అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 2nd: శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌ అయ్యిందా..? పెళ్లికొడుకును జగధాత్రి ఎలా బెదరగొట్టి పంపించేసింది..?

Jagadhatri Serial Today Episode February 2nd :శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌ అయ్యిందా..? పెళ్లికొడుకును జగధాత్రి ఎలా బెదరగొట్టి పంపించేసింది..?

Jagadhatri Serial Today Episode: జగధాత్రి,కేదార్ తప్పు చేయలేదని కౌషికి, సుధాకర్‌ నమ్మడంతో వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. దీంతో వాళ్లు లోపలికి వస్తాడు. అవుట్‌హౌస్‌ నుంచి బయటకు పంపాలని చూస్తే వీళ్లు మళ్లీ ఇంట్లో చేరారని యువరాజు, నిషిక బాధపడతారు. ఎలాగైనా వీరిని శాశ్వతంగా బయటకు పంపించాలని యువరాజు అన్నాడు.
తెల్లారిన తర్వాత కౌషికి ధాత్రి వాళ్ల దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుతుంది. అందరిలా నేను కూడా మిమ్మల్ని అవమానించానని బాధపడుతుంది. మీ మంచితనం గురించి  తెలిసికూడా కళ్లతో చూసిందే నిజమని నమ్మి మిమ్మల్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాని అంటుంది. దీనికి జగధాత్రి బాధపడొద్దని...ఆ సమయంలో ఎవరు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారని అంటుంది. ఇందులో మీ తప్పేమిలేదని సర్దిచెబుతుంది. నేను కూడా కోపంలో బాబాయిపై చేయి చేసుకోకుండా ఉండాల్సిందని  కేదార్ వాళ్ల అక్కతో అంటాడు. అసలు మీనన్‌కు బాబాయిని చంపాల్సిన అవసరం ఏముందని...ఈ కేసు నీపై నెట్టాలని ఎందుకు అనుకున్నాడని కౌషికి అంటుంది. ఆవిషయమే మనం తెలుసుకోవాలి వదినా అని జగధాత్రి అంటుంది.  ఆ కమిషనర్‌ కేదార్ బెయిల్ రద్దు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడని...ఈలోగా మనం ఆ నిజం కనిపెట్టి  కేదార్‌ నిర్దోషని నిరూపించాలని ధాత్రి అంటుంది.అయితే ఆ పనిలో ఉండడని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన నిషిక...వదిన మళ్లీ వీళ్లను పూర్తిగా నమ్ముతోందని బాధపడుతుంది. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా దీని చేతిలో మాత్రం గెలవలేకపోతున్నానని అనుకుంటుంది.
                శ్రీవల్లిని చూసుకునేందుకు పెళ్లికొడుకు మళ్లీవస్తాడు. వాడిని మేడమీద నుంచే చూసి వైజయంతి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.గతంలో మాదిరిగా ఏదైనా తప్పు చేస్తే ఈసారి తాటతీస్తానని హెచ్చరిస్తుంది.అంతా ప్రిపేర్ అయ్యే వచ్చామని ఖచ్చితంగా ఇవాళ ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం పెట్టుకునే వెళ్తామని చెప్పి లోపలకి వస్తాడు. రాగానే సుధాకర్‌ కాళ్లకు దణ్ణం పెట్టి వారిని బుట్టలో పడేయాలని చూస్తాడు. జగధాత్రి శ్రీవల్లిని అడుగుతుంది.అబ్బాయి నీకు నిజంగా నచ్చితేనే చెప్పు లేకుంటే పెళ్లి ఆపించేస్తానని చెబుతుంది. అమ్మకు ఇష్టమైంది కాబట్టి నాకు ఇష్టమేనని చెబుతుంది.ఇప్పుడు అందిరి ముందు వద్దు అంటే అమ్మకు కోపం వస్తుందని చెబుతుంది. ఇంతలో పెళ్లి కొడుకు ఈ వారమే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుంటామని...మా పంతులుగారు శ్రీవల్లి జాతకం, నా జాతకం చూసి చెప్పారని అంటాడు. దీంతో జగధాత్రి కల్పించుకుని మా శ్రీవల్లి పుట్టినే తేదీనే మాకు తెలియదని...నీకు జాతకం ఎలా తెలిసిందని నిలదీస్తుంది.ఇంతంలో వైజయంతి కల్పించుకుని పేర్లు చూపించుకుని ఉంటారులేనని అంటుంది. ఇంట్లో  మా చిన్న మామ్యయ్యకు బాగాలేదని...ఇలాంటి టైంలో ఎంగేజ్‌మెంట్‌ పెట్టుకోవడం బాగుండదని ధాత్రి అంటుంది.దీనికి కౌషికి కూడా వంతపాడుతుంది. తాము వేసిన ప్లాన్ బెడిసికొట్టేలా ఉందని భావించిన కౌషికి, నిషిక....పెళ్లికొడుకుని ఉసిగొల్పుతారు.నాకు  ఎక్కువ సెలవులు లేవని...ఈవారంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుని నెలరోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాలని అంటాడు. దీంతో వైజయంతి కూడా  అతనికి మద్దతుగా నిలుస్తుంది.కమలాకర్‌ రెండురోజుల్లో కళ్లు తెరుస్తాడని డాక్టర్లు చెప్పారు కదా..ఇప్పుడు ఈసంబంధం వద్దంటే మళ్లీ ఇలాంటి మంచి సంబంధం రాదని చెబుతుంది. దీనికి అందరూ సరేననడంతో  పెళ్లికొడుకు నగలు, బట్టలు తెచ్చి శ్రీవల్లికి ఇస్తాడు. అవి పరిశీలించిన ధాత్రి అవి గిల్ట్‌ నగలులా ఉన్నాయని అనడంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని వాటని తీసుకుని వాళ్లు అక్కడి నుంచి జారుకుంటారు.మంచి సంంబధం చెడగొట్టారని వైజయంతి,నిషిక  ధాత్రిపై గొడపవడతారు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget