అన్వేషించండి

Jagadhatri Serial Today March 19th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రిపై పోలీసులకు నిషిక కంప్లైంట్ – గంటలో దొంగను పట్టిస్తానన్న ధాత్రి

Jagadhatri Today Episode: ధాత్రిని స్టేషన్ కు తీసుకెళ్లడానికి పోలీసులు రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: నిన్న రాత్రి ఇంట్లో ఎవరో దొంగతనం చేశారని వారిని పట్టుకోవాలని ధాత్రి అంటుంది. ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది. అందరికీ మంచి జీతాలు ఇస్తున్నాను కదా అంటుంది కౌషికి. కానీ ఎవరో కావాలనే నిన్న రాత్రి నిషిక రూంలో నెక్లెస్‌ దొంగతనం చేశారని ధాత్రి అనుమానిస్తుంది. అయితే నిషిక రూంలో అరిచినట్లు నువ్వు విన్నది నిజమేనా అని కౌషికి అడుగుతుంది. నేను నిషిక అరుపు విన్నాను కానీ నెక్లెస్‌ దొంగతనానికి ఈ అరుపుకు ఏదైనా సంబంధం ఉందేమో మనం తెలుసుకోవాలని ధాత్రి అంటుంది.  దీంతో కౌషికి వాళ్లు అటువైపు రాకుండా నేను మేనేజ్‌ చేస్తాను మీరు వెళ్లి రూంలో ఒకసారి చెక్‌ చేయండి అని కౌషికి చెప్తుంది. ఇంతలో పోలీసులు వస్తారు. ఎవరు రమ్మన్నారు అని సుధాకర్‌ అడిగితే నిషిక తానే రమ్మన్నాను అంటుంది.

నిషిక: ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగ దొరికింది కానీ దొంగతనం చేసిన నెక్లెస్‌ ఇవ్వను అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిలవాల్సింది పోలీసులనే కదా మామయ్య.

కౌషికి: నువ్వు జగధాత్రి మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చావా? నీకేమైనా పిచ్చి పట్టిందా నిషి.

అనగానే నిషికి కోపంగా ఈ మాట ధాత్రికి చెప్పాల్సింది అంటుంది. ఇంతలో పోలీసులు ధాత్రిని స్టేషన్‌కు రావాలని చెప్పడంతో కేదార్‌ ఏ ఆధారంతో ధాత్రిని స్టేషన్‌కు తీసుకెళ్తారు అని అడగడంతో నిషిక నిన్న రాత్రి నేను లేనప్పుడు నా రూంలోకి ఎందుకు వెళ్లినట్లు అంటూ అడుగుతుంది దీంతో కౌషికి పోలీసులను వెళ్లిపోమ్మని చెప్పడంతో పోలీసులు వెళ్లిపోతారు.

కౌషికి: పోలీసులను పిలిచే ముందు నాకు ఒక్కమాట చెప్పాలని అనిపించలేదా? ఏం చేసినా చూసి చూడనట్లు ఉంటున్నాను అంటే నీకు నచ్చింది చేసుకోమని కాదు. బాధ్యత తెలుసుకుంటావని..

నిషిక: చెప్పలేదు అంటున్నారు కానీ ఎందుకు చెప్పలేదో అడగడం లేదు ఎందుకు వదిన ఎందుకో నేను చెప్పనా నేరం ఆరోపణ అయ్యింది ధాత్రి మీద కాబట్టి. నేను ఎంత చెప్పినా మీరు పోలీసులను పిలవటానికి ఒప్పుకోరు కాబట్టి.

కౌషికి: జగధాత్రి దొంగతనం చేయలేదు.

నిషిక: జగధాత్రే దొంగతనం చేసింది. అరిచినంత మాత్రానా నిజం అబద్దం కాదు.

అంటూ నిషిక కోపంగా వెళ్లిపోతుంది. దీంతో ఆ నగను ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు టైం పన్నెండు అవుతుంది. వన్‌ కల్లా ఆ నగను టేబుల్‌ మీద పెడతాను అంటుంది ధాత్రి.  దీంతో కౌషికి, ధాత్రి, కేదార్‌ కలిసి నిషిక రూంలోకి వెళ్లి రూం అంతా వెతుకుతారు. రూంలో ఏ ఆధారం దొరకలేదని అచ్చం పోలీసులు మాట్లాడుకున్నట్లు కేదార్‌, ధాత్రి మాట్లాడుకోవడంతో కౌషికి అనుమానిస్తుంది.

కౌషికి: మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు. మీరు స్కూల్‌ టీచర్స్‌ కదా మరేంటి పోలీసు ఆఫీసర్లలా మాట్లాడుతున్నారు. అడుగుతుంటే అలా ఉండిపోయారేం.?

ధాత్రి: అంటే వదిన సినిమాల్లో చూపిస్తారు కదా

కేదార్‌: నాకు తెలిసిన ఎస్సై ఉన్నారని చెప్పాను కదా అక్కా ఆయనతో క్రైం జరిగిన చోటికి వెళ్లినప్పుడు విన్నాను.

కౌషికి: ఓ చూసే ఇంత నేర్చుకున్నారంటే మీరు చాలా గ్రేట్‌..

అనగానే ధాత్రి సరే అంటూ లోపలికి వెళ్లి లాకర్‌ చెక్‌ చేసి ఇంట్లో వాళ్లే నెక్లెస్‌ తీశారని అది ప్రూవ్‌ చేయడానికి మీ హెల్ఫ్‌ కావాలని ధాత్రి, కౌషికిని అడుగుతుంది. దీంతో తానేం చేయాలో చెప్పమని కౌషికి అడుగుతుంది. దీంతో ఏం చేయాలో ధాత్రి, కౌషికికి చెప్తుంది. మరోవైపు హాల్లో కూర్చున్న  నిషిక, వైజయంతి, కాచి, బూచి ధాత్రిని తిడుతుంటారు. సుధాకర్‌ కోపంగా అందర్ని  తిట్టి ఊరుకోండని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

Also Read: 'ఇష్క్' కాంబో ఈజ్ బ్యాక్... ఫ్లాప్ * ఫ్లాప్ = హిట్?

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget