అన్వేషించండి

Jagadhatri Serial Today April 10th: మీనన్‌ ఎత్తుకు పైఎత్తు వేసి బోల్తా కొట్టించిన జేడీ...డ్రాగన్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉండేలా ఇరికించిన కేడీ..

Jagadhatri Serial Today Episode April 10th: మీనన్‌ ఎత్తుకు పైఎత్తు వేసి బోల్తా కొట్టించిన జేడీ...డ్రాగన్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉండేలా ఇరికించిన కేడీ..

Jagadhatri Serial Today Episode: జేడీ ఎత్తుకు పైఎత్తు వేయడానికి మీనన్‌ పుల్లయ్య వేషయంలోనే వాళ్ల ఇంటికి వస్తాడు.అప్పుడే అక్కడ డ్రాగన్‌కు  జేడీ, కేడీ ఇద్దరూ జాగ్రత్తలు చెబుతుంటారు.ఇంతలో మీడియా వాళ్లు అక్కడికి రాగా...ఎందుకు వచ్చారని జేడీ అడుగుతుంది. ఈ మీరామీనన్‌ వాళ్ల భర్త రమ్మని ఫోన్ చేశాడని చెబుతారు. మీనన్ ఫోన్ చేశాడా అని అడిగితే కాదని...ఎవరో పుల్లయ్య అని చెబుతుండగానే మారువేషంలోఅక్కడికి వచ్చిన పుల్లయ్య ఈ మీరామీనన్‌ అసలు పేరు పెంటమ్మని అది నా భార్య అని చెబుతాడు.దీనికి డ్రాగన్ అసలు ఒప్పుకోదు. వీడు ఎవడో కూడా నాకు తెలియదని చెబుతుంది. అప్పుడే అతను తన ఒంటిమీద ఉన్న పుట్టుమచ్చలు చెబుతాడు. అవన్నీ జైలు రికార్డుల్లో ఉన్నవి తెలుసుకుని అక్కడ చెబుతాడు.అలాగే డ్రాగన్‌తో తీసుకున్న పెళ్లి ఫొటోలు చూపించి మాయ చేస్తాడు. ఇవి చూపించే కదా....ఆ మీనన్‌ భార్య అని అందరినీ నమ్మించింది అని అంటాడు. దీంతో జేడీకి విషయం అర్థమవుతుంది. లోపలికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్లిన తర్వాత డ్రాగన్‌...పుల్లయ్యపై రంకెలేస్తుంది.ఎవడ్రా నువ్వు నా మొగుడని చెబుతున్నావని అరుస్తుంది. అప్పుడే జేడీ అసలు విషయం బయటపడుతుంది. ఇతనే మీనన్‌ అని చెప్పడంతో  డ్రాగన్ భయపడి వెనక్కి తగ్గుతుంది.

                  నేను ఈ కాంపౌండ్‌లో అడుగుపెట్టిన వెంటనే నువ్వు కనుక్కుంటావని నాకు తెలుసు జేడీ అని మీనన్ అంటాడు. ఈ ప్రపంచంలో నేను ఎలా ఉన్నా గుర్తుపట్టగలిగే ఏకైక వ్యక్తిని నువ్వేనని అంటాడు.మా సంగతి సరేగానీ...నీ బ్రెయిన్ కాస్త మొద్దుబారిందని జేడీ అంటుంది. నేను ఈ ప్లాన్ వేసి డ్రాగన్‌ను రంగంలోకి దింపిన వెంటనే నువ్వు కనిపెట్టేస్తావని అనుకుంటే.....మరీ ఇంత లేట్‌గా వచ్చావేంటని అంటుంది. అయినా నువ్వు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తున్న జేడీ ముందుకు వచ్చి కుప్పిగంతులు వేస్తున్నావేంటని కేదార్ అంటాడు. అయితే చుట్టూ చూసి మాట్లాడమని మీనన్ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ  ఉన్నది అంతా నా మనుషులేనని అంటాడు. ఆల్రెడీ మీనన్ చచ్చిపోయాడని మనమే చెప్పామని....ఇప్పుడు వీడిని తీసుకెళ్లి మీనన్ అని చెప్పినా ఎవరూ నమ్మరని జేడీ అంటుంది.కాబట్టి మనం వాడిని అరెస్ట్ చేయాలేమన్న ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నాడని అంటుంది. అందరి దృష్టిలో మీనన్ చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ డ్రాగన్‌ను నేనే పెంటమ్మగా తీసుకెళ్తానని ఎవరు ఆపుతారో చూస్తానని అంటాడు. టెక్నికల్‌గా ఇప్పుడు నీపై నేనే గెలిచానని అంటాడు. డ్రాగన్‌ను రమ్మని గట్టిగా పిలిస్తే ఆమె వెనకడుగు వేస్తుంది. ఇప్పుడు నువ్వు వాడి వెంట వెళ్లడం తప్ప మరో మార్గంలేదని చెప్పి జేడీ డ్రాగన్‌ను మీనన్ వెంట పంపిస్తుంది. ఆమెను పెంటమ్మగా తన భార్యగా మీడియాకు చెప్పి కారులో ఎక్కించుకుని వెళ్లబోతాడు మీనన్‌..
                              మీనన్ కారు దగ్గరకు వచ్చి ఆపుతుంది జేడీ....నా పరిధిలోకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావ్ మీనన్ అని బెదిరిస్తుంది. మీడియా వాళ్లను పిలిచి ఈ మీరామీనన్‌ నిజంగానే మీనన్ భార్యని మా విచారణలో తేలిందని....అచ్చం ఈమె మాదిరిగానే జైలులో పెంటమ్మ అనే ఆవిడ ఉందని చెబుతుంది. దీంతో పుల్లయ్యగారు కన్ఫూజ్‌ అయి ఆమే ఈమె అనుకుని పొరబడ్డారని అంటుంది. కాదని పుల్లయ్య వాదించగా..అయితే జైలుకు వెళ్దాం పదండి అక్కడే అన్ని విషయాలు తేలతాయని చెబుతుంది. లేదంటే రెండురోజులు మీ ఆవిడ అని చెబుతున్న ఈవిడతో ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండండని సలహా ఇస్తుంది. నిజంగా ఆవిడ మీఆవిడే అయితే నిర్భయంగా తీసుకెళ్లవచ్చని చెప్పి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. మీడియా ఉండటంతో ఏం చేయలేక మీనన్‌కు డ్రాగన్‌ను తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు.
                                     సురేష్‌ను కలుద్దామని పిలిచి జగధాత్రి, కేదార్ బయట కలుస్తారు. మీరు వదినను అపార్థం చేసుకుంటున్నారని జగధాత్రి అంటుంది. నా బిడ్డ కోసం నేను గిప్ట్‌ పంపిస్తే కూడా నేలకేసి కొట్టిందని అదంతా నేను వీడియోలో చూశానని చెబుతాడు. దీంతో అదంతా దివ్యాంక ఆడిన నాటకమని....అసలు గిప్ట్‌ నువ్వు పంపించిన విషయమే చెప్పకుండా దివ్యాంక వదినని రెచ్చగొట్టి అలా చేసిందని చెప్పడంతో సురేష్‌ బాదపడతాడు. పైగా కీర్తి బర్త్‌డేకు నిన్ను పిలవడానికి ఫోన్ చేస్తే...అప్పుడు మీ ఇంట్లోనే ఉన్న దివ్యాంక ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందని చెబుతుంది. పైగా నువ్వు ఆమె కాలికి మందురాస్తున్నది వీడియోకాల్‌లో వదినకు చూపించిందని చెప్పడంతో సురేష్ కొంత తగ్గుతాడు. అయితే కీర్తి బర్త్‌డేకు వస్తానని చెబుతాడు.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget