలేనని అంటారు. మామయ్య ఇంత చెప్పినా సిగ్గులేకుండా ఇంకా ఎందుకు ఉన్నారని నిషిక అంటుంది. మర్యాదగా బయటకు వెళ్లిపోండని అంటుంది. దీనికి జగధాత్రి కూడా గట్టిగా బదులిస్తుంది. మీరు ఎన్ని చెప్పినా కేదార్ ఈ ఇంటి వారసుడని అంటుంది.అయితే  ఆధారాలు చూపించండని కమలాకర్ నిలదీస్తాడు.నెలరోజుల్లో  ఆధారాలు తీసుకొస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు చూపించడం లేదని అంటాడు.
                       కేదార్ ఈ ఇంటివారసుడని మీ  అందరికీ తెలిసినా...మీ పరువు, ప్రతిష్ఠ కోసం ఒప్పుకోవడం లేనది జగధాత్రి మండిపడుతుంది. మీ బిజినెస్‌లు దెబ్బతింటాయని అంగీకరించడం లేదని అంటుంది. నిజంగా నువ్వు చెబుతుంది నిజమే అయితే  అందుకు తగిన ఆధారాలు రేపటిలోగా చూపించమని నిషిక నిలదీస్తుంది. దీంతో జగధాత్రికి కోపం వస్తుంది. రేపటిలోగా కేదార్ ఈ ఇంటి వారసుడుని నిరూపిస్తానంటూ  ఇంట్లోకి వెళ్లిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget