అన్వేషించండి

Jagadhatri Serial Today August 6th: జగద్ధాత్రి సీరియల్: కౌషికిని దారుణంగా అవమానించిన నిషిక, యువరాజ్.. జేడీ, కేడీలు అండగా నిలుస్తారా?

Jagadhatri Serial Today Episode August 6th కౌషికినే హత్య చేసిందని నిషిక, యువరాజ్‌లు నానా మాటలు అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు మేనేజర్ హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆఫీస్‌లో ఒకమ్మాయి కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లారని చెప్తాడు. ఇక యువరాజ్, నిషికలు మాట్లాడుకుంటారు. ఎన్ని సార్లు కౌషికి మీద ప్లాన్ చేసినా తనని ఏం చేయలేకపోయాం.. ఇప్పుడు మాత్రం అక్క ఏం చేయకుండా ఇరుక్కుంది. ఇప్పుడు కౌషికిని కోర్టుకి తీసుకెళ్తారు కదా ఎవరైనా సాక్ష్యం మార్చకుండా మనం ఆఫీస్‌లో ఇద్దరు ముగ్గురిని మన వైపు తిప్పుకొని అక్కడ చూసింది చూసినట్లు సాక్ష్యం చెప్పించాలి అని యువరాజ్ అంటాడు. 

యువరాజ్ మాటలకు నిషిక మనమే సాక్ష్యం చెప్దామని అంటుంది. మనం సాక్ష్యం చెప్తే అక్క మనల్ని ఇంట్లో ఉండనివ్వదు అని యువరాజ్ అంటాడు. దానికి నిషిక మన సాక్ష్యంతో వదిన జైలుకెళ్తుంది. ఇళ్లు, వ్యాపారాలు మన చేతికి వస్తే ఇక మనల్ని ఎవరు ఏం చేస్తారు అని అంటుంది. జగద్ధాత్రి, కేథార్ గురించి యువరాజ్ అడిగితే మన ఇంట్లో వాళ్లని అసలు ఉండనిస్తే కదా వాళ్లేదో చేయడానికి అని అంటుంది. 

వైజయంతి దిగులుగా వచ్చి కౌషికి వెంట మీ మామయ్య వెళ్లారు.. ఆ జగద్ధాత్రి, కేథార్ కూడా వెళ్లారు కదా కౌషికి బయటకు వచ్చేస్తుందేమో అని అంటుంది. అలాంటిది ఏం జరగదు వదినకు జైలే గతి ఇక ఇంటికి రాదు అని నిషికి అంటుంది. ఇంతలో జగద్ధాత్రి, కేథార్, సుధాకర్ ఇంటికి వస్తారు.  కౌషికి రాలేదని సంబర పడిన నిషిక వాళ్లకి పెద్ద షాక్ తగులుతుంది. కేథార్ వాళ్లు కౌషికిని తీసుకొస్తారు. ముగ్గురు ఇలా జరిగింది ఏంటి అని బిత్తరపోతారు. మనిస్టర్‌తో బెయిల్ ఇప్పించి తీసుకొచ్చానని సుధాకర్ అంటాడు. ఇంత పెద్ద కేసులో బెయిల్ ఎలా ఇచ్చారని యువరాజ్ అడిగితే అలా అడుగుతావేంటి అని సుధాకర్ అంటాడు. రెండు రోజుల్లో హత్య ఎవరు చేసిందో కనిపెట్టకపోతే మళ్లీ జైలుకి తీసుకెళ్తారని కేథార్ అంటాడు. 

నిషిక, యువరాజ్, వైజయంతిలు ఈ రెండు రోజులకు బయటకు ఎందుకు వచ్చావ్ మూడు రోజుల ముచ్చటే అదేదో జైలుకి వెళ్లిపోతే బెటర్ అంటారు. నీ పిల్లల పరిస్థితి ఏంటా అని నిషిక అంటే కాచి నిషికతో మా అక్క ఏం చేయలేదు.. ఒకవేళ ఏమైనా జరిగితే పిల్లల్ని మేం చూసుకుంటాం అని కాచి అంటే నీకే పిల్లలు లేరు.. నువ్వొక గొడ్రాలివి అని అవమానిస్తారు. కేథార్, జగద్ధాత్రి మేం అంతా చూసుకుంటాం కౌషికిని మేం ఏం తప్పు చేయలేదు అని నిరూపిస్తామని కేథార్ అంటాడు. దాంతో మీరేంటి ఎప్పుడూ పోలీసుల్లా మాట్లాడుతారు అని ప్రశ్నిస్తారు. జగద్ధాత్రి కవర్ చేస్తుంది. 

కౌషికి ఈ కేసు నుంచి బయట పడటం కష్టమని అంటుంది. సుధాకర్ కూడా కష్టమే ఏం చేద్దాం అని అనుకుంటారు. ఇంతలో న్యూస్‌లో కౌషికి మర్డర్ కేసు గురించి టీవీలో వస్తుంది. యువరాజ్ కౌషికితో ఒక మనిషి ప్రాణం తీసేసింది అని అంటాడు. దాంతో కేథార్ అక్క గురించి ఇంకొక్క మాట అన్నా ఊరుకోను అంటాడు. వైజయంతి కేథార్ మీద అరుస్తుంది. దాంతో కౌషికి వెళ్లిపోతుంది. జగద్ధాత్రి, కేథార్ వెనకాలే వెళ్తారు. మర్డర్ చేసి ఇంటి పరువు తీసేసిందని సుధాకర్‌తో నిషిక అంటే మీరు ఎన్ని తప్పులు చేసినా మిమల్ని ఇంట్లో ఉంచింది కదా అదే తన తప్పు అని ఛీ కొట్టి సుధాకర్ వెళ్లిపోతాడు. చేయని తప్పునకు బలైపోతానా తట్టుకోలేకపోతున్నా ధైర్యం సరిపోవడం లేదు.. ఇంట్లో వాళ్లే ఇలా మాట్లాడుతున్నారని కౌషికి చెప్తుంది. కేథార్, జగద్ధాత్రిలు ధైర్యం చెప్తారు. ఈ కేసుని జేడీ, కేడీలు తీసుకున్నారని తెలుస్తుంది. వాళ్లు ఉండగా నాకు ఏం కాదని ధైర్యంగా ఉందని కౌషికి చెప్తుంది. కేథార్, జగద్ధాత్రిలు అండగా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. మరోవైపు కాచి తనని నిషిక గొడ్రాలు అన్నందుకు బాధ పడుతుంది. జగద్ధాత్రి కాచి దగ్గరకు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget