అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 9th: జగధాత్రి బెదిరించగానే తనపై కేదార్ హత్యాయత్నం చేయలేదని ఒప్పుకున్న కమలాకర్‌...ఇంతకీ కమలాకర్‌ను ధాత్రి ఏం బెదిరించింది..?

Jagadhatri Serial Today Episode February 9th:జగధాత్రి బెదిరించగానే తనపై కేదార్ హత్యాయత్నం చేయలేదని ఒప్పుకున్న కమలాకర్‌...ఇంతకీ కమలాకర్‌ను ధాత్రి ఏం బెదిరించింది..?

Jagadhatri Serial Today Episode:కేదార్‌ నిర్దోషి అని న్యూస్‌లో రావడం చూసి ఆనందపడిపోయిన కౌషికి అందరినీ కిందకు పిలుస్తుంది. ఇంతలో జగధాత్రి, కేదార్‌ కూడా వచ్చేస్తారు. వైజయంతి, నిషిక వాళ్లను చూసి నిష్ఠూరంగా మాట్లాడటం చూసి సుధాకర్‌కు కోపం వస్తుంది. మీరు అసలు మనుషులే కాదని అంటాడు. దీంతో జగధాత్రి, కేదార్‌ సుధాకర్‌ను వారిస్తారు. అసలు తప్పు మా వైపు కూడా ఉంది మామయ్య అని ధాత్రి అంటుంది. కేదార్ తాత వేషంలో వచ్చిన వ్యక్తి చెప్పగానే నిజం తెలుసుకోకుండా మేం కూడా తొందరపడ్డామని అంటుంది. నేను కూడా బాబాయిపట్ల అలా ప్రవర్తించి ఉండకూడదని కేదార్ అంటాడు. మీరు మాత్రం ఏం చేస్తారు కళ్లతో చూసిందే నిజమనుకుంటారు కదా ఎవరైనా అని అంటాడు. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా అదే చాలని అంటాడు. దీనికి వైజయంతి, నిషిక మళ్లీ అడ్డుపడతారు. పోలీసులు, కోర్టులు మిమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించి ఉండొచ్చు కానీ...తనను చంపడానికి ఎవరు ప్రయత్నించారో కమలాకర్‌కు మాత్రం తెలుసుకదా అని అంటారు. వీళ్లే సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటారని వైజయంతి అంటుంది. తనపై కత్తి దాడి చేసింది కేదార్‌ అని కమలాకర్‌ స్ఫష్టంగా చెబుతున్నాడు కాబట్టి...మీరు ఇంకా నేరస్తులేనని అంటుంది. వెంటనే కల్పించుకున్న ధాత్రి...మీరు చెబుతున్నది నిజమే అయితే అప్పుడు మేమే నేరస్థులమని ఒప్పుకుంటామని అంటుంది. నేనే స్వయంగా వెళ్లి కమలాకర్‌ మామయ్యను తీసుకుని వస్తానంటూ ఆయన రూమ్‌లోకి వెళ్తుంది.
                    జగధాత్రిని చూడగానే కమలాకర్‌ కోపంతో రగిలిపోతాడు. మీరు పోలీసుల నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేరని అంటాడు. మీరు నిజం చెప్పండి మామయ్య ఎందుకు అబద్దం చెబుతున్నారని ధాత్రి నిలదీస్తుంది. మిమ్మల్ని సూరిబాబు కత్తి పొడిస్తే...కేదార్ పేరు ఎందుకు చెబుతున్నారని అంటాడు. నన్ను ఎవరు పొడిచినా...నేను మాత్రం కోర్టులో కేదార్‌ పేరే చెబుతానని అంటాడు. వాడిని శాశ్వతంగా జైలుకు పంపించే వరకు నిద్రపోనని అంటాడు. అయితే కేదార్‌తో పాటు మీరు కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండండని జగధాత్రి బెదిరిస్తుంది. కేదార్ తాత వేషంలో వచ్చినవాడు నిజం కాకపోవచ్చు, అతను చెప్పింది నిజం కాకపోవచ్చు...కానీ పాతికేళ్ల క్రితం కేదార్ వాళ్ల అమ్మ హత్య కేసులో మీరు ఉన్నారన్నది మాత్రం నిజమేకదా అని అంటుంది. ఆమె మాటలకు కమలాకర్‌ షాక్‌కు గురవుతాడు. నన్ను బెదిరించి భయపెట్టలేవని అంటాడు. నేను భయపెట్టాల్సిన పనిలేదని....మీకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేకపోయి ఉంటే ఇంత కంగారుపడేవాళ్లు కాదని..ఇంట్లో ఎవరికి చెప్పకుండా భయంతో మహల్‌ వరకు ఒక్కరే వెళ్లరని, అక్కడ కేదార్ వాళ్ల తాతయ్యను చంపడానికి ప్రయత్నించే వారు కాదని అంటుంది. మీ భయమే మిమ్మల్ని పట్టిస్తుందని అంటుంది. మీకు  ఆమె హత్య కేసుతో సంబంధం ఉన్నా లేకపోయినా....నేను మాత్రం సంబంధం ఉందనే పోలీసులకు ఆ డైరీ అందజేస్తానని అంటుంది. అప్పుడు 25 ఏళ్ల క్రితం మూసివేసిన కేసును వాళ్లు మళ్లి తిరగతోడతారని అంటుంది. ఆ మాటలకు కమలాకర్‌ ఉలిక్కిపడతాడు. మర్యాదగా మీరు కిందకు వచ్చి నిజం చెప్పకపోతే నేను అదే పని చేస్తానని అంటుంది. అప్పుడు కేదార్‌ కన్నా మీరే ముందు జైలుకు వెళ్లల్సి ఉంటుందని బెదిరిస్తుంది. దీంతో కమలాకర్‌ అందరి ముందుకు వచ్చి నిజం చెబుతాడు. కేదార్‌ మీద ఉన్న కోపంతోనే తాను అబద్ధం చెప్పానని...కేదార్ తనను కత్తితో పొడవలేదని అంటాడు. దీంతో కౌషికి, సుధాకర్‌ అందరికీ వినపడింది కదా అని అంటారు. మరోసారి కేదార్‌, జగధాత్రిని ఏమైనా అంటే సహించేది లేదని చెబుతారు.
                    అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వాళ్లంతా కమలాకర్‌పై మండిపడతారు. జగధాత్రి బెదిరిస్తే మీరు ఎందుకు బెదిరిపోయారని అంటారు. అయినా కేదార్ వాళ్ల అమ్మ హత్యతో మీకు ఎలాంటి సంబంధం లేదు కదా మరి ఎందుకు భయపడుతున్నారని నిషిక నిలదీస్తుంది. ఇప్పుడు కేసు తిరగతోడారంటే ముందు నా దగ్గర నుంచే విచారణ ప్రారంభిస్తారని....వాళ్లను జైలులో వేయడం కోసం మనం జైలుపాలవ్వలేం కదా అని అంటాడు. దీంతో వాళ్లంతా నోరుమూసుకుని ఉంటారు. మంత్రి హత్య కేసులో మీనన్ అనుచరుడు దేవా ఉన్నాడని ఆధారాలు దొరకడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతుంటాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget