అన్వేషించండి

Jagadhatri Serial Today April 1st: కౌషికి జీవితంలోకి మళ్లీ దివ్యాంక ఎందుకు వచ్చింది..? దివ్యాంకకు కౌషికి ఇచ్చిన వార్నింగ్ ఏంటి.?

Jagadhatri Serial Today Episode April 1st:కౌషికి జీవితంలోకి మళ్లీ దివ్యాంక ఎందుకు వచ్చింది..? దివ్యాంకకు కౌషికి ఇచ్చిన వార్నింగ్ ఏంటి.?

Jagadhatri Serial Today Episode: కన్న కొడుకు, కోడలు అసహ్యించుకుని వెళ్లిపోయినా...శ్రీవల్లి, జగధాత్రి తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని ఈ విషయం వైజయంతికి ఎందుకు అర్థం కావడం లేదోనని సుధాకర్ బాధపడుతుంటాడు. వాళ్లు ఆస్తికోసం రాలేదని ఈ మనిషికి ఎప్పుడు అర్థమవుతుందోనని అనుకుంటాడు.అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి ఏంటి బాబాయి బాధపడుతున్నారని అనగా...చూశావు కదా  కౌషికి ఆ యువరాజును మీ పిన్ని నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు వాడు ప్రవర్తించిన తీరు అని అంటాడు. 
 
కానీ శ్రీవల్లి, జగధాత్రి ఎలా చూసుకుంటున్నారోనని అని చెప్పి బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జగధాత్రి...మీరు ఏం బాధపడొద్దు మామయ్యగారు నాకు మా అమ్మ ఎంతో అత్తయ్యగారు కూడా అంతేనని చెబుతుంది. వాళ్లు నిజం తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటుంది. అందరం కలిసి భోజనం చేద్దామని అనగా...సుధాకర్‌ ఆకలిగా లేదని అంటాడు. మీరు తింటేనే శ్రీవల్లి తింటుందని ధాత్రి ఒత్తిడి చేస్తుంది. దత్తత కార్యక్రమం ఆగిపోయినప్పటి నుంచి శ్రీవల్లి అన్నం తినడం లేనది చెబుతుంది. నేను దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు నా కూతురువేనని సుధాకర్ అనడంతో అందరూ సంతోషంగా భోజనం చేయడానికి సిద్ధమవుతారు.
 
అప్పుడే సురేష్‌ ఓ వ్యక్తిని తీసుకుని అక్కడికి రావడం కౌషికి, ధాత్రి చూస్తారు. అన్నయ్య చాలా రోజుల తర్వాత వచ్చాడని జగధాత్రి భోజనానికి పిలుస్తుంది. అయితే సురేష్‌ వెంకటేశ్‌ను వెంటపెట్టుకుని రావడం చూసిన కౌషికి ఎందుకు ఇలా వచ్చారని అడుగుతుంది. మీతో పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి ఆయన కౌషికిని పక్కకు తీసుకెళ్తాడు. మీ కంపెనీలో షేర్లు కొనుగోలు చేయడం కోసం మీ ఎంప్లాయిన్‌ను కొనేసి మీ టెండర్‌ డిటైల్స్‌ తీసుకోవడానికి ప్రయత్నించాను కదా అని పాత విషయాలు గుర్తుచేస్తాడు. 
 
అవన్నీ మనం కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నాం కదండీ అని అంటుంది. ఆ సమయంలోనే నాకు సునీత అనే అమ్మాయి పరిచయం అయ్యిందని...మేం ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకున్నామని అంటాడు. ఈ విషయం మా పిల్లలకు చెబితే వయసు తేడా ఉందని వద్దన్నారని చెబుతాడు. దీంతో నేను ఆమెకు ఇదే విషయం చెప్పి దూరంగా ఉన్నానని అంటాడు. అయితే సునీత మాత్రం నన్ను పెళ్లిచేసుకోవాల్సిందేనని చాలారోజులు బ్లాక్‌ మెయిల్ చేసిందని అంటాడు. నేను మాత్రం ఆమెకు దూరంగానే ఉన్నానని వివరిస్తాడు. అయితే ఉన్నట్టుండీ సునీత రెండురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని....ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని చెబుతాడు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని జగధాత్రి, కౌషికి ప్రశ్నిస్తారు.
 
సునీత కనిపించకుండాపోయిన తర్వాత నాకు దివ్యాంక నుంచి ఫోన్ కాల్‌వచ్చిందని చెప్పడంతో అందరూ షాక్‌ తింటారు. తను ఫోన్ చేసి కలవాలని చెబితే కలిశానని...సునీత పేరు చెప్పి నన్ను దివ్యాంక బ్లాక్ మెయిల్‌ చేస్తోందని చెబుతాడు. తనకు రేపటికల్లా 50 కోట్లు ఇవ్వకపోతే...నా గురించి, సునీత గురించి ఛానెల్‌లో తప్పుడు ప్రసారం చేసి పరువు తీస్తానంటోందని అంటాడు. మీరే ఎలాగైనా నాకు అండగా నిలిచి నిజం అందరికీ చెప్పాలని బ్రతిమలాడతాడు. నేను సునీతపట్ల ఎలాంటి తప్పు చేయలేదని...కానీ దివ్యాంక మాత్రం నన్ను బెదిరిస్తోందని చెబుతాడు.అప్పుడే అక్కడికి వచ్చిన నిషిక, యువరాజు ఇప్పటికే మనకు ఉన్న తలనొప్పులు చాలని ఇలాంటివి పెట్టుకోవద్దని నిషికను హెచ్చరిస్తారు.
 
కానీ నువ్వు ఎప్పుడూ నిజం వైపే ఉండమని సుధాకర్ సూచిస్తాడు. మీరు తప్పు చేయనంత వరకు భయపడాల్సిన పనిలేదని...నేను మీకు అండగా ఉంటానని కౌషికి భరోసా ఇస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన దివ్యాంక...నా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులుపడతావని కౌషికిని బెదిరిస్తుంది. నువ్వు నిజంగా ఆ అమ్మాయికి సాయం చేసేదానివి అయితే వెంకటేశ్‌ను బెదిరించి డబ్బులు అడగవని కౌషికి దివ్యాంకకు వార్నింగ్ ఇస్తుంది. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు బాగా తెలుసునని అంటుంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతికిపట్టుకుని పోలీసుల ఎదుట నిలబెట్టి తీరుతానని కౌషికి శపథం చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
Nindu Manasulu Serial Today July 30th: నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 30th: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
Podarillu Serial Today July 30th: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌
పొదరిల్లు: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget