అన్వేషించండి

Jagadhatri Serial Today April 26th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రి, కేదార్‌ ల బండారం బయటపెట్టిన పిన్ని – నిజం చెప్పమని నిలదీసిన కౌషికి

Jagadhatri Today Episode: ధాత్రి, కేదార్లు భార్యభర్తలు కాదని కౌషికి వాళ్ల పిన్ని నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: జరిగిందేదో మన మంచికే జరిగిందని ఇకనన్నా ఆ సంబంధం గురించి వదిలేసి మనకు తగ్గ సంబంధం చూసుకుందామని నిషిక అనగానే కౌషికి సీరియస్‌ అవుతుంది. నువ్వు అన్నంత ఈజీగా ఉండదు ఈ వ్యవహారం. ఇది ఒక ఆడపిల్ల జీవితం. నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిందంటే ఎలా ఉంటుంది. మన కుటుంబం పరువేం కావాలి అంటూ కౌషికి తిడుతుంది. దీంతో నిషిక ఫీల్‌ అవుతుంది. ఇద్దరిని సుధాకర్‌ వారిస్తాడు. ఇంతలో ఊరి నుంచి వైజయంతి వాళ్ల పిన్ని వస్తుంది. అందరూ డల్‌గా ఉండటం చూసి

పిన్ని: ఏమి మెహాలు అట్టా పెట్టి ఉండారు. కొంపతీసి నిశ్చితార్థం ఆగిపోయిందా ఏంటి?

నిషిక: లేదు అమ్మమ్మ జరిగింది.

పిన్ని: హమ్మయ్యా.. పోనీలే మీ ముఖాలు చూసి ఏ అశుభవార్త చెప్తారోనని భయపడ్డాను. మరి నవ్వులతో నిండాల్సిన ఈ ఇంట్లో ఈ నిశ్శబ్దం ఏమీ అమ్మి.

కౌషికి: ఇలా ఉంగరం పెట్టగానే అలా పోలీసులు వచ్చి పెళ్లికొడుకును తీసుకెళ్లిపోయారు నాన్నమ్మ.

పిన్ని: ఏమీ వైజయంతి నిజమా? అసలు ఏమైంది?

వైజయంతి: అదో పెద్ద కథలే రాత్రికి తీరిగ్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాము. ఎండన పడి వచ్చినట్టున్నావు కదా ముందు చల్లగా ఏదైనా తాగు. కాచి పోయి తీసుకురాపో..

కాచి: అలాగే పెద్దమ్మ ఇప్పుడే తెస్తాను.

పిన్ని: ఈ ముచ్చు ముఖం పిల్ల ఎవరే?

వైజయంతి: మనవడి పెళ్లికి వచ్చి ఉంటే కదా ఎవరో ఎంటో తెలిసి ఉండేది.

పిన్ని: ఓహో మన యువరాజుకు యువరాణినా..? ముఖంలో అసలు కలే కనిపించడం లేదురా?

నిషిక: మీ అందం ముందు మా లాంటి వాళ్లం ఎక్కడ తూగుతాం లేండి నాన్నమ్మ గారు.

పిన్ని: అది కూడా నిజమే అనుకో.. ఆహా చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారు. ఇంతకీ వీళ్లిద్దరు ఎవరే?

వైజయంతి: నిషిక వాళ్ల అక్క, ఆ అమ్మాయి భర్త పిన్ని.

ధాత్రి: మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నమ్మ గారు.

పిన్ని: చల్లగా ఉండండి. చూసి నేర్చుకోండ్రా.. ఏ అమ్మీ నువ్వు కూడా నేర్చుకో..

ధాత్రి: ఏమైంది నాన్నమ్మ గారు అలా చూస్తున్నారు.

పిన్ని:  మిమ్మల్ని ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు.

కేదార్‌: మమ్మల్నా.. ఎక్కడ అమ్మమ్మగారు.

 అనగానే ఈ అమ్మాయిని నేను గుడిలో చూశాను. అనగానే గుడిలో ఎంతో మంది ఉంటారు. అంతమందిలో వీళ్లనే ఎలా గుర్తుపెట్టుకున్నావు అంటూ నిషిక అడగ్గానే అవును చాలా మంది ఉంటారు. కానీ ఈ అమ్మాయి తాళి తన మెడలో వేసుకుంది అందుకే నాకు గుర్తుండిపోయింది. అంటూ పిన్ని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. మీరు పొరపాటు పడుతున్నారు అంటూ ధాత్రి చెప్పినా పిన్ని వినదు. నేను చూసింది మిమ్మల్నే అని కరాకండిగా చెప్పగానే నిషిక కోపంగా ధాత్రి, కేదార్‌లను తిడుతుంది. ఇంతలో కౌషికి కూడా ధాత్రి, కేదార్‌లను మీరు నిజంగా భార్యభర్తలు కాదా? అంటూ నిలదీస్తుంది. వైజయంతి, సుధాకర్‌ కూడా మీరు నిజంగా భార్యభర్తలేనా అంటూ నిలదీసినా కేదార్‌, ధాత్రి పలకకుండా ఉండిపోతారు. దీంతో వైజయంతి కేదార్‌ మీద ఒట్టేసి నిజం చెప్పు అనగానే..

ధాత్రి: లేదు..

కౌషికి: అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశారా?

ధాత్రి: అవును. మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నా మెడలో తాళి కేదార్‌ కట్టలేదు. మేము ప్రేమించుకోలేదు.

పిన్ని: అది అట్టా చెప్పు అమ్మి.

అనగానే కౌషికి కోపంగా కేదార్‌ చెంప పగులగొడుతుంది. ఎంతో పవిత్రమైన పెళ్లి విషయంలో అబద్దం చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు.  మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అంటూ తిడుతుంది. దీంతో నిషిక కోపంగా ఇంకా వీళ్లతో మాటలేంటని.. బయటకు గెంటి వేసినట్టు ధాత్రి కలగంటుంది. ఇదంతా కళా ఒట్టు పెట్టి నిజం చెబితే ఒక సమస్య చెప్పకపోతే ఇంకో సమస్యా అంటూ మనసులో అనుకుంటుంది ధాత్రి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget