అన్వేషించండి

Jagadhatri Serial Today December15th: విషం కలిపిన పాయసం తిన్న సుధాకర్‌కు ఏమవుతంది..? జగధాత్రియే జేడీ అన్న విషయం మీనన్‌కు తెలిసిపోతుందా..?

Jagadhatri Serial Today Episode December 15th: విష ఆహారం తిన్న సుధాకర్‌ను ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా...అతన్ని కిడ్నాప్ చేసేందుకు మీనన్‌ చేసిన ప్రయత్నాలను జగధాత్రి ఎలా అడ్డుకుంది.

Jagadhatri Serial Today Episode: హోంమినిస్టర్‌ అనుచరుడితో ఎలాగైనా నిజం చెప్పించాలని భావించిన జగధాత్రి...ఓ చిన్నారి చేతికి మిరపకాయ బజ్జీ ఇచ్చి అతని నోట్లో పెట్టేలా చేస్తుంది. దీంతో అతను ఆ బజ్జీని తినడంతో....విషం మిరపకాయ బజ్జీల్లో లేదని తేలుతుంది.అంటే ఇక పాయసంలో మాత్రమే విషం కలిపారని వారికి అర్థమవుతుంది. ఇంతలోనే పాయసం తీసుకుని అందరికీ ఇవ్వడానికి నిషిక వెళ్తుండటాన్ని  జగధాత్రి చూసి పరుగులు పెడుతుంది. ఆమె చేతిలో ఉన్న పాయసం గిన్నెలను విసిరి కొడుతుంది. దీంతో నిషి కోప్పడగా...చూడక  చేయి తగిలిందని అబద్ధం చెబుతుంది. ఈలోగా  జగధాత్రివాళ్ల మామయ్య సుధాకర్ పాయసం తినేస్తాడు. అంతలోనే నోటి నుంచి నురగ కక్కుతూ కిందపడిపోతాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తారు.
   
   యువరాజు తాను చెప్పిన మాట వినడం లేదని...వాడిని కంట్రోల్‌లో పెట్టాలంటే ఐసీయూలో  ఉన్న వాళ్ల సుధాకర్‌ను కిడ్నాప్ చేసి తన దగ్గర పెట్టుకోవడానికి మీనన్‌  ఆస్పత్రికి బయలుదేరతాడు. ఇంతలో ఆస్పత్రిలో కేధార్‌,యువరాజు గొడవపడతారు. మానాన్నను చంపడానికి నువ్వే ప్రయత్నించావ్‌ అంటూ యువరాజు కేదార్ చొక్కా పట్టుకుంటాడు. మా నాన్నను ఎందుకు చంపాలనుకున్నావ్‌ అని నిలదీస్తాడు. భోజనాలు మొదలైన దగ్గర నుంచీ కేదార్, జగధాత్రి కంగారుపడుతూనే ఉన్నారని అంటాడు. పాయసం కూడా కావాలనే కిందపడేశారని నిషిక అంటుంది. మామయ్య కిందపడిపోగానే కూడా...పాయసం తిన్నారా అని ఎందుకు అడిగారని నిలదీస్తుంది. అసలు పాయసంలో విషం కలిసిన సంగతి మీకు ఎలా తెలిసిందని అంటారు. వీళ్ల అమ్మ బోర్డు తీసేసి మినిష్టర్ బోర్డు పెట్టడంతో కోపంతోనే పిల్లలు తినే పాయసంలో  జగధాత్రియే విషం కలిపిందని నిషిక అంటుంది. దీంతో ధాత్రి కోపంతో రగిలిపోతుంది. పాయసంలో విషం కలిసిన మాట నిజమేనని...కాకపోతే ఆ విషం కలిపింది మేము కాదని...మినిష్టర్ తాయార్ అని అరిచి చెబుతుంది. దొరికిపోయే సరికి మొగుడు, పెళ్లాలు ఇద్దరూ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారా అంటూ నిషిక నిలదీస్తుంది. ఇంతలో కౌషికి కల్పించుకుని ధాత్రి చెబుతుంది నిజమేనని అంటుంది. మన ఫ్యామిలీ పరువు తీయాలనే మినిష్టర్ ఇలాంటి పనిచేసిందిని చెబుతుంది. ధాత్రి...మన పరువు కాపాడిందని అంటుంది.

   సుధాకర్‌ను కిడ్నాప్ చేసేందుకు  ఆస్పత్రికి వచ్చిన మీనన్‌కు  అక్కడే జగధాత్రి వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఉండటం చూసి నిరాశ చెందుతాడు. వెంటనే అనుచరుడు దేవాతో కలిసి డాక్టర్‌, నర్సు వేషం వేసుకుని ఐసీయూలోకి వెళ్తారు. వాళ్లను గమనించిన  కేధార్‌, జగధాత్రికి అనుమానం వస్తుంది. డాక్టర్ చూపుల్లో ఏదో తేడా ఉందని ధాత్రి అంటుంది. వీళ్ల వాలకం చూస్తుంటే ఇక్కడ ఏదో జరుగుతోందని అంటుంది. ఇంతలో లోపలకి వెళ్లిన మీనన్‌....డాక్టర్‌ను బెదిరించి సుధాకర్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో సుధాకర్‌ మీనన్‌పై మండిపడతాడు.నా కొడుకును అడ్డుపెట్టుకుని మా ఫ్యామిలీని ఎందుకు వేధిస్తున్నావని నిలదీస్తాడు. నీకు ఏం కావాలని అడుగుతాడు. 
  
   జగధాత్రి, కేదార్ ఇద్దరూ రిసెప్షన్ వద్దకు వెళ్లి డ్యూటీ డాక్టర్‌ల లిస్ట్ పరిశీలిస్తారు. దీంతో వచ్చిన వాళ్లు మీనన్‌ అని వారికి అర్థమవుతుంది. బెదిరించడానికి మామయ్యగారిని ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని ధాత్రి చెబుతుంది. ఇంతలో వారిద్దరూ ఐసీయూలోకి వెళ్లగా పేషెంట్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని డాక్టర్‌ చెబుతాడు.ఇంతలో ధాత్రి వచ్చి ఈ విషయం అందరికీ చెప్పి తలోదిక్కు వెళ్లి వెతకమని ఆదేశిస్తుంది. అప్పుడే  సుధాకర్‌ను తీసుకెళ్తున్న మీనన్ ఆమెకు ఎదురుపడతాడు. అయితే జగధాత్రియే జేడీ అని సంగతి తెలియదు. తాను కూడా ఈ విషయం బయటపడకుండా  జాగ్రత్తపడుతుంది. అదే సమయంలో  మీనన్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ కూడా ఇస్తుంది. మా మామయ్యను వదిలివెళ్లాలని చెబుతుంది. తనే జేడీ అని తెలియక...మీనన్ వాళ్ల అనుచరులను  జగధాత్రి మీదకు పంపుతాడు. వాళ్ల నుంచి ఆమె జేడీలా తప్పించుకోవడం చూసి మీనన్ ఆశ్చర్యపోతాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Oct 28: దసరా నవరాత్రులకు అనుమతి సంపాదించిన బాలు...దేవుడి గుడివద్ద కుటుంబంతో కలిసి పూజలు
గుండెనిండా గుడిగంటలు: దసరా నవరాత్రులకు అనుమతి సంపాదించిన బాలు...దేవుడి గుడివద్ద కుటుంబంతో కలిసి పూజలు
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 28:శీనయ్య బతికే ఉన్నాడని తెలుసుకున్న దమయంతి,భవానీశంకర్..తండ్రీకూతుళ్లను చంపేందుకు పథకం
నువ్వులేక నేను లేను: శీనయ్య బతికే ఉన్నాడని తెలుసుకున్న దమయంతి,భవానీశంకర్..తండ్రీకూతుళ్లను చంపేందుకు పథకం
Podarillu Serial Today Oct 28: నారాయణను తిట్టిన కన్నాపై చేయిచేసుకున్న మహా...తండ్రి గొప్పతనం కొడుకులు చెప్పిన మహాలక్ష్మీ
పొదరిల్లు: నారాయణను తిట్టిన కన్నాపై చేయిచేసుకున్న మహా...తండ్రి గొప్పతనం కొడుకులు చెప్పిన మహాలక్ష్మీ
Nindu Noorella Saavasam Serial Today October 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రోడ్ల మీద పిచ్చోడిలా తిరుగుతున్న పార్థు – పార్థు గతం మర్చిపోయాడని తెలుసుకున్న వైజయంతి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రోడ్ల మీద పిచ్చోడిలా తిరుగుతున్న పార్థు – పార్థు గతం మర్చిపోయాడని తెలుసుకున్న వైజయంతి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Embed widget