అన్వేషించండి

Jagadhatri Serial Today March 22nd: ‘జగధాత్రి’ సీరియల్‌: కేదార్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ కాల్చేసిన యువరాజ్‌ - నెక్లెస్‌ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ధాత్రి

Jagadhatri Today Episode: యువరాజ్ హాస్పిటల్ స్టోర్ రూంలోకి వెళ్లి కేదార్ బర్త్ సర్టిఫికెట్ కాల్చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri Serial Today Episode: హాస్పిటల్‌లోకి వెళ్లిన కేదార్‌ డాక్టర్‌ తో తన బర్త్‌ సర్టిఫికేట్‌ గురించి మాట్లాడుతుంటాడు. యువరాజ్‌ బయటి నుంచి దొంగచాటుగా చూస్తుంటాడు. పాతికేళ్ల క్రితం బర్త్‌ సర్టిఫికెట్‌ ఇప్పుడు ఎలా దొరుకుంతుందని డాక్టర్‌ చెప్పడంతో కేదార్‌ డాక్టర్‌ ను రిక్వెస్ట్‌ చేస్తాడు. తన పుట్టుక ప్రశ్నార్థకంగా మారిందని నా బర్తు సర్టిఫికెట్‌ ఇప్పుడెంతో అవసరం అని చెప్తాడు. దీంతో డాక్టర్‌ సరే అయితే మీరు డాక్టర్‌ కృష్ణన్‌ ని కలవండి నేను చెప్తాను. అనడంతో కేదార్‌ బయటకు వచ్చి డాక్టర్‌ కృష్ణన్‌ కోసం వెళతాడు. బయటి నుంచి అంతా విన్న యువరాజ్‌ డాక్టర్‌ గెటప్‌లో ఉన్న రౌడీని పిలిచి ఇప్పుడు నువ్వు డాక్టర్‌ కృష్ణ వెళ్లి వాన్ని ఆ గదిలోకి తీసుకురా అని చెప్తాడు. మిగతా రౌడీలను పిలిచి వాడు ఆ రూంలోంచి బయటకు రాకూడదు అని చెప్పగానే అందరూ సరే అని వెళ్తారు. రౌడీ, కేదార్‌ దగ్గరకు వెళ్లి తానే డాక్టర్‌ కృష్ణన్‌ అని పరిచయం చేసుకుని కేదార్‌ను రూంలోకి తీసుకెళతాడు. మరోవైపు గాగుల్స్‌ పెట్టుకుని రూంలోకి వెళ్లిన ధాత్రి..

ధాత్రి: వదిన నన్ను ఒకసారి కాచి రూంలోకి తీసుకెళ్లవా?

కౌషికి: సరే పదా అటు..

కాచి: అమ్మా మా రూంలోకి వెళ్లారేంటి డోర్‌ కూడా క్లోజ్‌ చేశారేంటి?

నిషిక: మనం రాకూడదని వాళ్లు చేసేది చూడకూడదని..

కాచి: అసలు లోపల ఏం జరుగుతుంది.

కౌషికి: నెక్లెస్‌ పోయింది నిషిక రూంలో అయితే తీసింది నిషిక అన్న డౌట్‌ ఉంటే కాచి రూంలోకి ఎందుకు తీసుకొచ్చావు జగధాత్రి.

ధాత్రి: ఇది నిషిక ఒక్కతే చేసిన పని కాదు వదిన

కౌషికి: ఎందుకు అలా అనిపిస్తుంది.

ధాత్రి: నిషిక అప్పుడు ఆ రూంలో లేదు. కానీ నిషిక అరుపులు ఆ రూంలోంచే వినిపించాయి. అప్పుడు నేను ఆ రూంలోకి వెళ్లాను. నేను రూంలోకి వెళ్లబట్టే ఆ నేరం నా మీద మోపబడింది.

అంటూ రూం మొత్తం సర్చ్‌ చేయమని ఏమైనా డౌట్‌గా ఉంటే తనకు చెప్పమని అడుగుతుంది. రూం మొత్తం వెతికినా ఏం దొరక్కపోయేసరికి బాల్కనీలో వెతుకుతారు. అక్కడ గాజుముక్క దొరకడంతో ఈ గాజు ఎవరిదో వాళ్లే నిషికకు హెల్ప్‌ చేసి ఉంటారని కిందకు వెళ్తారు ధాత్రి, కౌషికి. మరోవైపు టెన్షన్‌గా  చూస్తున్న..

వైజయంతి: ఏందమ్మీ ఆ రూంలో  ఏం చేస్తా ఉన్నారు.

నిషిక: ఎక్కడ ఎక్కువ ఎంత సేపు ఉంటే మనకు అంత మంచిదిలే అత్తయ్యా.. దానికి టైం వేస్ట్‌ అవ్వడమే కదా మనకు కావాల్సింది కూడా..

ధాత్రి: ఈ గాజుముక్క ఎవరిది?

నిషిక: ఏంటే తమాషాగా ఉందా?

ధాత్రి: లేదు నిషి చాలా సీరియస్‌గా అడుగుతున్నాను.

నిషిక: ఇప్పుడు నీకు ఆ గాజుముక్క దొరికింది కాబట్టి వాళ్లే నెక్లెస్‌ దొంగతనం చేశారు అంటావు.. అంతేగా..

 ధాత్రి: ఎందుకు నిషి అంత భయపడుతున్నావు.

నిషిక: పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నేనెందుకే భయపడతాను.

అనగానే ధాత్రి మరోసారి గట్టిగా ఈ గాజుముక్క నీదేనా కాచి అని అడుగుతుంది. కాదు అని చేతులు చూపించగానే అది కాచి గాజుముక్కే అని తెలిసిపోతుంది. దీంతో కాచి భయపడుతుంది. వెంటనే నిషిక గాజుముక్క కాచిది అయినంత మాత్రాన నెక్లెస్‌ దొంగతనం కాచి చేసింది అంటారా? అని వెనకేసుకొస్తుంది. దీంతో ధాత్రి తనను మరోసారి బాల్కనీ దగ్గరకు తీసుకెళ్లమని కౌషికికి చెప్తుంది. మరోవైపు కేదార్‌ను రూంలోకి తీసుకెళ్లిన రౌడీలు కొట్టి పడేస్తారు. యువరాజ్‌ స్టోర్‌ రూంలోకి వెళ్లి సర్టిఫికెట్‌ వెతుకుతుంటాడు. మరోవైపు బాల్కనీలోకి వెళ్లిన ధాత్రి, కౌషికి నెక్లెస్‌ కోసం వెతుకుతుంటారు. మరోవైపు స్టోర్‌ రూంలో యువరాజ్‌ కు, కేదార్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ దొరకగానే కాల్చేస్తాడు. ఇంతలో కేదార్‌ స్టోర్‌ రూంలోకి వచ్చి బర్తు సర్టిఫికెట్‌ కాలిపోవడాన్ని చూసి ఏడుస్తూ కూలబడిపోతాడు. దీంతో ఇవాళ్టీ  ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: కుమారి అక్క.. బ్రేక్ తీస్కో, మా వంటలక్క వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఆ సీక్రెట్ చెప్పేసిన డాక్టర్ బాబు

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పుట్టిన రోజున అన్నదానం వేడుకలో విహారి! పాడు చేయడానికి అంబిక ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పుట్టిన రోజున అన్నదానం వేడుకలో విహారి! పాడు చేయడానికి అంబిక ప్లాన్!
Nindu Manasulu Serial Today November 11th: నిండు మనసులు: మంజుల, విజయానంద్‌కి నిజం చెప్పేసిన సాహితి! సిద్ధూ ప్రేరణల మధ్య శాశ్వత దూరం వచ్చేస్తుందా!
నిండు మనసులు: మంజుల, విజయానంద్‌కి నిజం చెప్పేసిన సాహితి! సిద్ధూ ప్రేరణల మధ్య శాశ్వత దూరం వచ్చేస్తుందా!
Godavari Serial Today November 11th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌పై జాను సీరియస్.. గ్లాస్ పగలగొట్టి క్లారిటీ! సంజయ్‌ని ఓదార్చిన పార్వతి!
'గోదావరి' సీరియల్: సంజయ్‌పై జాను సీరియస్.. గ్లాస్ పగలగొట్టి క్లారిటీ! సంజయ్‌ని ఓదార్చిన పార్వతి!
Illu Illalu Pillalu Serial Today November 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: చందుని ఇంటికి తీసుకొచ్చిన అంజలి! నర్మదతో ప్రేమ, వేదల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: చందుని ఇంటికి తీసుకొచ్చిన అంజలి! నర్మదతో ప్రేమ, వేదల గొడవ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Embed widget