అన్వేషించండి

Jagadhatri Serial Today March 27th: మీనన్‌కు దేవేంద్ర వార్నింగ్‌ - సాక్ష్యం సంపాదించిన ధాత్రి

Jagadhatri Today Episode: దేవేంద్ర వచ్చి మీనన్ మనుషులను కొట్టి మీనన్ కు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: మీనన్‌ తన మనుషులతో అఖిలాండేశ్వరి దగ్గరకు వెళ్లి బెదిరిస్తాడు. గన్‌ పెట్టి తనకు స్టేడియం ప్రాజెక్టులో పార్టనర్‌షిప్‌ ఇవ్వాలని అడుగుతాడు. దీంతో అఖిలాండేశ్వరి భయపడదు. ధైర్యంగా అలాగే చూస్తుంటుంది. ఇంతలో అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు దేవేంద్ర వస్తాడు. మీనన్ మనుషులను చితక్కొట్టి మీనన్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో మీనన్‌ కూడా దేవేంద్రకు వార్నింగ్‌ ఇచ్చి నీ ఫ్యామిలీ జాగ్రత్త అంటూ హెచ్చరించి వెళ్లిపోతాడు మీనన్‌. తర్వాత దివ్యాంక అఖిలాండేశ్వరికి ఫోన్‌ చేస్తుంది.

దివ్యాంక: హాయ్‌ మేడం నేను దివ్యాంక చానెల్‌ డీ అధినేత.

అఖిలాండేశ్వరి: హాయ్‌ అమ్మా మినిస్టర్‌ గారు చెప్పింది నువ్వేనా?

దివ్యాంక: అది మీ ప్రాజెక్టు, మీ ఫ్యామిలీలో జరగబోయే ఎంగేజ్‌మెంట్‌ టెలికాస్ట్‌ రైట్స్‌ కోసం మీకు ఫోన్‌ చేశాను. మేడం. ఎంత డబ్బైనా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మేడం.

అఖిల: మీ చానెల్‌ గురించి.. మీ చానెల్‌ ను అడ్డుపెట్టుకుని నువ్వు చేసే బిజినెస్‌ ల గురించి నాకు బాగా తెలుసు దివ్యాంక. నిజాయితీ లేని మనుషులకు నేను కాంటాక్ట్‌ ఇవ్వను. నేను బిజినెస్‌ చెయ్యను. నీకు కాంటాక్ట్ ఇవ్వడం కుదరదు.

దివ్యాంక: అది కాదు మేడం..

అఖిల: ఏదైనా నేను ఒక్కసారే చెబుతాను. రెండో సారి చెప్పడం కుదరదు.

 అని అఖిలాండేశ్వరి ఫోన్‌ కట్‌ చేస్తుంది. దివ్యాంక ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. మరోవైపు ధాత్రి, కేదార్‌కు ఫోన్ చేస్తుంది. కేదార్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు. ఇంతలో కేదారే డల్లుగా వస్తాడు. ఏమైందని ధాత్రి అడగ్గానే హాస్పిటల్‌లో యువరాజ్‌ బర్తు సర్టిఫికెట్‌ కాల్చివేశాడని జరిగింది మొత్తం చెప్పి బాధపడతాడు.

ధాత్రి: మనల్ని దొంగ దెబ్బ తీసిన ఆ యువరాజ్‌కు బుద్ది ఎలా చెప్పాలో  నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకు కేదార్‌ రేపు మనం ఈ ఇంటిని వదిలి వెళ్లడం లేదు.

కేదార్‌: అదేంటి ధాత్రి. సాక్ష్యాలు తీసుకుని రాకుంటే ఇంట్లో ఉండనివ్వను అని అక్క క్లియర్‌గా చెప్పింది. మనం కూడా అందరి ముందు రేపు వెళ్లిపోతామని చెప్పేశాము కదా?

ధాత్రి: మన మంచితనాన్ని చేతకాని తనంగా తీసుకుంటున్నారు కేదార్‌. రేపట్నుంచి ఆట అంటే ఎలా ఉంటుందో దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్‌ గా ఆడొచ్చో.. యువరాజ్‌కు చూపిస్తాను.

అనగానే కేదార్‌ హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు యువరాజ్ బర్తు సర్టిఫికెట్‌ కాల్చివేసిన విషయం వైజయంతికి చెప్తుంటాడు. ఇంతలో నిషిక వస్తుంది. నిషికను చూసిన వైజయంతి, యువరాజ్‌ తాము మాట్లాడుకున్నది విన్నదేమోనని షాక్‌ అవుతారు. ఇక్కడేం మాట్లాడుకుంటున్నారని నిషిక అడగడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. అందరూ కలిసి రేపటితో వాళ్లు వెళ్లిపోతారు. మనం హ్యాపీగా ఉండొచ్చని అనుకుంటారు. మరోవైపు ధాత్రి వైజయంతి రూంలోకి వెళ్లి సాక్ష్యాల కోసం వెతుకుతుంది. సుధాకర్‌ ఫోటో దొరుకుతుంది. అది తీసుకుని వెళ్లబోతుంటే వైజయంతి, కాచి  రూంలోకి వస్తారు. వాళ్లను చూసి బాత్రూంలోకి వెళ్లి దాక్కుంటుంది ధాత్రి.

వైజయంతి: రూం ఏదో తేడాగా ఉంది అమ్మి.

కాచి: ఏమైంది పెద్దమ్మా?

వైజయంతి: అంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడూ ఇలాగ లేదు.

కాచి: పెద్దనాన్న ఏమైనా కావాలని తీయడానికి వచ్చాడేమో?

వైజయంతి: ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగుతాడు కానీ ఆ మనిషి ఇలా చేయడే?

అంటూ లోపలికి వెళ్లి మొత్తం చూస్తుంది. ఫోటోలు సామాన్లు చిందరవందరగా పడి ఉండటం చూసి ఈ గదిలోకి ఎవరో వచ్చారు. అంటూ ఇద్దరూ కలిసి వెతుకుతుంటే ఇంతలో కేదార్‌ వచ్చి పిన్ని కింద మిమ్మల్ని ఎవరో కలవడానికి  వచ్చారని చెప్పగానే వైజయంతి, కాచిని అక్కడే ఉంచి కిందకు వెళ్తుంది. మళ్లీ కేదార్‌ బూచి మందు తాగాడని కాచికి చెప్పగానే కాచి కూడా కిందకు వెళ్లిపోతుంది. దీంతో కేదార్‌, ధాత్రి రిలాక్స్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు - రామ్ చరణ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget