అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 16th: హోంమినిష్టర్‌ తాయార్‌ను అరెస్ట్‌ చేసిన జేడీ..కౌషికి నుంచి పెన్‌డ్రైవ్‌ కొట్టేసిన యువరాజు, నిషిక, వైజయంతి.

Jagadhatri Serial Today Episode February 16th: హోంమినిష్టర్‌ తాయార్‌ను అరెస్ట్‌ చేసిన జేడీ..కౌషికి నుంచి పెన్‌డ్రైవ్‌ కొట్టేసిన యువరాజు, నిషిక, వైజయంతి.

Jagadhatri Serial Today Episode : కౌషికి తన రూమ్‌లో దాచిపెట్టిన పెన్‌డ్రైవ్‌ కొట్టేయడానికి యువరాజు, నిషిక ప్లాన్ వేసి కౌషికి తాగే పాలల్లో నిద్రమాత్రలు కలుపుతారు. కౌషికి, సురేష్‌ ఆ పాలు తాగి నిద్రపోతారు. ఎందుకైనా మంచిదని నిషిక జగధాత్రి రూమ్‌కు బయట తాళం వేస్తుంది. అలాగే కమలాకర్ దగ్గర పడుకున్న కేదార్ రూమ్‌కి కూడా బయట తాళం వేస్తారు. ఇక ఈరాత్రి ఈ ఇంట్లో మనం ఏం చేసినా ఎవరికి తెలియదని నిషిక అంటుంది. ఇంతలో జగధాత్రికి అనుమానం వచ్చి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా...రూమ్‌ తాళం వేసి ఉండటంతో సాధ్యంకాదు. వెంటనే కేదార్‌కు ఫోన్ చేస్తుంది. అతడు కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నించి తన రూమ్‌ బయట కూడా తాళం వేశారని చెబుతాడు. దీంతో చేసేది ఏం లేక జగధాత్రి కౌషికికి ఫోన్ చేస్తుంది. కానీ అప్పటికే నిద్రపోయిన కౌషికి ఎంతకీ ఫోన్ లిప్ట్‌ చేయదు. జగధాత్రి అనుమానం మరింత బలపడుతుంది. వదిన ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్‌ సైలెంట్‌గా పెట్టదు కదా అని అనుకుంటుంది. ఇంతలో నిషిక,  యువరాజు, వైజయంతి కలిసి కౌషికి రూమ్‌లోకి వెళ్లి పెన్‌డ్రైవ్ దొంగలించి బయటకు వచ్చేస్తారు.
                           పోలీసు కస్టడీలో ఉన్న సూరిబాబు నిజం చెప్పడంతో హోంమంత్రి తాయర్‌ పదవిపోతుంది. ఆమెను అరెస్ట్ చేయడానికి జేడీ, కేడీ పోలీసు బలగంతో ఆమె ఇంటి వద్దకు వస్తారు. అప్పటికే తాయర్ విదేశాలకు పారిపోయేందుకు తయారవుతుంటుంది.ఇంతలో అక్కడికి వచ్చిన జేడీ....ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చానని ఎవరు ఎలాంటి గొడవ చేసినా అందరినీ లోపల పడేస్తామని హెచ్చరిస్తుంది.కోర్టు ఆదేశాలతోనే ఈ అరెస్ట్ జరుగుతోందని చెప్పి హెచ్చరిస్తుంది.దీంతో తాయర్‌ తప్పక అరెస్ట్‌ అవుతుంది. నన్ను రిమాండ్‌కు పంపించినంత ఈజీకాదని జైలుకు పంపడం అని తాయర్‌ అంటుంది. నువ్వు శాశ్వతంగా జైలులోనే ఉండేలా  అన్ని ఆధారాలు సిద్ధం చేశానని జేడీ ఆమెకు బదులిస్తుంది. కౌషిక దగ్గర పెన్‌డ్రైవ్‌ కొట్టేశామన్న ఆనందంలో యువరాజు, నిషిక,వైజయంతి ఉంటారు. ఇంతలో టీవీలో జేడీ హోంమంత్రిని అరెస్ట్ చేసిందన్న వార్త ప్రసారమవుతుంది.
                          టీవీలో వస్తున్న వార్తను సురేష్‌...కౌషికిని పిలుస్తాడు. మీబాబాయి కమాలాకర్ హత్య కేసు వెనక హోంమంత్రి హస్తముందని...జేడీ తాయార్‌ను అరెస్ట్ చేసిందని చెబుతాడు. పోలీసు కస్టడీలో ఉన్న సూరిబాబు నిజం చెప్పడంటా అని చెబుతాడు. దీంతో సుధాకర్‌ సహా అందరూ ఆశ్చర్యపోతారు. కమలాకర్‌ను చంపాల్సిన అవసరం హోంమంత్రికి ఏం ఉందని....అనుకుంటారు. అసలు కమలాకర్‌ను చంపితే హోంమంత్రి, మీనన్‌కు వచ్చే లాభమేంటని ఆశ్చర్యపోతారు. అదే నాకు  అర్థంకావడం లేదని కౌషికి అంటుంది. అప్పుడే బయట నుంచి వచ్చిన జగధాత్రిని పిలిచి చెబుతుంది.మాకు ఇప్పుడే ఈ విషయం తెలిసిందని చెబుతారు.ఏం నాటకాలు ఆడుతున్నారురా అని యువరాజు అనుకుంటాడు. ఏదైతే ఏం కమలాకర్‌ బాబాయి కేసులో నుంచి కేదార్‌ బయటపడ్డాడు  అదే చాలని కౌషికి అంటుంది. ఇంతలో సీఎం గారి ఇంటర్వూ కోసం టైం అవుతోందని...వెంటనే మనం స్టూడియోకు వెళ్తామని సురేష్ అంటాడు. వెళ్లి పెన్‌డ్రైవ్ తీసుకుని రమ్మని పురమాయిస్తాడు. ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి కౌషికి లోపలికి వెళ్తుంది. మేం ఆ పెన్‌డ్రైవ్‌ ఎప్పుడో కొట్టేశాం కదా అని నిషిక, వైజయంతి సంబరపడిపోతుంటారు.
                                    తన రూమ్‌లోకి వెళ్లి ఎంత వెతికినా పెన్‌డ్రైవ్‌ కనిపించదు. తన లాకర్‌లో పెట్టిన పెన్‌డ్రైవ్ ఎలా మాయమైందోనని కౌషికి కంగారుపడుతుంది. అదే విషయం బయటకు వచ్చి చెబుతుంది. నీ రూమ్‌లోకి ఎవరూ రారు కదమ్మా అని సుధాకర్ అంటాడు. నాకు అదే అర్థం కావడం లేదని కౌషికి అంటుంది. ఇంతలో కేదార్ కల్పించుకుని నిషిక నువ్వు ఏమైనా పెన్‌డ్రైవ్‌ చూశావా అని అంటాడు. దీంతో నిషికకు, యువరాజుకు కోపం వస్తుంది. మాకు ఆ పెన్‌డ్రైవ్‌ ఎలా తెలుస్తుందని నిలదీస్తుంది. జగధాత్రి కల్పించుకుని నువ్వు తీశావా అని అడగటం లేదు...మీనన్‌కు భయపడి మీరు ఏమైనా దాచారేమోనని అంటుంది. దీంతో నిషిక ధాత్రి వద్దకు వచ్చి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగులగొడతానని అంటుంది. దీంతో జగధాత్రి మళ్లీ అడుగుతున్నాను...నువ్వు ఏమైనా పెన్‌డ్రైవ్ తీశావా అని అదే మాట అంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రేపే విహారి పిల్లలకు బారసాల.. డాక్టర్‌ని చంపేసిన పద్మాక్షి! మరో డాక్టర్‌కి తెలిసిన నిజం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రేపే విహారి పిల్లలకు బారసాల.. డాక్టర్‌ని చంపేసిన పద్మాక్షి! మరో డాక్టర్‌కి తెలిసిన నిజం!
Godavari Serial Today May 30th: 'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!
'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!
Karthika Deepam 2 Serial Today May 30th: కార్తీకదీపం సీరియల్: ఎపిసోడ్‌లో అదే హైలెట్..! మాజీ సుందరితో ఆ పని చేయించేశారా! కాశీ కొత్త బిజినెస్ ఐడియా అదుర్స్!
కార్తీకదీపం సీరియల్: ఎపిసోడ్‌లో అదే హైలెట్..! మాజీ సుందరితో ఆ పని చేయించేశారా! కాశీ కొత్త బిజినెస్ ఐడియా అదుర్స్!
Nindu Manasulu Serial Today May 30th: నిండు మనసులు: రంజిత్‌ చేసిన పనికి ఐశ్వర్య సీరియస్! సిద్ధూ ఎఫైర్ పెట్టుకున్నాడా!
నిండు మనసులు: రంజిత్‌ చేసిన పనికి ఐశ్వర్య సీరియస్! సిద్ధూ ఎఫైర్ పెట్టుకున్నాడా!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Embed widget