అన్వేషించండి

Jagadhatri Serial Today February 23rd: ‘జగధాత్రి’ సీరియల్‌: జైల్లో రౌడీలను చితకబాదిన కేదార్‌ - బాంబు పెట్టింది యువరాజేనన్న నిజం తెలుసుకున్న ధాత్రి

Jagadhatri Today Episode: కేదార్ కు బాంబు గిఫ్ట్ గా పంపింది యువరాజేనని ధాత్రి కి తెలియడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ జరిగింది.

Jagadhatri  Serial Today Episode: అందరూ  జైలుకు వెళ్లి సుధాకర్‌ను కలుస్తారు. అయితే అందరూ మాట్లాడుతుంటే ధాత్రి మాత్రం సుధాకర్‌ పెదవికి గాయం అవ్వడం గమనించి పెదవికి ఏమైందని అడుగుతుంది. దీంతో సుధాకర్‌ తో సహా అందరూ  షాక్‌ అవుతారు. సుధాకర్‌ తనను ఎవరో కొట్టింది గుర్తు చేసుకుని బయటకు మాత్రం నన్ను ఎవరూ ఏమీ అనలేదని బాత్రూం డోర్‌ తగిలిందని అబద్దం చెప్తాడు. అయితే సుధాకర్‌ చెప్పిన అబద్దాన్ని ధాత్రి పసిగడుతుంది. వెంటనే లోపల ఏమైందని అడుగుతుంది. మీ మీద ఎవరు చేయి చేసుకున్నారు అంటూ ప్రశ్నించడంతో సుధాకర్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో సెంట్రీ వచ్చి సార్‌ టైం అవుతుంది అనగానే కేదార్‌ సార్‌కు ఆ దెబ్బ ఎలా తగిలింది అని అడగ్గానే పొద్దునే ఆ సూరి వాళ్లతో గొడవ జరిగినట్లుంది. అప్పుడే ఆ దెబ్బ తగిలినట్లుంది అని చెప్తాడు.

ధాత్రి: మామయ్యా గారు ఫ్లీజ్‌ జరిగిందేంటో చెప్పండి.

సుధాకర్‌: ఇందాకా ముఖం కడుకుందామని వెళ్లినప్పుడు..

అంటూ లోపల రౌడీలతో జరిగిన గొడవ గురించి చెప్తాడు. రౌడీలు తనను కొట్టిన విషయం చెప్పగానే అందరూ బాధపడతారు. కేదార్‌, యువరాజ్‌ ఆవేశంగా జైలు లోపలికి వెళ్తారు. జైలర్‌తో సుధాకర్‌ గారిని కొట్టింది ఎవరని అడుగుతారు. దూరం నుంచి గమనిస్తున్న  రౌడీలు కేదార్‌, యువరాజ్‌ లను రెచ్చగొట్టడంతో యువరాజ్‌ ఆవేశంగా సూరి వైపు వెళ్లడంతో దగ్గరకు వచ్చిన యువరాజ్‌ను గుర్తు పట్టిన సూరి నువ్విక్కడున్నావేంటి? అని అడుగుతాడు. ఆయన మా నాన్న అని చెప్పి వెళ్లిపోతాడు. సూరి, కేదార్‌ను చూసి సుధాకర్‌ను చంపేస్తాం అన్నట్లు సైగ చేస్తాడు. దీంతో ఆవేశంగా కేదార్‌ రౌడీల మీదకు వెళ్లి  కొడతాడు. ఇంకోసారి మా నాన్న వైపు చూసినా చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చి వెళ్తాడు కేదార్‌.

ధాత్రి: నిన్నెప్పుడూ ఇంత కోపంగా చూడలేదు కేదార్‌.

కేదార్‌: నాన్న రక్తాన్ని కళ్ల చూశాడు ధాత్రి వాడు. ఏదో ఒకటి చేసి నాన్నని బయటకి తీసుకురావాలి. మినిస్టర్‌ను ఎవరు మర్డర్‌ చేశారో త్వరగా కనుక్కోవాలి. వాడు నాన్నతో ప్రవర్తించిన తీరు తలుచుకుంటుంటే కోపం పెరిగిపోతుంది ధాత్రి.

ధాత్రి: ఒక కొడుకుగా నీకు కోపం రావడం కరెక్టే కానీ నువ్వు ఆ జైలర్‌ను లెక్క చేయకుండా వెళ్లి సూరిని కొట్టడం తప్పు కేదార్‌. మామయ్య గారిని అలా చూస్తుంటే నాక్కూడా కోపం వస్తుంది. కానీ మనం పోలీసులమే కదా వాళ్ల డ్యూటీ వాళ్లని చేయనివ్వాలి. ఇప్పుడు మామయ్య గారు ఆ సూరి వాళ్ల మధ్యలోనే ఉండాలి. ప్రాబ్లమ్‌ వస్తే పరిష్కరించుకోవాలి కానీ పెద్దది చేసుకోకూడదు కేదార్‌. నాకు తెలిసి నువ్వు కొట్టిందానికి ఆ సూరి మామయ్య గారి జోలికైతే రాడు. కానీ ఎందుకైనా మంచిది నువ్వు సాధు గారితో మాట్లాడి జైలర్‌ గారితో మాట్లాడమని చెప్పు.

కేదార్‌: సరే ధాత్రి

ధాత్రి: పద మనం ఇంటికి వెళ్లాలి.

అని ఇద్దరూ వెళ్లబోతుంటే జైలు గార్డుకు మీనన్‌ మనిషి ఒక పార్శిల్‌ ఇస్తాడు. వాళ్లను గమనించిన కేదార్‌. ధాత్రి వాడు నీకు తెలుసా అని అడగ్గానే తెలియదు అంటుంది ధాత్రి. నాకు ప్రేమగా బాంబు గిఫ్ట్‌ గా ఇచ్చినవాడు అని కేదార్‌ చెప్పగానే ధాత్రి షాక్‌ అవుతుంది. వెంటనే వెళ్లి వాణ్ని పట్టుకుని కొట్టడంతో వాడు బాంబు పెట్టమని చెప్పింది యువరాజ్‌ అని చెప్తాడు. దీంతో ఆవేశంగా ధాత్రి యువరాజ్ దగ్గరకు వచ్చి బాంబు ఉన్న గిఫ్ట్‌ కేదార్‌కు పంపించింది నువ్వేనా అని అడుగుతుంది. లేదని యువరాజ్‌ చెప్పగానే ధాత్రి కోపంగా యువరాజ్‌ను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: వ్యూహం మళ్లీ వాయిదా - కానీ, ఈసారి లోకేష్‌ కారణం కాదు..

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 5th: 'గోదావరి' సీరియల్: గౌతమి ఫీజు కట్టిన సూర్య! మురళీకి మంచి ఆఫర్! నందుని ఆకర్ష్ లవ్ చేస్తున్నాడా?
'గోదావరి' సీరియల్: గౌతమి ఫీజు కట్టిన సూర్య! మురళీకి మంచి ఆఫర్! నందుని ఆకర్ష్ లవ్ చేస్తున్నాడా?
Gundeninda Gudigantalu Nov5: ఇంటిని కాపాడుకోవడానికి దుబారా ఖర్చు తగ్గించుకుందామన్న బాలు..గుణ చేతలో మోసపోయి దొంగబంగారం కొన్న రోహిణి
గుండెనిండా గుడిగంటలు: ఇంటిని కాపాడుకోవడానికి దుబారా ఖర్చు తగ్గించుకుందామన్న బాలు..గుణ చేతలో మోసపోయి దొంగబంగారం కొన్న రోహిణి
Podarillu Serial Today NoV 5:మనీషాను డేట్‌కు తీసుకెళ్లిన మాధవ్‌..అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైంది..?
పొదరిల్లు: మనీషాను డేట్‌కు తీసుకెళ్లిన మాధవ్‌..అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైంది..?
Nuvvu leka Neanu Lenu Serial Today NOV5: కత్తిపోట్ల గాయాల నుంచి కోలుకున్న విక్రమ్‌...దాడికి పాల్పడిన సుపారీగ్యాంగ్‌ను పట్టుకున్న రామచంద్రం
నువ్వులేక నేను లేను: కత్తిపోట్ల గాయాల నుంచి కోలుకున్న విక్రమ్‌...దాడికి పాల్పడిన సుపారీగ్యాంగ్‌ను పట్టుకున్న రామచంద్రం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Embed widget