అన్వేషించండి

Jagadhatri Serial Today April 3rd: సురేష్‌లో మనసులో దివ్యాంక నాటిన విషపు మొక్క ఏంటి..? కౌషికి రూమ్‌లో సురేష్‌ దేనికోసం వెతికాడు..?

Jagadhatri Serial Today Episode April 3rd:సురేష్‌లో మనసులో దివ్యాంక నాటిన విషపు మొక్క ఏంటి..? కౌషికి రూమ్‌లో సురేష్‌ దేనికోసం వెతికాడు..?

Jagadhatri Serial Today Episode: వెంకటేశ్‌ లవ్‌చేసిన అమ్మాయి డెడ్‌బాడీ కౌషికి చెందిన భూమిలో దొరకడంతోపాటు ఆమె చెవిదిద్దులు మృతదేహం కప్పిపెట్టిన మట్టిలో దొరకడంతో  ఎస్‌ఐ కౌషికిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అడ్డుకునేందుకు జగధాత్రి ఎంత ప్రయత్నించినా ఎస్‌ఐ ఆమె మాటవినడు. అప్పటికే దివ్యాంక అతన్ని కొనేయడంతో ఖచ్చితంగా కౌషికిని అరెస్ట్ చేస్తానని పంతంపడతాడు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలని అంటాడు. దీంతో ధాత్రి, కేదార్‌,సుధాకర్‌ ఆంందోళన చెందుతుండగా....నిషిక మాత్రం ఆనందపడుతుంది. 

ఒక్కసారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే ఇబ్బందని భావించిన జగధాత్రి వెంటనే సాధూసార్‌కు ఫోన్ చేసి చెబుతుంది. జరిగిన విషయం మొత్తం వివరించి...కావాలనే ఈ వ్యవహారంలో వదినను ఇరికించాలని చూస్తున్నారని చెబుతుంది. నేను చూసుకుంటానులే అని సాధూసార్ చెబుతాడు.  వెంటనే ఎస్‌ఐకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతోందని అడుగుతాడు. కౌషికిగారిని అరెస్ట్ చేస్తున్నామని చెబుతాడు. ఆమెకు చెందిన భూమిలో శవం దొరికితే అది  ఆమె చేసినట్లు ఎలా అవుతుందని సాధు నిలదీస్తాడు. కౌషికి మేడంకు చెందిన చెవిదిద్దు కూడా అక్కడ దొరికిందని అంటాడు.అది ఆమెదేనని ఫోరెన్సిక్‌ నివేదిక ఉందా అని ప్రశ్నించగా...లేదని ఎస్‌ఐ సమాధానమిస్తాడు. మరి ఎలా అరెస్ట్ చేస్తున్నావని అడుగుతాడు. 

సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేయడం కూడా నేరమేనని నీకు తెలియదా అని మండిపడతాడు. మర్యాదగా కౌషికిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడంతో ఎస్‌ఐ వెళ్లిపోతాడు. సాధుగారికి ఇదంతా ఎవరు చెప్పారని కౌషికి అడగ్గా...నేనే చెప్పానని జగధాత్రి అంటుంది. తనను మళ్లీ కాపాడినందుకు కౌషికి ధాత్రికి కృతజ్ఞతలు చెబుతుంది. అప్పుడే అయిపోలేదని దివ్యాంక అనగా....ఈ హత్యలో నీకు ఎలాంటి సంబంధం ఉందని నాకు తెలిస్తే మాత్రం నువ్వు ఇండియా ఎందుకు వచ్చానురా బాబూ అని బాధపడే వరకు వెంటాడతానని జగధాత్రి దివ్యాంకకు వార్నింగ్ ఇస్తుంది.

కౌషికి కనీసం అరెస్ట్ కాకపోవడంతో నిషిక బాధపడుతుంది. నువ్వు ఏం బాధపడొద్దని నేను చెప్పినట్లు డబ్బులు బ్యాగ్ తీసుకెళ్లి మీ వదని కప్‌బోర్డులో దాచిపెట్టమని...మిగతా కథ నేను నడిపిస్తానని దివ్యాంక చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్‌...దివ్యాంకను గట్టిగా మందలిస్తాడు. ఎందుకు ఇలా న్యాయాన్ని అమ్ముకుంటావని ప్రశ్నిస్తాడు. నేను బహిరంగంగా చేసే పని మీ ఆవిడ చీకటిలో చేస్తుందని అంటుంది. నా కౌషికి ప్రాణంపోయినా తప్పుడు పనులు చేయదని అనగా..కావాలంటే తన రూమ్‌లో వెళ్లి వెతికితే డబ్బుల సంచి దొరుకుందని అంటుంది. 

వెంకటేశ్‌ను కాపాడేందుకు అతని వద్ద లంచంగా తీసుకున్న డబ్బు అదేనని అంటుంది. నువ్వు అడిగినా కూడా ఈ డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియదని సమాధానమిస్తుందని చెబుతుంది. ఇన్నేళ్లు కౌషికి నెంబర్‌వన్‌ పొజిషన్‌లో ఉండటానికి ఈ చాటుమాటు వ్యవహారాలే కారణమని చెప్పి రెచ్చగొడుతుంది. ఇంటికి వచ్చిన సురేష్ ముభావంగా ఉండటం చూసి కౌషికి అతని దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడిగితే ఏం లేదని దాటవేస్తాడు. ఈకేసు గురించి తలచుకుంటే భయమేస్తోందని కౌషికి అంటే...నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని చెప్పి వెళ్లిపోతాడు. 

దివ్యాంక చెప్పినట్లే కౌషికి డబ్బుల సంచి తీసుకెళ్లి వైజయంతి సాయంతో కౌషికి రూమ్‌లో పెడుతుంది.దివ్యాంక చెప్పిన మాటలు పదేపదే గుర్తుకువస్తుండటంతో సురేష్ వెళ్లి కౌషికి రూమ్ వెతుకుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధాత్రి, కేదార్ ఏం వెతుకుతున్నావని అడుగుతారు. కౌషికి దాచిన డబ్బులు సంచి కోసమని చెబుతాడు. డబ్బుల సంచి ఏంటని ధాత్రి అడగ్గా...నిజం దాచిపెట్టి ఉంచేందుకు కౌషికి తీసుకున్న డబ్బులు అని అనడంతో కేదార్ మండిపడతాడు. ఈ విషయం అక్కకు తెలిస్తే ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అని అంటాడు. అసలు నీకు పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చిందని నిలదీస్తాడు. అక్క నీపై పెట్టుకున్న నమ్మకం, ప్రేమ అన్ని కోల్పోతావని అంటుండగా...ఇదంతా వింటున్న కౌషికి కేదార్‌ను వారిస్తుంది. సురేష్‌కు ఎవరూ అడ్డుచెప్పొద్దని వెతుక్కొనివ్వమని చెబుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget